Shuru
Apke Nagar Ki App…
ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నగరం మండలంలోని ఎరువుల దుకాణాలను ఏడిఏ రమేష్ బాబు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల దుకాణదారులు తప్పనిసరిగా స్టాక్ బోర్డులను ధరల పట్టికలను ఏర్పాటు చేయాలన్నారు.ఎరువులను కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూరియా, డిఏపి అందుబాటులో ఉన్నాయని రైతులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
M.Vijay Kishore
ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నగరం మండలంలోని ఎరువుల దుకాణాలను ఏడిఏ రమేష్ బాబు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల దుకాణదారులు తప్పనిసరిగా స్టాక్ బోర్డులను ధరల పట్టికలను ఏర్పాటు చేయాలన్నారు.ఎరువులను కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూరియా, డిఏపి అందుబాటులో ఉన్నాయని రైతులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- *దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు* *ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):* ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు: సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.1
- అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు1
- పండుగల వేళ శాంతికి పెద్ద పీట ముదిగొండలో శాంతి కమిటీ మీటింగ్ ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే పండుగల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని సీఐ మురళి కోరారు.ముదిగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐ మురళి మాట్లాడుతూ... గ్రామాల్లో శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, యువత రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలని సూచించారు. డీజే సౌండ్స్, విగ్రహాల ఏర్పాటు విషయంలో నిబంధనలు పాటించాలని తెలిపారు.ఎవరైనా శాంతికి విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.1
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1