logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మార్లవాయి గ్రామంలో జిల్లా ఎస్పీ నికిత పంత్ పర్యటన గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలపై సమీక్ష మహిళలకు బ్లాంకెట్ల పంపిణీ ఆసిఫాబాద్ జిల్లా మార్లవాయి గ్రామాన్ని జిల్లా ఎస్పీ నికిత పంత్ సందర్శించారు. గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు. గ్రామపంచాయతీ సర్పంచ్ కనక ప్రతిభ పుష్పగుచ్చం అందజేశారు. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్–బెట్టి ఎలిజబెత్ దంపతులకు ఎస్పీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డార్ఫ్ రీడింగ్ రూమ్, హైమన్ డార్ఫ్ మ్యూజియం, గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలుర), రాయి సెంటర్ మర్రి చెట్టు స్థలం తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అంశాలపై చర్చించి సమస్యలను తెలుసుకున్నారు. సమావేశం అనంతరం గ్రామ మహిళలకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. మహిళలు ఎస్పీకి ఆత్మీయ సన్మానం నిర్వహించి, ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ రచించిన నివేదిక పుస్తకాన్ని బహూకరించారు. జనవరి 11, 2026న జరగనున్న సభ ఏర్పాట్లపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేష్, ఎస్సై రవీందర్, గ్రామ పటేల్ ఆత్రం హన్మంత్ రావు, దేవారి గణపత్ తదితరులు పాల్గొన్నారు.

23 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
23 hrs ago
bb470333-7275-4254-9f2a-f75a9543d91b

మార్లవాయి గ్రామంలో జిల్లా ఎస్పీ నికిత పంత్ పర్యటన గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలపై సమీక్ష మహిళలకు బ్లాంకెట్ల పంపిణీ ఆసిఫాబాద్ జిల్లా మార్లవాయి గ్రామాన్ని జిల్లా ఎస్పీ నికిత పంత్ సందర్శించారు. గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు. గ్రామపంచాయతీ సర్పంచ్ కనక ప్రతిభ పుష్పగుచ్చం అందజేశారు. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్–బెట్టి ఎలిజబెత్ దంపతులకు ఎస్పీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డార్ఫ్ రీడింగ్ రూమ్, హైమన్ డార్ఫ్ మ్యూజియం, గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలుర), రాయి సెంటర్ మర్రి చెట్టు స్థలం తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అంశాలపై చర్చించి సమస్యలను తెలుసుకున్నారు. సమావేశం అనంతరం గ్రామ మహిళలకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. మహిళలు ఎస్పీకి ఆత్మీయ సన్మానం నిర్వహించి, ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ రచించిన నివేదిక పుస్తకాన్ని బహూకరించారు. జనవరి 11, 2026న జరగనున్న సభ ఏర్పాట్లపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేష్, ఎస్సై రవీందర్, గ్రామ పటేల్ ఆత్రం హన్మంత్ రావు, దేవారి గణపత్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
    1
    హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..
    1
    *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు*  
కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం
గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క 
మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను  సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి బాన్సువాడ ప్రతినిధి రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.
    2
    ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి
బాన్సువాడ ప్రతినిధి
రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.
    user_Local Public news
    Local Public news
    బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
    1
    👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట
కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ 
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    19 hrs ago
  • మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.
    1
    మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు..
రాష్ట్ర మహిళా మంత్రులకు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం
అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. 
మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు.
కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు.
కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    20 hrs ago
  • కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ రెండవ ఎడిషన్ పోటీలను కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గార్లతో కలసి క్రీడా జ్వాలను వెలిగించి క్రీడలను ప్రారంభించిన చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం
    1
    కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ రెండవ ఎడిషన్ పోటీలను కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే  సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గార్లతో కలసి క్రీడా జ్వాలను వెలిగించి క్రీడలను ప్రారంభించిన చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    6 hrs ago
  • జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళనకు దిగారు. నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కటౌట్‌కు ఉరి తీయడాన్ని ఖండిస్తూ, నేడు ఆర్టీసీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లను ఉరి తీశారు. అనంతరం వాటిని బాత్రూమ్ క్లీనర్ హార్పిక్‌తో కడిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళనకు దిగారు. నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కటౌట్‌కు ఉరి తీయడాన్ని ఖండిస్తూ, నేడు ఆర్టీసీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లను ఉరి తీశారు. అనంతరం వాటిని బాత్రూమ్ క్లీనర్ హార్పిక్‌తో కడిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.
    1
    100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన.....
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.