Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు
MD. YOUSUF ALI KHAN
జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు
More news from తెలంగాణ and nearby areas
- ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.1
- వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు1
- మాయాపూర్ గ్రామంలో ఘనంగా గంగ నీళ్ల జాతర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు దిలావర్పూర్ మండలం మాయాపూర్ గ్రామంలో గంగ నీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజా భజంత్రీల మధ్య గోదావరి నది నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అమ్మవారి విగ్రహాలను అభిషేకించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- వర్షాకాలంలో నీటి కలుషితాన్ని అరికట్టేందుకు బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లింపు జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సర్పంచ్ సక్రు, గ్రామ కార్యదర్శి విశ్వ పర్యవేక్షణలో గ్రామపంచాయతీ సిబ్బంది బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వర్షాల కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర హానికర సూక్ష్మక్రిములు వ్యాపించే ప్రమాదం ఉండటంతో క్లోరినేషన్ నిర్వహించారు. కలుషిత నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు తాగునీటిని మరిగించి వినియోగించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.1
- دفتر میں شہر صدر عبدالحلیم قمر کی صدارت میں اہم اجلاس منعقد ہوا۔ پولیس اور R&B محکموں میں سرکاری ملازمتوں کی بھرتیوں کے پیشِ نظر مقامی نوجوانوں اور طلبہ کو مقابلہ جاتی امتحانات کے لیے تیار کرنے کا فیصلہ کیا گیا۔ امیدواروں کے لیے مفت تحریری امتحان کی کوچنگ، جسمانی تربیت اور ماہر اساتذہ کی رہنمائی فراہم کی جائے گی۔ اس اقدام کا مقصد بے روزگار نوجوانوں کو بہتر رہنمائی اور سرکاری ملازمت کے حصول میں مدد فراہم کرنا1
- సమాజిక సేవతోనే సంఘం బలోపేతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు కరీంనగర్ లోని ఓ వేడుక మందిరం. లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సర్వతోముఖాభివృద్ధికి, బలోపేతం కోసం నూతన కమిటీ సభ్యులు ఐక్యమత్యంతో అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్ట పురుషోత్తం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ఆకుల నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.2
- ఆదివాసుల ఆందోళన వద్దకు వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసుల వద్దకు ఎమ్మెల్యే బొజ్జు చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకులను అటవీశాఖ అధికారులు కొట్టి ఇంతవరకు అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకపు కూడా ఆదివాసులు ఆదివారం రాత్రి మూడు గంటలుగా ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వారి వద్దకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.1
- సిరిసిల్లలో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల లో ముత్యాల పోచమ్మ తల్లి పలరం బండి ఊరేగింపు సందర్భంగా1
- అమ్మవారికి బోనం సమర్పించిన బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండలో వండిన బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత రెడ్డి నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నందిగుండం దుర్గామాత ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి, మరియు సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.1