logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్* ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

2 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
2 hrs ago

ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్* ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

More news from Telangana and nearby areas
  • కాళేశ్వరం కూళేశ్వరం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ​కాంగ్రెస్‌ మంత్రులకు గ్రావిటీపై అవగాహన లేదు బీఆర్‌ఎస్‌ నేతల ధ్వజం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన 'కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ​మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తదితరులు కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి మేడారం నంది పంప్‌హౌజ్‌, రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌ల వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ​మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్‌ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ​​మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి: 140 మీటర్లు ​మేడారం నంది పంప్‌హౌజ్‌: 230 మీటర్లు ​రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌: 331 మీటర్లు ​రామడుగు వద్ద గాయత్రి పంప్‌హౌజ్‌లో 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్‌ చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్‌మానేరులోకి నీరు తరలివెళ్తుందని స్పష్టం చేశారు. ​తెలంగాణలో కరువుకు కాంగ్రెస్‌ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్‌ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    2
    కాళేశ్వరం కూళేశ్వరం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ​కాంగ్రెస్‌ మంత్రులకు గ్రావిటీపై అవగాహన లేదు బీఆర్‌ఎస్‌ నేతల ధ్వజం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్  మండిపడ్డారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన 'కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు.
​మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తదితరులు కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి మేడారం నంది పంప్‌హౌజ్‌, రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌ల వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు.
​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
​అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
​మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్‌ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
​​మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి: 140 మీటర్లు
​మేడారం నంది పంప్‌హౌజ్‌: 230 మీటర్లు
​రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌: 331 మీటర్లు
​రామడుగు వద్ద గాయత్రి పంప్‌హౌజ్‌లో 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్‌ చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్‌మానేరులోకి నీరు తరలివెళ్తుందని స్పష్టం   చేశారు. ​తెలంగాణలో కరువుకు కాంగ్రెస్‌ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ నేతలు..  మోటార్లు నిరంతరం ఆన్‌ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    9 hrs ago
  • ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
    1
    ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు
జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ కాళేశ్వరం బాట... నిరంతరం నీటిని ఎత్తిపోసి మల్లన్న సాగర్ వరకు ప్రాజెక్టులన్ని నింపాలని డిమాండ్ ​ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని బిఆర్ఎస్ నేతలు మాజీమంత్రులు విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు నీళ్ళ ఎత్తిపోతలు బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా మాజీఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ నేతృత్వంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కూడిన బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. ముందుగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ను కోటిలింగాల వద్ద పరిశీలించారు. గోదావరిఝలాలను తలపై చల్లుకు కోటిలింగాలలో కోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అజ్ఞానంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు మంత్రులకు జ్ఞానోదయం కల్పించాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించారు. బాహుబలి మోటర్ల ద్వారా మిడ్ మానేర్ కు, ఎస్సారెస్పీ వరద కాలువకు గోదావరి జలాల ఎత్తిపోతలను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం కాదనడానికి ఈ నీళ్ళే నిదర్శనమని చాటి చెప్పారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. ​అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ​మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్‌ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ​తెలంగాణలో కరువుకు కాంగ్రెస్‌ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్‌ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు.
    2
    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ కాళేశ్వరం బాట... నిరంతరం నీటిని ఎత్తిపోసి మల్లన్న సాగర్ వరకు ప్రాజెక్టులన్ని నింపాలని డిమాండ్ 
​
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని బిఆర్ఎస్ నేతలు మాజీమంత్రులు విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు నీళ్ళ ఎత్తిపోతలు బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా మాజీఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ నేతృత్వంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కూడిన బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. ముందుగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ను కోటిలింగాల వద్ద పరిశీలించారు.  గోదావరిఝలాలను తలపై చల్లుకు కోటిలింగాలలో కోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అజ్ఞానంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు మంత్రులకు జ్ఞానోదయం కల్పించాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించారు. బాహుబలి మోటర్ల ద్వారా మిడ్ మానేర్ కు, ఎస్సారెస్పీ వరద కాలువకు గోదావరి జలాల ఎత్తిపోతలను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం కాదనడానికి ఈ నీళ్ళే నిదర్శనమని చాటి చెప్పారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. ​అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ​మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్‌ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ​తెలంగాణలో కరువుకు కాంగ్రెస్‌ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ నేతలు..  మోటార్లు నిరంతరం ఆన్‌ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • వర్షాకాలంలో నీటి కలుషితాన్ని అరికట్టేందుకు బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లింపు జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సర్పంచ్ సక్రు, గ్రామ కార్యదర్శి విశ్వ పర్యవేక్షణలో గ్రామపంచాయతీ సిబ్బంది బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వర్షాల కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర హానికర సూక్ష్మక్రిములు వ్యాపించే ప్రమాదం ఉండటంతో క్లోరినేషన్ నిర్వహించారు. కలుషిత నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు తాగునీటిని మరిగించి వినియోగించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.
    1
    వర్షాకాలంలో నీటి కలుషితాన్ని అరికట్టేందుకు బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లింపు
జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సర్పంచ్ సక్రు, గ్రామ కార్యదర్శి విశ్వ పర్యవేక్షణలో గ్రామపంచాయతీ సిబ్బంది బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వర్షాల కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర హానికర సూక్ష్మక్రిములు వ్యాపించే ప్రమాదం ఉండటంతో క్లోరినేషన్ నిర్వహించారు. కలుషిత నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు తాగునీటిని మరిగించి వినియోగించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.
    1
    బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి
బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • నిరపుత్రి పూజకు బయలుదేరిన తెలంగాణ ఆంధ్రా అయ్యప్ప సేవకులు శబరిమలలో రెండు రోజుల పాటు నిర్వహించే నిరపుత్రి పూజ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అయ్యప్ప భక్తులు, సేవకులు శబరిమలకు వరి కంకులను పెద్ద ఎత్తున తీసుకొని శబరిమల మెల్ శాంతి పూజారులకు అందచేశారు.
    1
    నిరపుత్రి పూజకు బయలుదేరిన తెలంగాణ ఆంధ్రా అయ్యప్ప సేవకులు
శబరిమలలో రెండు రోజుల పాటు నిర్వహించే నిరపుత్రి పూజ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అయ్యప్ప భక్తులు, సేవకులు శబరిమలకు వరి కంకులను పెద్ద ఎత్తున తీసుకొని శబరిమల మెల్ శాంతి పూజారులకు అందచేశారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • ఆదివాసుల ఆందోళన వద్దకు వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసుల వద్దకు ఎమ్మెల్యే బొజ్జు చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకులను అటవీశాఖ అధికారులు కొట్టి ఇంతవరకు అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకపు కూడా ఆదివాసులు ఆదివారం రాత్రి మూడు గంటలుగా ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వారి వద్దకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
    1
    ఆదివాసుల ఆందోళన వద్దకు వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు
జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసుల వద్దకు ఎమ్మెల్యే బొజ్జు చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకులను అటవీశాఖ అధికారులు కొట్టి ఇంతవరకు అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకపు కూడా ఆదివాసులు ఆదివారం రాత్రి మూడు గంటలుగా ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వారి వద్దకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు... ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేత శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గింది. అధికారులు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20 టిఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. నంది పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెందిన 15750 క్యూసెక్కుల నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గాయిత్రి పంప్ హౌస్ నుంచి 10500 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు మరో 5250 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు పంపిస్తున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోతల జలాలను ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంలో భాగంగా వరదకాలువ ద్వారా ఎగువన ఉన్న రాంపూర్ పంప్ హౌస్ కు గోదావరి జలాలు తరలిస్తున్నారు. అక్కడినుంచి గ్రావిటీ ద్వారా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ లోకి.. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ముష్కల్ పంప్ హౌస్ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఈ రివర్స్ పంపింగ్ విధానంలో గ్రావిటీ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పంపించి నిలువ చేస్తారు. సాగు, తాగునీటి అవసరాలకు మళ్లీ ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతంలోకి విడుదల చేస్తారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
    3
    ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు... ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేత
శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గింది. అధికారులు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20  టిఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. నంది పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెందిన 15750 క్యూసెక్కుల నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని
గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గాయిత్రి పంప్ హౌస్ నుంచి 10500 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు మరో 5250 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు పంపిస్తున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోతల జలాలను ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంలో భాగంగా వరదకాలువ ద్వారా ఎగువన ఉన్న రాంపూర్ పంప్ హౌస్ కు గోదావరి జలాలు తరలిస్తున్నారు. అక్కడినుంచి గ్రావిటీ ద్వారా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ లోకి.. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ముష్కల్ పంప్ హౌస్ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఈ రివర్స్ పంపింగ్ విధానంలో గ్రావిటీ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పంపించి నిలువ చేస్తారు. సాగు, తాగునీటి అవసరాలకు మళ్లీ ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతంలోకి విడుదల చేస్తారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బెజ్జూర్ ఆగస్టు 2 (విజయ క్రాంతి) బెజ్జూర్ మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళ విభాగం ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రాచకొండ నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ ఆదర్శ్ తెలిపారు. ఇట్టి వైద్య శిబిరానికి ఏఐసీసీ మహిళా విభాగ కార్యదర్శి అధిత శిబిరాన్ని సందర్శించారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా మారుమూల ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 274 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మునుముందు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్యవైశ్య సంఘం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సర్తాజ్ పాషా, సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి,జిల్లా అధ్యక్షురాలు పూజ, అధ్యక్షురాలు భవాని, ప్రధాన కార్యదర్శి సామ్రాజ్యలక్ష్మి, కోశాధికారి శ్రీదేవి, అదనపు కార్యదర్శి శ్రీదేవి, మాదంశెట్టి జయలక్ష్మి, సాధన, శారద, నీలిమ, సారిక,తుడూరు సాయిష్మా, డాక్టర్ అంకిత్,శoతను, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాచకొండ శ్రీ వర్ధన్, కాంగ్రెస్ నాయకులు హకీమ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
    4
    ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన 
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 
బెజ్జూర్ ఆగస్టు 2 (విజయ క్రాంతి)
బెజ్జూర్ మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళ విభాగం ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రాచకొండ నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ ఆదర్శ్ తెలిపారు. ఇట్టి వైద్య శిబిరానికి ఏఐసీసీ మహిళా విభాగ కార్యదర్శి అధిత శిబిరాన్ని సందర్శించారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా మారుమూల ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 274 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మునుముందు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్యవైశ్య సంఘం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సర్తాజ్ పాషా, సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి,జిల్లా అధ్యక్షురాలు పూజ, అధ్యక్షురాలు భవాని, ప్రధాన కార్యదర్శి సామ్రాజ్యలక్ష్మి, కోశాధికారి శ్రీదేవి, అదనపు కార్యదర్శి శ్రీదేవి, మాదంశెట్టి జయలక్ష్మి, సాధన, శారద, నీలిమ, సారిక,తుడూరు సాయిష్మా, డాక్టర్ అంకిత్,శoతను, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  రాచకొండ శ్రీ వర్ధన్, కాంగ్రెస్ నాయకులు హకీమ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.
    user_Srinivas k
    Srinivas k
    బెజ్జూర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.