logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సికింద్రాబాద్ బోనాల్లో అమెరికా కాన్సుల్ జనరల్........... సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ. విలియమ్స్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. లారా ఈ. విలియమ్స్ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను మంత్రి వివరించారు. తెలంగాణ-అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు

9 hrs ago
user_వేణు విలేకరి
వేణు విలేకరి
హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
9 hrs ago

సికింద్రాబాద్ బోనాల్లో అమెరికా కాన్సుల్ జనరల్........... సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ. విలియమ్స్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. లారా ఈ. విలియమ్స్ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను మంత్రి వివరించారు. తెలంగాణ-అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.
    1
    బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి
బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • బెజ్జంకిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు ...... బెజ్జంకిలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా ఆషాఢ మాసం సందర్భంగా బెజ్జంకి గ్రామంలో పద్మశాలి, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తి పారవశ్యంతో నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను మోసుకుంటూ డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొని, పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నామని సంఘాల ప్రతినిధులు తెలిపారు.
    4
    బెజ్జంకిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు ...... 
బెజ్జంకిలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా
ఆషాఢ మాసం సందర్భంగా బెజ్జంకి గ్రామంలో పద్మశాలి, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తి పారవశ్యంతో నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను మోసుకుంటూ డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొని, పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నామని సంఘాల ప్రతినిధులు తెలిపారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • సమాజిక సేవతోనే సంఘం బలోపేతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ​ఘనంగా గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు కరీంనగర్ లోని ఓ వేడుక మందిరం. లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ​ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సర్వతోముఖాభివృద్ధికి, బలోపేతం కోసం నూతన కమిటీ సభ్యులు ఐక్యమత్యంతో అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ ​కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్ట పురుషోత్తం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ​ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, జిల్లా అధ్యక్షులు​ బొమ్మ రాధాకృష్ణ, ​ మార్కెట్ కమిటీ చైర్మన్ఆకుల నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
    2
    సమాజిక సేవతోనే సంఘం బలోపేతం
ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ​ఘనంగా గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం  నేడు కరీంనగర్ లోని ఓ వేడుక మందిరం. లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
​ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సర్వతోముఖాభివృద్ధికి, బలోపేతం కోసం నూతన కమిటీ సభ్యులు ఐక్యమత్యంతో అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ ​కార్యక్రమంలో 
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
పుట్ట పురుషోత్తం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు
​ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, 
జిల్లా అధ్యక్షులు​ బొమ్మ రాధాకృష్ణ, 
​ మార్కెట్ కమిటీ చైర్మన్ఆకుల నర్సయ్య 
తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • కరీంనగర్ లో కన్నుల పండువగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు.. స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ ​నగరంలో ఆదివారం పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్ట రాంపూర్ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ​ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ​ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో నగర బారాస అధ్యక్షులు చల్ల హరి శంకర్, 40 వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డివిజన్లకు చెందిన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ లో కన్నుల పండువగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు.. స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ ​నగరంలో   ఆదివారం పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్ట రాంపూర్ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.
​ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్,  ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
​ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో నగర బారాస అధ్యక్షులు చల్ల హరి శంకర్, 40 వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డివిజన్లకు చెందిన నాయకులు,  స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లస్కర్ బోనాల జాతర హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను పురస్కరించుకొని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన నివాసంలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మరియు సహచర మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, కొండా సురేఖ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది.
    1
    సికింద్రాబాద్ ఉజ్జయిని  మహంకాళి లస్కర్ బోనాల జాతర హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను పురస్కరించుకొని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన నివాసంలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మరియు సహచర మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, కొండా సురేఖ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • వేములవాడలో ముదిరాజ్ మత్స్యకారుల భవన నిర్మాణానికి భూమిపూజ రూ. 6 లక్షలతో నూతన భవనం. శంకుస్థాపన చేసిన చైర్మన్ పుల్కం రాజు ఆత్మగౌరవ ప్రతీకలుగా కుల సంఘ భవనాలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ శరవేగంగా అభివృద్ధి సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు : పుల్కం రాజు వేములవాడ పట్టణంలో స్థానిక ముదిరాజ్ మత్స్యకారుల నూతన భవన నిర్మాణానికి సుమారు ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆదివారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే పట్టణ పరిధిలోని 54 కుల సంఘాల భవన నిర్మాణాల అభివృద్ధికి ప్రతి సంఘానికి రూ. 6 లక్షల చొప్పున నిధులు కేటాయించి, పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.గతంలో అభివృద్ధి నోచుకోని కుల సంఘాలను. కానీ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే చేతల ప్రభుత్వమని నిరూపిస్తోందన్నారు. ఇటువంటి భవనాలు నిర్మించడం వల్ల ఆయా సంఘాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సంఘ సభ్యులందరూ ఒకే చోట చేరి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించు కోవడానికి, తమ సమాజ పురోగతికి సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ భవనాలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా సంఘానికి సంబంధించిన విలువైన వస్తువులు, శుభకార్యక్రమాలు మరియు పండుగల సామాగ్రిని సురక్షితంగా భద్రపరుచుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని స్పష్టం చేశారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ఇవి కేంద్ర బిందువులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ​అలాగే పట్టణాభివృద్ధిపై కొందరు చోటామోటా నేతలు సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి స్థానిక ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని చైర్మన్ హెచ్చరించారు. వేములవాడ సమగ్ర పురోగతే లక్ష్యంగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమర్థవంతమైన నాయకత్వంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర శ్రమ, దృఢ సంకల్పంతో పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు, రూపురేఖలు మార్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే చిల్లర నాయకుల మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధే వారికి చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు.​ఈ భూమిపూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుం మధు, పట్టణ కౌన్సిలర్లు తోట రాజు, కొండ రాజశేఖర్, ముదిరాజ్ మత్స్యకార సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
    1
    వేములవాడలో ముదిరాజ్ మత్స్యకారుల భవన నిర్మాణానికి భూమిపూజ
రూ. 6 లక్షలతో నూతన భవనం. శంకుస్థాపన చేసిన చైర్మన్ పుల్కం రాజు
ఆత్మగౌరవ ప్రతీకలుగా కుల సంఘ భవనాలు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ శరవేగంగా అభివృద్ధి
సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు : పుల్కం రాజు
వేములవాడ పట్టణంలో స్థానిక ముదిరాజ్ మత్స్యకారుల నూతన భవన నిర్మాణానికి సుమారు ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆదివారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే పట్టణ పరిధిలోని 54 కుల సంఘాల భవన నిర్మాణాల అభివృద్ధికి ప్రతి సంఘానికి రూ. 6 లక్షల చొప్పున నిధులు కేటాయించి, పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.గతంలో అభివృద్ధి నోచుకోని కుల సంఘాలను. కానీ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే చేతల ప్రభుత్వమని నిరూపిస్తోందన్నారు. ఇటువంటి భవనాలు నిర్మించడం వల్ల ఆయా సంఘాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సంఘ సభ్యులందరూ ఒకే చోట చేరి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించు కోవడానికి, తమ సమాజ పురోగతికి సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ భవనాలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా సంఘానికి సంబంధించిన విలువైన వస్తువులు, శుభకార్యక్రమాలు మరియు పండుగల సామాగ్రిని సురక్షితంగా భద్రపరుచుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని స్పష్టం చేశారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ఇవి కేంద్ర బిందువులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ​అలాగే పట్టణాభివృద్ధిపై కొందరు చోటామోటా నేతలు సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి స్థానిక ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని చైర్మన్ హెచ్చరించారు. వేములవాడ సమగ్ర పురోగతే లక్ష్యంగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమర్థవంతమైన నాయకత్వంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర శ్రమ, దృఢ సంకల్పంతో పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు, రూపురేఖలు మార్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే చిల్లర నాయకుల మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధే వారికి చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు.​ఈ భూమిపూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుం మధు, పట్టణ కౌన్సిలర్లు తోట రాజు, కొండ రాజశేఖర్, ముదిరాజ్ మత్స్యకార సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లాలో ఫ్రెండ్ షిప్ డే విషాదం...మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కరీంనగర్ జిల్లాలో స్నేహితుల దినోత్సవం విషాదంగా మారింది. స్నేహితులతో ఆడిపాడిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి రెండు చోట్ల ఇద్దరు పిల్లలు నీట మునిగి మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం పరిధిలో ఎల్ఎండి రిజర్వాయర్ లో స్నేహితులతో కలిసి అలుగునూర్ కు చెందిన గోల్కొండ మణిప్రసాద్(23) ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. అటు శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళిన 8 ఏళ్ళ బాలుడు రీత్విక్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
    2
    కరీంనగర్ జిల్లాలో ఫ్రెండ్ షిప్ డే విషాదం...మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు
కరీంనగర్ జిల్లాలో స్నేహితుల దినోత్సవం విషాదంగా మారింది. స్నేహితులతో ఆడిపాడిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి రెండు చోట్ల ఇద్దరు పిల్లలు నీట మునిగి మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం పరిధిలో ఎల్ఎండి రిజర్వాయర్ లో స్నేహితులతో కలిసి అలుగునూర్ కు చెందిన గోల్కొండ మణిప్రసాద్(23) ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. అటు శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళిన 8 ఏళ్ళ బాలుడు రీత్విక్  నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.