logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*వర్షం వేళ కార్పొరేషన్ అలర్ట్.. డ్రైనేజీలపై ప్రత్యేక నిఘా* *ప్రధాన డ్రైనేజీలను పరిశీలించిన అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్* *కాకినాడ, ఆగస్టు 1:* నగరంలో శనివారం ఉదయం కురిసిన వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కాకినాడ నగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన డ్రైనేజీల్లో వర్షపు నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ, ఎక్కడా నీటి నిల్వలు ఏర్పడకుండా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్ ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని ప్రధాన డ్రైనేజీ అవుట్‌లెట్‌ను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన డ్రైనేజీ అవుట్‌లెట్ వద్ద ఎలాంటి అడ్డంకులు లేకుండా కాలువల్లో వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైనేజీల్లో చెత్త, పూడిక పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, వర్షాకాలంలో ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. అనంతరం వివేకానంద పార్కు సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. అల్పాహారం తీసుకుంటున్న ప్రజలను పలకరించిన అదనపు కమిషనర్, వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అదనపు కమిషనర్ వెంట శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Apsv9 News channel
Apsv9 News channel
Media company Yeleswaram, Kakinada•
2 hrs ago
5d426e5f-46b6-440a-8ad7-b6880eb0c5ad

*వర్షం వేళ కార్పొరేషన్ అలర్ట్.. డ్రైనేజీలపై ప్రత్యేక నిఘా* *ప్రధాన డ్రైనేజీలను పరిశీలించిన అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్* *కాకినాడ, ఆగస్టు 1:* నగరంలో శనివారం ఉదయం కురిసిన వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కాకినాడ నగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన డ్రైనేజీల్లో వర్షపు నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ, ఎక్కడా నీటి నిల్వలు ఏర్పడకుండా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్ ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని ప్రధాన డ్రైనేజీ అవుట్‌లెట్‌ను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన డ్రైనేజీ అవుట్‌లెట్ వద్ద ఎలాంటి అడ్డంకులు లేకుండా కాలువల్లో వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైనేజీల్లో చెత్త, పూడిక పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, వర్షాకాలంలో ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. అనంతరం వివేకానంద పార్కు సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. అల్పాహారం తీసుకుంటున్న ప్రజలను పలకరించిన అదనపు కమిషనర్, వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అదనపు కమిషనర్ వెంట శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

More news from Konaseema and nearby areas
  • Post by Adimlamganash
    1
    Post by Adimlamganash
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    30 min ago
  • *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.
    1
    *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు.
తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి  పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి  చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    1
    భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం......
భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి. అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం.

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది.
మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు.
స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు.
ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి.
అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Shivaram
    Shivaram
    Local News Reporter భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    23 min ago
  • Post by Adimlamganash
    1
    Post by Adimlamganash
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    31 min ago
  • మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి. 🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం 🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి 🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి 🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు 🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు
    1
    మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి.

🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం
🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి
🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి
🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు
🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.