logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది * *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వాడిది టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటి నిర్వహణపై వినతి పత్రం సమర్పించడం జరిగింది* *నరసరావుపేట జిల్లా కార్యాలయంలో ఈ సోమవారం అనగా మే 12వ తేదీన ఉదయం 10 గంటల నుండి 2 గంటలవరకు జనతా వారది కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది* *జనతా వారది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది* *ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జనతా వారి కార్యక్రమం ప్రతి గురువారం అన్ని మండలాలలో పార్టీ కార్యాలయలలో అలాగే ప్రతి శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది అలాగే పల్నాడు జిల్లా జనతా వారధి టీం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రాలు స్వీకరించటం జరుగుతుందని తెలియజేసిన పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు* *మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అలాగే శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయం లో వచ్చే ఫిర్యాదులను అన్నింటిని సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వం వారికి ఫిర్యాదులు అందజేయడం జరుగుతుందని పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు తెలియజేశారు* “ *నీరు ఉంటేనే జీవితం ఉంటుంది* *విషయం : భూగర్భ జలాల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుద్ధ్యం, భవిష్యత్ నీటి భద్రత* *ప్రస్తుతం వాతావరణం లో వస్తున్న మార్పుల కారణంగా వర్షపాత సరళిలో అనిశ్చితి, పెరుగుతున్న భూగర్భ జల వినియోగం, ఎండిపోతున్న బోర్లు, క్షీణిస్తున్న చెరువుల సంఖ్య మరియు ఆయకట్టు ఇవన్నీ భవిష్యత్ తరాలకు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సూచిస్తున్నాయి* ఈ పరిస్థితులను అధిగమించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నీటి భద్రత కల్పించడానికి రాష్ట్రంలో జలవనరుల సక్రమ నిర్వహణ మరియు భూగర్భ జల రీచార్జ్ కు ఇంకుడు గుంటలు (సోక్ పిట్స్, రీచార్జ్ పిట్స్), చెక్ డ్యాం లు, పెర్కొలేషన్ టాంక్ లు, రీచార్జ్ షాఫ్ట్ లు మొదలైన నిర్మాణాల విస్తరణ, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో బోర్లు ఎండిపోతున్నాయి, వేసవిలో తాగునీటి కొరత, వ్యవసాయానికి నీటి సమస్యలు, మురుగునీటి నిల్వ, వర్షపు నీరు కాలువల్లో వృథాగా పోవడం వంటి సమస్యలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచడానికి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే శాశ్వత పరిష్కారాల్లో ఇంకుడు గుంటలు (సోక్ పిట్స్ & రీచార్జ్ పిట్స్) ముఖ్యమైనవి. రీచార్జ్ పిట్స్: వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది; భూగర్భ జల స్థాయి పెరుగుతుంది; బోర్లు, బావులు ఎక్కువకాలం పనిచేస్తాయి; వరద ప్రభావం తగ్గుతుంది; భూమి తేమ పెరిగి వ్యవసాయానికి మేలు చేస్తుంది. సోక్ పిట్స్: ప్రతి ఇంటినుండి వచ్చే గ్రే వాటర్ భూమిలోకి ఇంకుతుంది; మురుగునీటి నిల్వ తగ్గుతుంది; దోమలు, దుర్వాసనలు తగ్గుతాయి; పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది నిరంతర భూగర్భ జల రీచార్జ్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం V B G RAM G, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ్ భారత్ మిషన్ వంటి పథకాల ద్వారా రైన్‌వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్‌వాటర్ రీచార్జ్, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్‌ పై రాష్ట్రాలకు నిధులు, సాంకేతిక మార్గదర్శకాలు, జియో-ట్యాగింగ్, మానిటరింగ్ వ్యవస్థలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. “ ప్రతి వర్షపు నీటి చుక్క భూమిలోకి చేరాలి ” అనే లక్ష్యంతో ప్రోత్సాహం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ కీలకం. 2019 వరకు సుమారు 2 లక్షల ఇంకుడు గుంటలు నిర్మించబడ్డాయి. అయితే, తర్వాత నిర్మాణాలు ఆగిపోయాయి; ఉన్నవి నిర్లక్ష్యంతో పూడికతో నిండిపోయాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ కార్యక్రమాలను నిర్వీర్యం చేసింది. 2024 – 2025 లో భూగర్భ జల రీఛార్జ్ లక్ష్యంగా ఇంకుడు గుంటల నిర్మాణం ప్రారంభించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కార్యక్రమం అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లడం లేదు. భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పిట్స్ అవసరం ఉన్నప్పటికీ అమలు తగిన స్థాయిలో లేదు. ప్రతి గ్రామం మరియు పట్టణాలలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు, వంటి నిర్మాణాల వద్ద రీఛార్జ్ పిట్స్, ట్రెంచ్ లు, రీఛార్జ్ వెల్స్ నిర్మించాలని, మరియు రోడ్డు డ్రైనేజ్, ఇంటినుండి వచ్చే గ్రే వాటర్ వద్ద సోక్ పిట్స్ వంటి నిర్మాణాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, లోపాలు ఎక్కువై లక్ష్యాల కోసం పనులు మొక్కుబడిగా పూర్తి చేయడం, సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడం, నాణ్యత లేని నిర్మాణాలు, నిర్వహణా లోపం, మట్టితో నిండిపోవడం, పూర్తి కాని పనులను పూర్తి చేసినట్టు చూపడం, ప్రజల్లో అవగాహన లోపం, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రామ స్థాయి పర్యవేక్షణ లేమి కనిపిస్తున్నది. ఇట్టి పరిస్థితులలో అధికారులు క్రింది అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి 1. రాష్ట్రవ్యాప్త “గ్రౌండ్‌వాటర్ రీచార్జ్ మిషన్” ప్రారంభించాలి. 2. ప్రతి గ్రామానికి వార్షిక భూగర్భ జల రీచార్జ్ టార్గెట్ నిర్ణయించాలి. 3. ప్రతి ఇంటికి తప్పనిసరిగా రీఛార్జ్ పిట్ మరియు సోక్ పిట్ ఉండాలనే నిబంధన అమలు చేయాలి. 4. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు భవనాలలో వర్షపునీటి సంరక్షణ మరియు భూగర్భ జల రీఛార్జ్ తప్పనిసరి చేయాలి. 5. గ్రామాలలో, పట్టణాలలోని వ్యవసాయ మరియు మంచినీటి చెరువులన్నింటిలో పూడిక తీయడం, చెరువులలోనికి వచ్చే కాలువలను, మార్గాలను శుభ్రం చేయడం వంటి పనుల వార్షిక నిర్వహణకు నిధులు కేటాయించి రైతులు, ప్రజల భాగస్వామ్యం తో ప్రతీ సంవత్సరం తప్పక చేపట్టాలి. 6. ప్రతి పనికి మరియు నిర్మాణానికి జియో-ట్యాగింగ్ & పబ్లిక్ మానిటరింగ్ అమలు చేయాలి. 7. నాణ్యత తనిఖీలకు థర్డ్ పార్టీ ఇన్‌స్పెక్షన్ ఏర్పాటు చేయాలి. 8. గ్రామస్థాయి వాటర్ కమిటీలు ఏర్పాటు చేయాలి మరియు గ్రామ వాటర్ బడ్జెట్ అంచనాలు తయారు చేయించాలి. 9. గ్రామసభల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి గ్రామస్థాయిలో నీటి వనరుల నిర్వహణలో భాగస్వాములను చేయాలి. 10. భూగర్భ జల రీఛార్జ్ నిర్మాణాల నిర్వహణకు ప్రత్యేక వార్షిక నిధి ఏర్పాటు చేయాలి. 11. బావులు, బోర్లు ఎండిపోతున్న మండలాలకు ప్రత్యేక రీచార్జ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. 12. విద్యా సంస్థలలో వర్షపు నీటి సంరక్షణ మరియు భూగర్భజల రీఛార్జ్ లపై మరియు జలవనరుల సంరక్షణ, సక్రమ నిర్వహణలపై భవిష్యత్ తరాలకు ప్రతినిధులైన విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలతో ప్రతీ సంవత్సరం తగిన అవగాహన, శిక్షణ కల్పించాలి. పై అన్నిరకాల కార్యక్రమాల అమలులో అధికారుల నిర్లక్ష్యంపై బాధ్యత నిర్ణయించే వ్యవస్థ తీసుకురావాలి. ఈ అంశాన్ని సాధారణ అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా, భవిష్యత్ తరాల జీవన భద్రత గా పరిగణించి అత్యవసర ప్రాధాన్యతతో చర్యలు చేపట్టాలని మనవి. ఈ రోజే గ్రామ స్థాయి నుంచి నీటి సంరక్షణను ఉద్యమంగా మార్చాలి. “ ప్రతి వర్షపు చుక్క భూమిలోకి చేరాలి—ప్రతి గ్రామం నీటి భద్రత కలిగిన గ్రామంగా మారాలి .” ప్రభుత్వం ఈ మహత్తర లక్ష్యంతో బలమైన కార్యాచరణ చేపడుతుందని ఆశిస్తూ, ఈ వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాము.

2 hrs ago
user_మీడియా ఇన్చార్జి
మీడియా ఇన్చార్జి
Animal Protection Organisation చిలకలూరిపేట హెచ్.ఓ. పురుషోత్తపట్నం, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
bc9f44fd-4596-4b5a-853f-1765749fc556

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గారపాడు శ్రీ భావన రుషి ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకలు . పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామంలో సోమవారం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి నూతన ఆలయంలో శిలా బింభ ప్రతిష్ఠ, నిర్వహించారు.స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక 15 రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు సారధ్యం లో క్రతువులు పూర్తయి న సందర్భంగా సోమవారం నాడు 16 రోజుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్త మహాశయులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
    1
    గారపాడు శ్రీ భావన రుషి ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకలు  .
పెదకూరపాడు మండలంలోని గారపాడు  గ్రామంలో సోమవారం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి నూతన ఆలయంలో శిలా బింభ ప్రతిష్ఠ, నిర్వహించారు.స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక 15 రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు సారధ్యం లో క్రతువులు పూర్తయి న సందర్భంగా సోమవారం నాడు 16 రోజుల వేడుక జరిగింది.
ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్త మహాశయులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨............. 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨 *డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు* *🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం* 🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్‌.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్‌.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు, మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు. నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది. 👉 ప్రజలకు సూచన: బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. –కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు
    1
    🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨.............

🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨
*డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు*
*🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం*
🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37  క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి
విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్‌.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్‌.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు.
సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు,  మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు.
నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది.
👉 ప్రజలకు సూచన:
బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు.
–కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు
    user_Ravi Reporter
    Ravi Reporter
    Local News Reporter తిరువూరు, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    19 min ago
  • ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
    1
    ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    24 min ago
  • బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
    1
    బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన

మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    45 min ago
  • బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.

పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు.

తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    1
    బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని
నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    4 hrs ago
  • పల్నాడు జిల్లా అమరావతిలోని శ్రీ అమరేశ్వరస్వామి దేవస్థానంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'సోమనాథ స్వాభిమాన పర్వ్'లో భాగంగా ఓంకార జపం, శివ భజనలు, కళశ యాత్రలు చేపట్టగా, భక్తులతో 'సోమనాథ సంకల్పం' చేయించారు.
    1
    పల్నాడు జిల్లా అమరావతిలోని శ్రీ అమరేశ్వరస్వామి దేవస్థానంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'సోమనాథ స్వాభిమాన పర్వ్'లో భాగంగా ఓంకార జపం, శివ భజనలు, కళశ యాత్రలు చేపట్టగా, భక్తులతో 'సోమనాథ సంకల్పం' చేయించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
    1
    కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి
ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.