చిరంజీవి బాల్య మిత్రుడు, సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూశారు.మన భువి తారాలోకం వీడి గగన మార్గం గుండా ఆ శివుని చేరుకున్నట్లు సమాచారం అందింది. అందరి అభిమాన కథానాయకుడు చిరంజీవి బాల్య మిత్రుడు, అజాత శత్రువు, అందరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి నారాయణ రావు శివైక్యం అయ్యారనే వార్త అత్యంత విచారకరం. ఆయన మృతి పట్ల సినీ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'అంతులేని కథ' చిత్రంతో నటుడిగా పరిచయమైన ఆయన, మొదటి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. సుమారు 100 పైగా చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్‌లతో నారాయణ రావుకు మంచి సాన్నిహిత్యం ఉంది. జీవీ నారాయణ రావు 1953లో జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లు, హైదరాబాద్ లలో సాగింది. ఆయన తండ్రి జి ప్రసాదరావు కొంతకాలం డిస్ట్రిబ్యూటర్ గా, సారథీ స్టుడియోకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచే నారాయణ రావుకు నటనపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లో కొన్ని నాటకాలు కూడా వేశారు. 1973లో మద్రాసు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనకు బ్యాచ్ మేట్. అక్కడే వీరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'అంతులేని కథ' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు జేవీ నారాయణ రావు. 'తాళికట్టు శుభవేళ' పాటలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆ తర్వాత 'ఒక ఊరి కథ', 'ముత్యాల పల్లకి', 'అంగడి బొమ్మ' లాంటి పలు సినిమాలలో హీరోగా నటించారు. కానీ ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో మళ్లీ సపోర్టింగ్ రోల్స్ చేయాల్సి వచ్చింది. ఆయన కెరీర్ లో సుమారు 100 సినిమాలలో నటించారు. సినిమాలతో పాటుగా టీవీ సీరియల్స్ కూడా చేశారు.మెగాస్టార్ చిరంజీవితో నారాయణ రావుకు మంచి సాన్నిహిత్యం ఉంది. 'చట్టానికి కళ్లులేవు', 'మంచు పల్లకి', 'రాజా విక్రమార్క', 'గ్యాంగ్ లీడర్', 'హిట్లర్' వంటి చిత్రాల్లో చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆయన నిర్మాణంలో చిరంజీవి హీరోగా 'దేవాంతకుడు', 'యముడికి మొగుడు' చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత 'యముడికి మొగుడు' సినిమానే తమిళంలో తన ఫ్రెండ్ రజనీకాంత్ తో రీమేక్ చేశారు. నారాయణ రావు పలు ఇంటర్వ్యూలలో చిరంజీవి, రజనీకాంత్ లతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.

- డయేరియా బాధితులను పరామర్శించిన ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని డయేరియా బాధితులను పరామర్శించారు.ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.స్థానిక కాపుల రామాలయం సెంటర్లో సుమారు పదిమందికి పైగా బాధితులను కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసిన నాని. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉయ్యూరు టౌన్ టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్ తుంగల పెద్ద రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే మంచిది . ఏబీఎన్ రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా.కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది.మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది.ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...1
- ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదు ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదని, మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై అవాకులు చవాకులు పేలితే ఇంటిని ముట్టడిస్తామని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి హెచ్చరించారు. బుధవారం చల్లపల్లిలోని నందమూరి తారకరామారావు గ్రామ పంచాయతీ ఆవరణలోని ఎన్టీఆర్ కళా పరిషత్ వేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని దోచుకుని, మంత్రిగాను విఫలమైన జోగి రమేష్ చివరికి కుటుంబ సమస్య పరిష్కారంలోనూ విఫలమయ్యారన్నారు. ఇంటి సమస్య పరిష్కారం చేతకాని జోగి రమేష్ బయటకు వచ్చి సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై రాజకీయ విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంటి సమస్య తీర్చుకోలేక కులం కార్డు వాడుకుంటున్న జోగి రమేష్ రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి సజీవ దహనం ఘటనలో బీసీలకు అండగా నిలువకుండా కులానికి న్యాయం చేయని జోగి రమేష్ నేడు కులం కార్డు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ అరెస్టు ఖాయం అన్నారు.3
- వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.1
- అక్రమ ఇసుక తవ్వకాలు పట్టా పట్టించుకొని రెవెన్యూ మరియు పోలీసు శాఖ అక్రమ ఇసుక తవ్వకాలు.. అధికారుల మౌనం ఎందుకు? మోటుపల్లి సర్వే నంబర్లు 114, 115లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చిన్నగంజాం మండలం: మోటుపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 114, 115లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇసుకను భారీ స్థాయిలో తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతులు ఎవరి పేరుతో ఉన్నాయి? ఎంత మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యపై సమగ్రంగా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించి, అక్రమాలు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వే నంబర్లు 114, 115లో జరిగిన తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.3
- అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.1
- *నేపాల్‌లో వరద బీభత్సం..* *వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు..* : నేపాల్‌లో వరదల విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. డాయిమోన్ హూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో భయానక దృశ్యాలు ఉన్నాయి.. ఆ వీడియోలో.. పర్యాటకులు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వరద నీరు వారి వైపు దూసుకువచ్చింది.. దీంతో భయపడిపోయిన పర్యాటకులు కొండ మీదకు పరుగులు తీయటం మొదలెట్టారు. అయితే, కొంతమంది పర్యాటకులు వరద నుంచి తప్పించుకోలేకపోయారు.. వరద నీరు వారిని ముంచెత్తింది. పదుల సంఖ్యలో జనం నీటిలో కొట్టుకుపోయారు.. కొంతమంది కొండ మీదకు సగం ఎక్కి ఆగిపోయారు.. వరద నీరు తమ వరకు రాదని వారు భావించారు.. ఊహించని విధంగా వరద నీటిలో వారు కూడా కొట్టుకుపోయారు.. కొండపై వరకు ఎక్కిన వారు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2 నిమిషాల 7 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. గల్లంతయిన వారు ప్రాణాలతో ఉండాలని దేవుడ్ని కోరుకుంటున్నా’..‘ అయ్యో పాపం. నేపాల్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు......1