క్యాంపస్ నియామకాల్లో ఆదిత్య ఇంజినీరింగ్ విద్యార్థుల సత్తా -లారే కన్సల్టింగ్ సంస్థలో 25 మందికి ఉద్యోగాలు మదనపల్లె: మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు మరోసారి క్యాంపస్ నియామకాల్లో ప్రతిభ చాటారు. ప్రముఖ లారే కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు వార్షికంగా రూ.3.60 లక్షల వేతన ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎస్. రామలింగారెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఉద్యోగ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల కృషితో పాటు వారికి నాణ్యమైన శిక్షణ అందించిన డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ బృందం సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం సభ్యులు డాక్టర్ డి. శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్, సి. మనోజ్ కుమార్‌తో పాటు అన్ని విభాగాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ కో-ఆర్డినేటర్లను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.
క్యాంపస్ నియామకాల్లో ఆదిత్య ఇంజినీరింగ్ విద్యార్థుల సత్తా -లారే కన్సల్టింగ్ సంస్థలో 25 మందికి ఉద్యోగాలు మదనపల్లె: మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు మరోసారి క్యాంపస్ నియామకాల్లో ప్రతిభ చాటారు. ప్రముఖ లారే కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు వార్షికంగా రూ.3.60 లక్షల వేతన ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎస్. రామలింగారెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఉద్యోగ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల కృషితో పాటు వారికి నాణ్యమైన శిక్షణ అందించిన డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ బృందం సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం సభ్యులు డాక్టర్ డి. శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్, సి. మనోజ్ కుమార్‌తో పాటు అన్ని విభాగాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ కో-ఆర్డినేటర్లను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.
- "మాకు రెండెకరాలు మాత్రమే ఉంది.. ఎర్రబస్సుకూడా మా ఊరికి రాదు. ఇప్పుడు ఎయిర్‌పోర్టు అంటున్నారు. మా భూములు లాక్కుంటున్నారు" ఈ మాటలు ఎక్కడైనా విన్నావా సిగ్గులేని పవన్ కళ్యాణ్? విని ఉంటావ్.. కానీ ఒప్పుకోవడానికి నీకు ధైర్యం సరిపోదులే! వైయస్ జగన్ గారి ముందు ఈ మాటలు నర్సాయమ్మ అనే మహిళ మాట్లాడితే.. ఆమె ఏం మాట్లాడిందో జగనన్న అందరికీ వినిపించేలా రిపీట్ చేశారు కానీ.. మీ పవన్ కళ్యాణ్ ఫేక్ ఎడిట్స్ తో చంద్రబాబు బాటలో బుద్ధిలేకుండా అబద్ధాలు మాట్లాడుతూ బురద చల్లుతున్నాడు ఇదిగో ఒరిజినల్ వీడియో.. కొంచెం మీ అహంకారపు కళ్లద్దాలు తీసి చూడండి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ "మాకు రెండెకరాలు మాత్రమే ఉంది.. ఎర్రబస్సుకూడా మా ఊరికి రాదు. ఇప్పుడు ఎయిర్‌పోర్టు అంటున్నారు. మా భూములు లాక్కుంటున్నారు" ఈ మాటలు ఎక్కడైనా విన్నావా సిగ్గులేని పవన్ కళ్యాణ్? విని ఉంటావ్.. కానీ ఒప్పుకోవడానికి నీకు ధైర్యం సరిపోదులే! వైయస్ జగన్ గారి ముందు ఈ మాటలు నర్సాయమ్మ అనే మహిళ మాట్లాడితే.. ఆమె ఏం మాట్లాడిందో జగనన్న అందరికీ వినిపించేలా రిపీట్ చేశారు కానీ.. మీ పవన్ కళ్యాణ్ ఫేక్ ఎడిట్స్ తో చంద్రబాబు బాటలో బుద్ధిలేకుండా అబద్ధాలు మాట్లాడుతూ బురద చల్లుతున్నాడు ఇదిగో ఒరిజినల్ వీడియో.. కొంచెం మీ అహంకారపు కళ్లద్దాలు తీసి చూడండి పవన్ కళ్యాణ్, నారా లోకేష్1
- ప్రొద్దుటూరు పట్టణంలోని పప్పుల బట్టి వీధిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.1
- అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు. అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.1
- స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారాల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని తీర్మానం. -లెన్స్‌కార్ట్ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పట్టణంలో లెన్స్‌కార్ట్ షోరూమ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక చిన్న వ్యాపారుల భవిష్యత్, ఉద్యోగుల ఉపాధి, కార్పొరేట్ సంస్థల ప్రభావం, ప్రభుత్వ శాఖల స్పందన, చట్టబద్ధ అనుమతుల అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ధర్మవరంలో దశాబ్దాలుగా స్థానిక ఆప్టికల్ వ్యాపారాలపై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కుటుంబాలు గత తొమ్మిది నెలలుగా తమ ఉపాధి, భవిష్యత్తు మరియు చిన్న వ్యాపారాల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి తమ సమస్యలను వివరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం పట్ల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. స్థానిక వ్యాపారులు మాత్రమే కాకుండా పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు కూడా ఈ సమస్యకు మద్దతుగా నిలిచి తమ అభిప్రాయాలను తెలియజేసినప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో నిరాశ, ఆందోళన వ్యక్తమవుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాల్లో మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, సంబంధిత భవనం మరియు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ వినియోగ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ అనుమతులు మరియు ఇతర చట్టబద్ధ అనుమతులపై సంబంధిత శాఖలు పూర్తి పారదర్శకతతో విచారణ నిర్వహించి ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే స్థానిక వ్యాపారులు మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, టౌన్ ప్లానింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో పలు సందేహాలకు తావిస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల సమస్యల విషయంలో అధికారులు ఆలస్యం చేయకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే, ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ప్రజలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగుల జీవనోపాధిని కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోని పక్షంలో, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్), సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌బీ, ఎంఆర్పీఎస్తో పాటు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్థానిక వ్యాపార సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, స్థానిక చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మరియు స్థానిక వ్యాపారులు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలను చేపడతామని సమావేశంలో వెల్లడించారు. స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారుల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకులు తుంపర్తి పరమేష్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి యర్రంశెట్టి రమణ, సీపీఐ(ఎంఎల్) నాయకులు పోలా లక్ష్మీనారాయణ, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, బీఎస్పీ నాయకులు వినయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వెంకటేష్తో పాటు స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులు మరియు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. "స్థానిక ఉపాధి – స్థానిక హక్కు", "చట్టం ముందు అందరూ సమానమే", "చిన్న వ్యాపారాల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది" అనే నినాదాలతో సమావేశం ముగిసింది.2
- ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.1
- గత వైకాపాలనలో ప్రతిపక్ష నేతగా అడ్డుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే కాలువ ఇప్పుడు సమర్పించడం ఏంటి రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం రైతులతో భూసేకరణ చేపట్టేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రైతుల భూములకు రక్షణ ఏది అంటూ అడ్డుకోవడం జరిగిందని బిఎస్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిందనూరు నాగరాజు పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే నే నేడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటూ అదే ప్రాజెక్టును సమర్తించడంఏంటంటూ ప్రశ్నించారు. రైతుల భూములకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు హామీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున బిఎస్పి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.1
- తాడేపల్లి వెన్నుపోటు కూటమి కుట్రలను భూస్థాపితం చేద్దాం : శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయీ బ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడిన పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ యాదవ్ గారు, వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు సిద్దవటం యానాదయ్య గారు, వైఎస్సార్సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం అధ్యక్షుడు పి.పుల్లయ్య గారు, నాయీ బ్రాహ్మణ విభాగం నాయకులు నూకరాజు గారు, కనకారావు గారు, శ్రీనివాసులు గారు, కోటేశ్వరరావు గారు, మల్లేశ్వరరావు గారు, ధనవిజయుడు గారు తదితరులు పాల్గొన్నారు. - నాయీ బ్రాహ్మణులను రాజకీయంగా ప్రోత్సహించింది జగనే - కులానికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం చరిత్రలో మొదటిసారి - ఆలయ పాలకమండళ్లలో చోటు, ఆలయాల్లో ఉద్యోగులుగా గుర్తింపు - రూ. 20 వేల జీతాన్ని ఖరారు చేసి నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత - 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఏఎంసీ చైర్మన్లుగా అవకాశం - కరోనాలో ఒక్క బటన్‌తో రూ. 50 కోట్లు నిధులు విడుదల - వైఎస్ జగన్ గారి మేలును ఎప్పటికీ మరిచిపోలేం - మళ్లీ జగన్‌ని సీఎం చేసుకునేదాకా కలిసికట్టుగా పనిచేద్దాం - అక్రమ కేసులతో వేధిస్తున్న వెన్నుపోటు కూటమికి బుద్ధి చెబుతాం : సమావేశంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకుల ప్రతిజ్ఞ వెన్నుపోటు కూటమి అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి - పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పద్ధతి ప్రకారం గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయి నాయకులతో కేంద్ర కార్యాలయాన్ని అనుసంధానం చేస్తూ కంప్యూటరీకరణ పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీ కమిటీల్లో నాయీ బ్రాహ్మణులు మాత్రమే దాదాపు 10వేల మంది ఉన్నారని స్పష్టమైన డేటా మన వద్ద ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రధాన విభాగాలు, కమిటీల కీలక స్థానాల్లో 10వేల మంది నాయీ బ్రాహ్మణులు ఉండటం మనం గర్వించదగిన విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 13 నుండి 14 లక్షల మంది నాయకత్వం వైఎస్సార్‌సీపీ నిర్మాణంలో ఉంది. మన పార్టీ నిర్మాణంలోనూ, వ్యవస్థలోనూ బీసీలు అత్యధికంగా 60 శాతానికి పైగా ఉన్నారు. జగన్ గారి నాయకత్వంలో వెనుకబడిన వర్గాలు, దళితులు తమ జనాభా ప్రాతిపదికన పార్టీలోనూ, పాలనలోనూ తగిన ప్రాధాన్యత పొందారు. గతంలో మాదిరిగా ప్రతి చిన్న దానికి రోడ్లపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండా, మన అభిప్రాయాలను నేరుగా లీడర్‌షిప్ దృష్టికి తెచ్చేలా కమ్యూనికేషన్ పెంచాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలు, మోసపు హామీలను తిప్పికొట్టడానికి మీరు, మీ పిల్లలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చైతన్యపరచాలి. జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో 15–20 ఏళ్ల అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆదర్శప్రాయంగా అందించి చూపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి, అబద్ధాలతో ఘోరమైన పరిస్థితి తెచ్చింది. వెన్నుపోటు కూటమి నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిన్న ముస్తఫా కొడుకుపై కిడ్నాప్ కేసు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిపై అక్రమ కేసులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. తప్పుడు విచారణలు, ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఛానళ్లతో చంద్రబాబు నాయుడు సమాజంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వెన్నుపోటు కూటమి వైఖరిని మీరు ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి. రైతులకు ఉచిత విద్యుత్, బీమా సౌకర్యం అందించిన జగన్ గారి వైఖరి ఒకటైతే, చంద్రబాబు రైతులకు బీమా లేకుండా మోసం చేశారు. మీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి కుటుంబంలోకి జగన్ గారి సందేశాన్ని, ఆయన అందించిన సంక్షేమాన్ని నేరుగా తీసుకెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని మళ్లీ విజయతీరాలకు చేర్చడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. చంద్రబాబు, వెన్నుపోటు కూటమి పార్టీల వెనుక ఉన్న అసత్య ప్రచారాలను శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి పనితీరును, వారి డేటాను కేంద్ర కార్యాలయం ద్వారా ఏఐ టెక్నాలజీతోనూ పరిశీలిస్తున్నాం. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీలో తగిన గుర్తింపు, ఉన్నత పదవులు లభిస్తాయని హామీ ఇస్తున్నాను. తాడేపల్లి వెన్నుపోటు కూటమి కుట్రలను భూస్థాపితం చేద్దాం : శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయీ బ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడిన పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ యాదవ్ గారు, వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు సిద్దవటం యానాదయ్య గారు, వైఎస్సార్సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం అధ్యక్షుడు పి.పుల్లయ్య గారు, నాయీ బ్రాహ్మణ విభాగం నాయకులు నూకరాజు గారు, కనకారావు గారు, శ్రీనివాసులు గారు, కోటేశ్వరరావు గారు, మల్లేశ్వరరావు గారు, ధనవిజయుడు గారు తదితరులు పాల్గొన్నారు. - నాయీ బ్రాహ్మణులను రాజకీయంగా ప్రోత్సహించింది జగనే - కులానికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం చరిత్రలో మొదటిసారి - ఆలయ పాలకమండళ్లలో చోటు, ఆలయాల్లో ఉద్యోగులుగా గుర్తింపు - రూ. 20 వేల జీతాన్ని ఖరారు చేసి నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత - 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఏఎంసీ చైర్మన్లుగా అవకాశం - కరోనాలో ఒక్క బటన్‌తో రూ. 50 కోట్లు నిధులు విడుదల - వైఎస్ జగన్ గారి మేలును ఎప్పటికీ మరిచిపోలేం - మళ్లీ జగన్‌ని సీఎం చేసుకునేదాకా కలిసికట్టుగా పనిచేద్దాం - అక్రమ కేసులతో వేధిస్తున్న వెన్నుపోటు కూటమికి బుద్ధి చెబుతాం : సమావేశంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకుల ప్రతిజ్ఞ వెన్నుపోటు కూటమి అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి - పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పద్ధతి ప్రకారం గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయి నాయకులతో కేంద్ర కార్యాలయాన్ని అనుసంధానం చేస్తూ కంప్యూటరీకరణ పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీ కమిటీల్లో నాయీ బ్రాహ్మణులు మాత్రమే దాదాపు 10వేల మంది ఉన్నారని స్పష్టమైన డేటా మన వద్ద ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రధాన విభాగాలు, కమిటీల కీలక స్థానాల్లో 10వేల మంది నాయీ బ్రాహ్మణులు ఉండటం మనం గర్వించదగిన విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 13 నుండి 14 లక్షల మంది నాయకత్వం వైఎస్సార్‌సీపీ నిర్మాణంలో ఉంది. మన పార్టీ నిర్మాణంలోనూ, వ్యవస్థలోనూ బీసీలు అత్యధికంగా 60 శాతానికి పైగా ఉన్నారు. జగన్ గారి నాయకత్వంలో వెనుకబడిన వర్గాలు, దళితులు తమ జనాభా ప్రాతిపదికన పార్టీలోనూ, పాలనలోనూ తగిన ప్రాధాన్యత పొందారు. గతంలో మాదిరిగా ప్రతి చిన్న దానికి రోడ్లపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండా, మన అభిప్రాయాలను నేరుగా లీడర్‌షిప్ దృష్టికి తెచ్చేలా కమ్యూనికేషన్ పెంచాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలు, మోసపు హామీలను తిప్పికొట్టడానికి మీరు, మీ పిల్లలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చైతన్యపరచాలి. జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో 15–20 ఏళ్ల అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆదర్శప్రాయంగా అందించి చూపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి, అబద్ధాలతో ఘోరమైన పరిస్థితి తెచ్చింది. వెన్నుపోటు కూటమి నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిన్న ముస్తఫా కొడుకుపై కిడ్నాప్ కేసు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిపై అక్రమ కేసులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. తప్పుడు విచారణలు, ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఛానళ్లతో చంద్రబాబు నాయుడు సమాజంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వెన్నుపోటు కూటమి వైఖరిని మీరు ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి. రైతులకు ఉచిత విద్యుత్, బీమా సౌకర్యం అందించిన జగన్ గారి వైఖరి ఒకటైతే, చంద్రబాబు రైతులకు బీమా లేకుండా మోసం చేశారు. మీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి కుటుంబంలోకి జగన్ గారి సందేశాన్ని, ఆయన అందించిన సంక్షేమాన్ని నేరుగా తీసుకెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని మళ్లీ విజయతీరాలకు చేర్చడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. చంద్రబాబు, వెన్నుపోటు కూటమి పార్టీల వెనుక ఉన్న అసత్య ప్రచారాలను శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి పనితీరును, వారి డేటాను కేంద్ర కార్యాలయం ద్వారా ఏఐ టెక్నాలజీతోనూ పరిశీలిస్తున్నాం. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీలో తగిన గుర్తింపు, ఉన్నత పదవులు లభిస్తాయని హామీ ఇస్తున్నాను.1
- కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.1
- సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.1