Shuru
Apke Nagar Ki App…
సిరిసిల్లలో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల లో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా
సిరిసిల్ల స్వరం
సిరిసిల్లలో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల లో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా
More news from Telangana and nearby areas
- కాళేశ్వరం కూళేశ్వరం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాంగ్రెస్ మంత్రులకు గ్రావిటీపై అవగాహన లేదు బీఆర్‌ఎస్ నేతల ధ్వజం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన 'కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి మేడారం నంది పంప్‌హౌజ్, రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌ల వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి: 140 మీటర్లు మేడారం నంది పంప్‌హౌజ్: 230 మీటర్లు రామడుగు గాయత్రి పంప్‌హౌజ్: 331 మీటర్లు రామడుగు వద్ద గాయత్రి పంప్‌హౌజ్‌లో 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్‌మానేరులోకి నీరు తరలివెళ్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ కాళేశ్వరం బాట... నిరంతరం నీటిని ఎత్తిపోసి మల్లన్న సాగర్ వరకు ప్రాజెక్టులన్ని నింపాలని డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని బిఆర్ఎస్ నేతలు మాజీమంత్రులు విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు నీళ్ళ ఎత్తిపోతలు బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా మాజీఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ నేతృత్వంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కూడిన బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. ముందుగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ను కోటిలింగాల వద్ద పరిశీలించారు. గోదావరిఝలాలను తలపై చల్లుకు కోటిలింగాలలో కోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అజ్ఞానంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు మంత్రులకు జ్ఞానోదయం కల్పించాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించారు. బాహుబలి మోటర్ల ద్వారా మిడ్ మానేర్ కు, ఎస్సారెస్పీ వరద కాలువకు గోదావరి జలాల ఎత్తిపోతలను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం కాదనడానికి ఈ నీళ్ళే నిదర్శనమని చాటి చెప్పారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు.2
- జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు1
- బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.1
- ఫలంబరి దేవిగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసి కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తున్న వన దుర్గ భవాని మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు మంజీర గరుడ గంగా నది జనాలతో అభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరించారు పసుపు కుంకుమచేసుందరంగా అలంకరించారు. వివిధ రకాలపండ్లహిరాలచే అందంగా అలంకరించారు కుంకుమార్చన సహస్రనామార్చన ప్రత్యేక పూజలు a అనంతరం మంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శనం భయం కలిగించారు1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లస్కర్ బోనాల జాతర హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను పురస్కరించుకొని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన నివాసంలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మరియు సహచర మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, కొండా సురేఖ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది.1
- సిరిసిల్లలో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల లో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా1
- ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు... ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేత శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గింది. అధికారులు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20 టిఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. నంది పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెందిన 15750 క్యూసెక్కుల నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గాయిత్రి పంప్ హౌస్ నుంచి 10500 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు మరో 5250 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు పంపిస్తున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోతల జలాలను ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంలో భాగంగా వరదకాలువ ద్వారా ఎగువన ఉన్న రాంపూర్ పంప్ హౌస్ కు గోదావరి జలాలు తరలిస్తున్నారు. అక్కడినుంచి గ్రావిటీ ద్వారా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ లోకి.. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ముష్కల్ పంప్ హౌస్ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఈ రివర్స్ పంపింగ్ విధానంలో గ్రావిటీ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పంపించి నిలువ చేస్తారు. సాగు, తాగునీటి అవసరాలకు మళ్లీ ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతంలోకి విడుదల చేస్తారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.3
- ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..! రెండు కుటుంబాల్లో విషాదం..! సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..! ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..! ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..! ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..! రెండు కుటుంబాల్లో విషాదం..! సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..! ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..! ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..! అక్కడ ఉన్న రాళ్లపై నిలబడి ఫొటోలు దిగుతుండగా, వారు నిలబడిన చోట ఒక్కసారిగా విరుచుకుపడిన నీటి కెరటం...అమాంతం వాళ్ళను సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది..! అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగా.. పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి నీటిలో కొట్టుకుపోయింది.. కాస్త దూరంగా కొట్టుకుపోతూ కనిపించిన నీతూ ను కాపాడాలనే ఆతృతతో సముద్రంలోకి వెళ్ళిన వెళ్ళిన రాము అనే యువకుడు కూడా తిరిగి బయటకు రాలేదు..! ఇద్దరు స్నేహితులు గల్లంతు కావడంతో తీవ్ర భయకంపితులైన మిగిలిన వారు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో... వారు గజ ఈతగాళ్లను పిలిపించారు.. సేఫ్టీ బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్లి గల్లంతైన యువతీ యువకుడి కోసం గాలింపు చేపట్టారు..! ....... ........1