Shuru
Apke Nagar Ki App…
మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం.. ఇటీవలే జాడి ప్రవీణ్ అనే గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ తో పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ నిషేధిత గడ్డి మందును గ్రామంలో పిచికారి చేయించినట్లుగా ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.. మంచిర్యాల లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తుండగా గడ్డిమందు పిచికారి చేసిన కారణంగానే మృతుడి ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైనట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రవీణ్ మృతదేహన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. శవ పరిక్షలు చేసిన అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Thalapalli Ramesh
మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం.. ఇటీవలే జాడి ప్రవీణ్ అనే గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ తో పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ నిషేధిత గడ్డి మందును గ్రామంలో పిచికారి చేయించినట్లుగా ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.. మంచిర్యాల లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తుండగా గడ్డిమందు పిచికారి చేసిన కారణంగానే మృతుడి ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైనట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రవీణ్ మృతదేహన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. శవ పరిక్షలు చేసిన అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
More news from తెలంగాణ and nearby areas
- ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్* ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.1
- అటవీ అధికారుల తీరులో అసలు మార్పు రావడం లేదు: ఎమ్మెల్యే ఆగ్రహం తాను చాలాసార్లు చెప్పినా అడవి అధికారుల తీరు మారడం లేదని ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసుల ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రి అటవీశాఖ ఉన్నతాధికారి శాంతారామ్ తో ఐటిడిఏపిఓ మకరందు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడారు. అటవీ అధికారుల తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఆదివాసులను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన అటవీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- కవ్వాల్ గ్రామంలోని పోచమ్మ ఆలయానికి అసంపూర్తి రహదారి.. భక్తుల అవస్థలు జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఇందూర్ పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారిని సగం వరకు మాత్రమే నిర్మించి పనులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన భాగం పూర్తిగా బురదమయంగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడే పరిస్థితి నెలకొంది. వర్షాల సమయంలో ఆలయానికి చేరుకోవడం మరింత కష్టంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి రహదారిని వెంటనే పూర్తి చేసి సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు అధికారులను కోరుతున్నారు.2
- సమాజిక సేవతోనే సంఘం బలోపేతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు కరీంనగర్ లోని ఓ వేడుక మందిరం. లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సర్వతోముఖాభివృద్ధికి, బలోపేతం కోసం నూతన కమిటీ సభ్యులు ఐక్యమత్యంతో అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్ట పురుషోత్తం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ఆకుల నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.2
- కరీంనగర్ లో కన్నుల పండువగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు.. స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నగరంలో ఆదివారం పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్ట రాంపూర్ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర బారాస అధ్యక్షులు చల్ల హరి శంకర్, 40 వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డివిజన్లకు చెందిన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- హెడ్ క్వార్టర్స్ క్వార్టర్ గార్డ్ ను సందర్శించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్వార్టర్ గార్డును పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా క్వార్టర్ గార్డు గదులు, పరిసరాలను పరిశీలించిన ఆయన వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.1
- మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండలంలోని ముత్తేరావ్ పల్లి గ్రామంలో విషాదం.. ఇటీవలే జాడి ప్రవీణ్ అనే గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ తో పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ నిషేధిత గడ్డి మందును గ్రామంలో పిచికారి చేయించినట్లుగా ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.. మంచిర్యాల లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తుండగా గడ్డిమందు పిచికారి చేసిన కారణంగానే మృతుడి ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైనట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రవీణ్ మృతదేహన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. శవ పరిక్షలు చేసిన అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...1