logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిరపుత్రి పూజకు బయలుదేరిన తెలంగాణ ఆంధ్రా అయ్యప్ప సేవకులు శబరిమలలో రెండు రోజుల పాటు నిర్వహించే నిరపుత్రి పూజ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అయ్యప్ప భక్తులు, సేవకులు శబరిమలకు వరి కంకులను పెద్ద ఎత్తున తీసుకొని శబరిమల మెల్ శాంతి పూజారులకు అందచేశారు.

1 hr ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
1 hr ago

నిరపుత్రి పూజకు బయలుదేరిన తెలంగాణ ఆంధ్రా అయ్యప్ప సేవకులు శబరిమలలో రెండు రోజుల పాటు నిర్వహించే నిరపుత్రి పూజ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అయ్యప్ప భక్తులు, సేవకులు శబరిమలకు వరి కంకులను పెద్ద ఎత్తున తీసుకొని శబరిమల మెల్ శాంతి పూజారులకు అందచేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్* ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
    1
    ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్*
ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • సమాజిక సేవతోనే సంఘం బలోపేతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ​ఘనంగా గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు కరీంనగర్ లోని ఓ వేడుక మందిరం. లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ​ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సర్వతోముఖాభివృద్ధికి, బలోపేతం కోసం నూతన కమిటీ సభ్యులు ఐక్యమత్యంతో అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ ​కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్ట పురుషోత్తం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ​ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, జిల్లా అధ్యక్షులు​ బొమ్మ రాధాకృష్ణ, ​ మార్కెట్ కమిటీ చైర్మన్ఆకుల నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
    2
    సమాజిక సేవతోనే సంఘం బలోపేతం
ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ​ఘనంగా గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం  నేడు కరీంనగర్ లోని ఓ వేడుక మందిరం. లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
​ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సర్వతోముఖాభివృద్ధికి, బలోపేతం కోసం నూతన కమిటీ సభ్యులు ఐక్యమత్యంతో అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ ​కార్యక్రమంలో 
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
పుట్ట పురుషోత్తం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు
​ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, 
జిల్లా అధ్యక్షులు​ బొమ్మ రాధాకృష్ణ, 
​ మార్కెట్ కమిటీ చైర్మన్ఆకుల నర్సయ్య 
తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • కరీంనగర్ లో కన్నుల పండువగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు.. స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ ​నగరంలో ఆదివారం పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్ట రాంపూర్ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ​ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ​ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో నగర బారాస అధ్యక్షులు చల్ల హరి శంకర్, 40 వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డివిజన్లకు చెందిన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ లో కన్నుల పండువగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు.. స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ ​నగరంలో   ఆదివారం పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్ట రాంపూర్ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.
​ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్,  ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
​ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో నగర బారాస అధ్యక్షులు చల్ల హరి శంకర్, 40 వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డివిజన్లకు చెందిన నాయకులు,  స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
    1
    ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు
జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 min ago
  • కవ్వాల్ గ్రామంలోని పోచమ్మ ఆలయానికి అసంపూర్తి రహదారి.. భక్తుల అవస్థలు జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఇందూర్ పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారిని సగం వరకు మాత్రమే నిర్మించి పనులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన భాగం పూర్తిగా బురదమయంగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడే పరిస్థితి నెలకొంది. వర్షాల సమయంలో ఆలయానికి చేరుకోవడం మరింత కష్టంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి రహదారిని వెంటనే పూర్తి చేసి సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు అధికారులను కోరుతున్నారు.
    2
    కవ్వాల్ గ్రామంలోని పోచమ్మ ఆలయానికి అసంపూర్తి రహదారి.. భక్తుల అవస్థలు
జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఇందూర్ పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారిని సగం వరకు మాత్రమే నిర్మించి పనులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన భాగం పూర్తిగా బురదమయంగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడే పరిస్థితి నెలకొంది. వర్షాల సమయంలో ఆలయానికి చేరుకోవడం మరింత కష్టంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి రహదారిని వెంటనే పూర్తి చేసి సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు అధికారులను కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • హెడ్ క్వార్టర్స్ క్వార్టర్ గార్డ్ ను సందర్శించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్వార్టర్ గార్డును పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా క్వార్టర్ గార్డు గదులు, పరిసరాలను పరిశీలించిన ఆయన వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
    1
    హెడ్ క్వార్టర్స్ క్వార్టర్ గార్డ్ ను సందర్శించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్వార్టర్ గార్డును పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా క్వార్టర్ గార్డు గదులు, పరిసరాలను పరిశీలించిన ఆయన వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం.. ఇటీవలే జాడి ప్రవీణ్ అనే గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ తో పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ నిషేధిత గడ్డి మందును గ్రామంలో పిచికారి చేయించినట్లుగా ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.. మంచిర్యాల లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తుండగా గడ్డిమందు పిచికారి చేసిన కారణంగానే మృతుడి ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైనట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రవీణ్ మృతదేహన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. శవ పరిక్షలు చేసిన అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
    1
    మంచిర్యాల జిల్లా//

చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం
మంచిర్యాల జిల్లా//
చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం..
ఇటీవలే జాడి ప్రవీణ్ అనే గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ తో పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ నిషేధిత గడ్డి మందును గ్రామంలో పిచికారి చేయించినట్లుగా ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు..
మంచిర్యాల లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తుండగా గడ్డిమందు పిచికారి చేసిన కారణంగానే మృతుడి ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైనట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు..
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి..
పోస్టుమార్టం నిమిత్తం ప్రవీణ్ మృతదేహన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
శవ పరిక్షలు చేసిన అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.