Shuru
Apke Nagar Ki App…
అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండదు : రాహుల్ గాంధీ అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండడు. ప్రహ్లాద్ జోషి మన విద్యా వ్యవస్థకు, అందులోని ప్రతి విద్యార్థికి అవమానం. ఆయన ఇప్పుడు పర్యవేక్షిస్తున్న సంస్థలలో కోట్లాది మంది యువతులు చదువుకుంటున్నారు. భారతదేశ మహిళలు ప్రధాని మోదీ కొత్త విద్యాశాఖ మంత్రిని ఎన్నటికీ అంగీకరించరు.
Bachannapet, Jangoan, Telangan
అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండదు : రాహుల్ గాంధీ అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండడు. ప్రహ్లాద్ జోషి మన విద్యా వ్యవస్థకు, అందులోని ప్రతి విద్యార్థికి అవమానం. ఆయన ఇప్పుడు పర్యవేక్షిస్తున్న సంస్థలలో కోట్లాది మంది యువతులు చదువుకుంటున్నారు. భారతదేశ మహిళలు ప్రధాని మోదీ కొత్త విద్యాశాఖ మంత్రిని ఎన్నటికీ అంగీకరించరు.
More news from తెలంగాణ and nearby areas
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ కాళేశ్వరం బాట... నిరంతరం నీటిని ఎత్తిపోసి మల్లన్న సాగర్ వరకు ప్రాజెక్టులన్ని నింపాలని డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని బిఆర్ఎస్ నేతలు మాజీమంత్రులు విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు నీళ్ళ ఎత్తిపోతలు బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా మాజీఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ నేతృత్వంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కూడిన బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. ముందుగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ను కోటిలింగాల వద్ద పరిశీలించారు. గోదావరిఝలాలను తలపై చల్లుకు కోటిలింగాలలో కోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అజ్ఞానంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు మంత్రులకు జ్ఞానోదయం కల్పించాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించారు. బాహుబలి మోటర్ల ద్వారా మిడ్ మానేర్ కు, ఎస్సారెస్పీ వరద కాలువకు గోదావరి జలాల ఎత్తిపోతలను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం కాదనడానికి ఈ నీళ్ళే నిదర్శనమని చాటి చెప్పారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు.2
- ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదివారం సందర్శించి సమస్యలను పరిశీలించారు. తాగునీటి కొరత, అపరిశుభ్రత, వైద్య సిబ్బంది కొరత, ఎంఆర్ఐ స్కాన్ సేవలు లేకపోవడం, రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిని రిఫరల్ సెంటర్‌గా మార్చేశారని విమర్శిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే: కేటీఆర్ హైదరాబాద్‌లో లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,800 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశామని, హైదరాబాద్‌లోని అనేక దేవాలయాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టామని పేర్కొన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని ఆయన అన్నారు.1
- వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు.1
- జర్నలిస్టుపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టు చేసినా కూడా యజమాన్యులు ప్రశ్నించే దృష్టితో ఏర్పడింది :మాజీ మంత్రి కేటీఆర్ వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయి. మీడియా ఛానళ్లు ప్రభుత్వ చేతుల్లో బందీ అయ్యాయి. తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే, వారం రోజుల వరకు మెయిన్‌స్ట్రీమ్ మీడియా చూపించకుండా ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టారు. సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేదే కాదు. జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కూడా యాజమాన్యాలు ప్రశ్నించలేని దుస్థితి ఏర్పడింది. – కేటీఆర్1
- సికింద్రాబాద్ బోనాల్లో అమెరికా కాన్సుల్ జనరల్........... సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ. విలియమ్స్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. లారా ఈ. విలియమ్స్ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను మంత్రి వివరించారు. తెలంగాణ-అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు1
- ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు... ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేత శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గింది. అధికారులు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20 టిఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. నంది పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెందిన 15750 క్యూసెక్కుల నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గాయిత్రి పంప్ హౌస్ నుంచి 10500 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు మరో 5250 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు పంపిస్తున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోతల జలాలను ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంలో భాగంగా వరదకాలువ ద్వారా ఎగువన ఉన్న రాంపూర్ పంప్ హౌస్ కు గోదావరి జలాలు తరలిస్తున్నారు. అక్కడినుంచి గ్రావిటీ ద్వారా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ లోకి.. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ముష్కల్ పంప్ హౌస్ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఈ రివర్స్ పంపింగ్ విధానంలో గ్రావిటీ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పంపించి నిలువ చేస్తారు. సాగు, తాగునీటి అవసరాలకు మళ్లీ ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతంలోకి విడుదల చేస్తారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి గాయిత్రి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.3
- ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..! రెండు కుటుంబాల్లో విషాదం..! సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..! ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..! ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..! ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..! రెండు కుటుంబాల్లో విషాదం..! సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..! ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..! ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..! అక్కడ ఉన్న రాళ్లపై నిలబడి ఫొటోలు దిగుతుండగా, వారు నిలబడిన చోట ఒక్కసారిగా విరుచుకుపడిన నీటి కెరటం...అమాంతం వాళ్ళను సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది..! అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగా.. పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి నీటిలో కొట్టుకుపోయింది.. కాస్త దూరంగా కొట్టుకుపోతూ కనిపించిన నీతూ ను కాపాడాలనే ఆతృతతో సముద్రంలోకి వెళ్ళిన వెళ్ళిన రాము అనే యువకుడు కూడా తిరిగి బయటకు రాలేదు..! ఇద్దరు స్నేహితులు గల్లంతు కావడంతో తీవ్ర భయకంపితులైన మిగిలిన వారు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో... వారు గజ ఈతగాళ్లను పిలిపించారు.. సేఫ్టీ బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్లి గల్లంతైన యువతీ యువకుడి కోసం గాలింపు చేపట్టారు..! ....... ........1