logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*కాలి బూడిదైన పంట* .. *రైతన్నలకు మిగిల్చిన కన్నీళ్లు - రైతన్నల కుటుంబాలకు పరమర్శించిన -మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్* *కుంటాల మండల కేంద్రంలోని వీట్టాపూర్* గ్రామంలో పలువురి రైతు సోదరులు ( కట్టా *రాజశేఖర్, కమిండ్ల గంగయ్య, గుజ్జు సురేష్, పిట్ల రాజశేఖర్* ) గార్ల యొక్క మొక్కజొన్న పంట చేను ప్రమాదవశాత్తు అగ్నికి దగ్ధమైంది. చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చింది. వానాకాలంలో సాగు చేసిన పంట అతివృష్టితో నష్టాలను మిగిల్చింది. గంపెడు ఆశలతో రబీలో వారికి ఉన్న భూమి సాగు చేసిన పంట బూడిదయిందని మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లె మోహన్ రావు పటిల్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం మరియు ఇక్కడున్నా అధికారులు నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ తో పాటు వీట్టాపూర్ గ్రామ సర్పంచ్ లింగ్గురం, గుండేటి నర్సయ్య,మాజీ సర్పంచ్ లక్ష్మణ్ రావు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది *చైర్మన్, మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

2 hrs ago
user_Solanke Ravi
Solanke Ravi
Photographer నంగ్నూర్, సిద్దిపేట, తెలంగాణ•
2 hrs ago
68ef7952-6f6d-4e9d-8152-42606ca7b5c1

*కాలి బూడిదైన పంట* .. *రైతన్నలకు మిగిల్చిన కన్నీళ్లు - రైతన్నల కుటుంబాలకు పరమర్శించిన -మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్* *కుంటాల మండల కేంద్రంలోని వీట్టాపూర్* గ్రామంలో పలువురి రైతు సోదరులు ( కట్టా *రాజశేఖర్, కమిండ్ల గంగయ్య, గుజ్జు సురేష్, పిట్ల రాజశేఖర్* ) గార్ల యొక్క మొక్కజొన్న పంట చేను ప్రమాదవశాత్తు అగ్నికి దగ్ధమైంది. చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చింది. వానాకాలంలో సాగు చేసిన పంట అతివృష్టితో నష్టాలను మిగిల్చింది.

284971b0-5531-4802-8801-24fb7e781a61

గంపెడు ఆశలతో రబీలో వారికి ఉన్న భూమి సాగు చేసిన పంట బూడిదయిందని మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లె మోహన్ రావు పటిల్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం మరియు ఇక్కడున్నా అధికారులు నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ తో పాటు వీట్టాపూర్ గ్రామ సర్పంచ్ లింగ్గురం, గుండేటి నర్సయ్య,మాజీ సర్పంచ్ లక్ష్మణ్ రావు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది *చైర్మన్, మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ భైంసా*

More news from తెలంగాణ and nearby areas
  • Post by Solanke Ravi
    4
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Photographer నంగ్నూర్, సిద్దిపేట, తెలంగాణ•
    10 hrs ago
  • పార్లమెంట్ లో బిజెపికి చెందిన ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిరసన ఆందోళనలతో ఎంపీ పదవి నుంచి తొలగించి, దేశద్రోహం కేసు పెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యంపి.తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి నుండి సస్పెండ్ చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమని అంజన్ కుమార్ తో పాటు పలువురు నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల పౌరులను పాకిస్థాన్ వాదులతో పోల్చడం తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నామని తెలిపారు. తేజస్వి సూర్య వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
    2
    పార్లమెంట్ లో బిజెపికి చెందిన ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిరసన ఆందోళనలతో ఎంపీ పదవి నుంచి తొలగించి, దేశద్రోహం కేసు పెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యంపి.తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి నుండి సస్పెండ్ చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమని అంజన్ కుమార్ తో పాటు పలువురు నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల పౌరులను పాకిస్థాన్ వాదులతో పోల్చడం తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నామని తెలిపారు. తేజస్వి సూర్య వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని  హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..
    1
    సాధన సురుల  ఇంద్రజాల విన్యాసాలు...
గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు.
సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది
    1
    ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది
    user_Meenakshi construction Civil c
    Meenakshi construction Civil c
    లింగాలఘన్‌పూర్, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • చిగురుమామిడి మండలం లంబాడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలం నుంచి వడ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం తరలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    చిగురుమామిడి మండలం లంబాడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలం నుంచి వడ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం తరలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Kommera Rajureddy Reporter
    Kommera Rajureddy Reporter
    రియల్ ఎస్టేట్ తిమ్మాపూర్ ఎల్‌ఎండి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి  ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 hrs ago
  • వర్దన్నపేట (వరంగల్ జిల్లా): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
    1
    వర్దన్నపేట (వరంగల్ జిల్లా):
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.