logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బెజ్జంకిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు ...... బెజ్జంకిలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా ఆషాఢ మాసం సందర్భంగా బెజ్జంకి గ్రామంలో పద్మశాలి, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తి పారవశ్యంతో నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను మోసుకుంటూ డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొని, పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నామని సంఘాల ప్రతినిధులు తెలిపారు.

10 hrs ago
user_ప్రభాకర్
ప్రభాకర్
Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
10 hrs ago

బెజ్జంకిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు ...... బెజ్జంకిలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా ఆషాఢ మాసం సందర్భంగా బెజ్జంకి గ్రామంలో పద్మశాలి, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తి పారవశ్యంతో నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను మోసుకుంటూ డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొని, పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నామని సంఘాల ప్రతినిధులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు
    1
    వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    36 min ago
  • కాళేశ్వరం కూళేశ్వరం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ​కాంగ్రెస్‌ మంత్రులకు గ్రావిటీపై అవగాహన లేదు బీఆర్‌ఎస్‌ నేతల ధ్వజం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన 'కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ​మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తదితరులు కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి మేడారం నంది పంప్‌హౌజ్‌, రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌ల వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ​మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్‌ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ​​మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి: 140 మీటర్లు ​మేడారం నంది పంప్‌హౌజ్‌: 230 మీటర్లు ​రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌: 331 మీటర్లు ​రామడుగు వద్ద గాయత్రి పంప్‌హౌజ్‌లో 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్‌ చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్‌మానేరులోకి నీరు తరలివెళ్తుందని స్పష్టం చేశారు. ​తెలంగాణలో కరువుకు కాంగ్రెస్‌ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్‌ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    2
    కాళేశ్వరం కూళేశ్వరం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ​కాంగ్రెస్‌ మంత్రులకు గ్రావిటీపై అవగాహన లేదు బీఆర్‌ఎస్‌ నేతల ధ్వజం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్  మండిపడ్డారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన 'కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు.
​మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తదితరులు కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి మేడారం నంది పంప్‌హౌజ్‌, రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌ల వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు.
​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
​అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
​మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్‌ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
​​మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి: 140 మీటర్లు
​మేడారం నంది పంప్‌హౌజ్‌: 230 మీటర్లు
​రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌: 331 మీటర్లు
​రామడుగు వద్ద గాయత్రి పంప్‌హౌజ్‌లో 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్‌ చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్‌మానేరులోకి నీరు తరలివెళ్తుందని స్పష్టం   చేశారు. ​తెలంగాణలో కరువుకు కాంగ్రెస్‌ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ నేతలు..  మోటార్లు నిరంతరం ఆన్‌ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండదు : రాహుల్ గాంధీ అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండడు. ప్రహ్లాద్ జోషి మన విద్యా వ్యవస్థకు, అందులోని ప్రతి విద్యార్థికి అవమానం. ఆయన ఇప్పుడు పర్యవేక్షిస్తున్న సంస్థలలో కోట్లాది మంది యువతులు చదువుకుంటున్నారు. భారతదేశ మహిళలు ప్రధాని మోదీ కొత్త విద్యాశాఖ మంత్రిని ఎన్నటికీ అంగీకరించరు.
    1
    అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన  మనిషి మరొకడు ఉండదు : రాహుల్ గాంధీ
అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండడు.
ప్రహ్లాద్ జోషి మన విద్యా వ్యవస్థకు, అందులోని ప్రతి విద్యార్థికి అవమానం. ఆయన ఇప్పుడు పర్యవేక్షిస్తున్న సంస్థలలో కోట్లాది మంది యువతులు చదువుకుంటున్నారు.
భారతదేశ మహిళలు ప్రధాని మోదీ కొత్త విద్యాశాఖ మంత్రిని ఎన్నటికీ అంగీకరించరు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
  • నిరపుత్రి పూజకు బయలుదేరిన తెలంగాణ ఆంధ్రా అయ్యప్ప సేవకులు శబరిమలలో రెండు రోజుల పాటు నిర్వహించే నిరపుత్రి పూజ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అయ్యప్ప భక్తులు, సేవకులు శబరిమలకు వరి కంకులను పెద్ద ఎత్తున తీసుకొని శబరిమల మెల్ శాంతి పూజారులకు అందచేశారు.
    1
    నిరపుత్రి పూజకు బయలుదేరిన తెలంగాణ ఆంధ్రా అయ్యప్ప సేవకులు
శబరిమలలో రెండు రోజుల పాటు నిర్వహించే నిరపుత్రి పూజ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అయ్యప్ప భక్తులు, సేవకులు శబరిమలకు వరి కంకులను పెద్ద ఎత్తున తీసుకొని శబరిమల మెల్ శాంతి పూజారులకు అందచేశారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    7 min ago
  • అనాధ వృద్ధుల ఆశ్రమంలో మహా CMD బర్త్ డే 2 Mahaa CMD Vamsi Krishna Birthday Celebrations in Nizamabad mahaa news all reporter
    1
    అనాధ వృద్ధుల ఆశ్రమంలో మహా CMD బర్త్ డే 2  Mahaa CMD Vamsi Krishna Birthday Celebrations in Nizamabad mahaa news all reporter
    user_Boss
    Boss
    Photographer భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు... ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేత శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గింది. అధికారులు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20 టిఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. నంది పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెందిన 15750 క్యూసెక్కుల నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గాయిత్రి పంప్ హౌస్ నుంచి 10500 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు మరో 5250 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు పంపిస్తున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోతల జలాలను ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంలో భాగంగా వరదకాలువ ద్వారా ఎగువన ఉన్న రాంపూర్ పంప్ హౌస్ కు గోదావరి జలాలు తరలిస్తున్నారు. అక్కడినుంచి గ్రావిటీ ద్వారా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ లోకి.. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ముష్కల్ పంప్ హౌస్ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఈ రివర్స్ పంపింగ్ విధానంలో గ్రావిటీ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పంపించి నిలువ చేస్తారు. సాగు, తాగునీటి అవసరాలకు మళ్లీ ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతంలోకి విడుదల చేస్తారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
    3
    ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు... ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేత
శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గింది. అధికారులు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20  టిఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. నంది పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెందిన 15750 క్యూసెక్కుల నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని
గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గాయిత్రి పంప్ హౌస్ నుంచి 10500 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు మరో 5250 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు పంపిస్తున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోతల జలాలను ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంలో భాగంగా వరదకాలువ ద్వారా ఎగువన ఉన్న రాంపూర్ పంప్ హౌస్ కు గోదావరి జలాలు తరలిస్తున్నారు. అక్కడినుంచి గ్రావిటీ ద్వారా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ లోకి.. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ముష్కల్ పంప్ హౌస్ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఈ రివర్స్ పంపింగ్ విధానంలో గ్రావిటీ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పంపించి నిలువ చేస్తారు. సాగు, తాగునీటి అవసరాలకు మళ్లీ ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతంలోకి విడుదల చేస్తారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • సిరిసిల్లలో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల లో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా
    1
    సిరిసిల్లలో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల లో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • సికింద్రాబాద్ బోనాల్లో అమెరికా కాన్సుల్ జనరల్........... సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ. విలియమ్స్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. లారా ఈ. విలియమ్స్ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను మంత్రి వివరించారు. తెలంగాణ-అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు
    1
    సికింద్రాబాద్ బోనాల్లో అమెరికా కాన్సుల్ జనరల్...........
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ. విలియమ్స్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. లారా ఈ. విలియమ్స్ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను మంత్రి వివరించారు. తెలంగాణ-అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..! రెండు కుటుంబాల్లో విషాదం..! సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..! ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..! ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..! ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..! రెండు కుటుంబాల్లో విషాదం..! సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..! ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..! ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..! అక్కడ ఉన్న రాళ్లపై నిలబడి ఫొటోలు దిగుతుండగా, వారు నిలబడిన చోట ఒక్కసారిగా విరుచుకుపడిన నీటి కెరటం...అమాంతం వాళ్ళను సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది..! అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగా.. పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి నీటిలో కొట్టుకుపోయింది.. కాస్త దూరంగా కొట్టుకుపోతూ కనిపించిన నీతూ ను కాపాడాలనే ఆతృతతో సముద్రంలోకి వెళ్ళిన వెళ్ళిన రాము అనే యువకుడు కూడా తిరిగి బయటకు రాలేదు..! ఇద్దరు స్నేహితులు గల్లంతు కావడంతో తీవ్ర భయకంపితులైన మిగిలిన వారు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో... వారు గజ ఈతగాళ్లను పిలిపించారు.. సేఫ్టీ బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్లి గల్లంతైన యువతీ యువకుడి కోసం గాలింపు చేపట్టారు..! ....... ........
    1
    ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..!

రెండు కుటుంబాల్లో విషాదం..!


సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..!

ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం

వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..!

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..!

ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..!
రెండు కుటుంబాల్లో విషాదం..!
సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..!
ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం
వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..!
ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..!
అక్కడ ఉన్న రాళ్లపై నిలబడి ఫొటోలు దిగుతుండగా, వారు నిలబడిన చోట ఒక్కసారిగా   విరుచుకుపడిన నీటి కెరటం...అమాంతం వాళ్ళను సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది..!
అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగా.. పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి నీటిలో కొట్టుకుపోయింది.. కాస్త దూరంగా కొట్టుకుపోతూ కనిపించిన నీతూ ను కాపాడాలనే ఆతృతతో సముద్రంలోకి వెళ్ళిన వెళ్ళిన  రాము అనే యువకుడు కూడా తిరిగి బయటకు రాలేదు..!
ఇద్దరు స్నేహితులు గల్లంతు కావడంతో తీవ్ర భయకంపితులైన మిగిలిన వారు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో... వారు గజ ఈతగాళ్లను పిలిపించారు.. సేఫ్టీ బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్లి గల్లంతైన యువతీ యువకుడి కోసం గాలింపు చేపట్టారు..!
.......
........
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.