రైతులకు పండ్ల మొక్కల పెంపకంపై అవగాహన చింతూరు, ఆగస్టు 25: పండ్ల తోటల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు కుటుంబానికి పోషకాహారం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్‌లో స్థిరమైన జీవనోపాధి కల్పించవచ్చని పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (PWO) ప్రతినిధులు తెలిపారు. చింతూరు మండలం సుద్దగూడెం గ్రామంలో PWO స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతులకు పండ్ల తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి పలు రకాల పండ్ల మొక్కలను నాటారు. పండ్ల చెట్లను పెంచడం వల్ల పంటలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చని రైతులకు వివరించారు. ఇంటి అవసరాలకు పండ్లను వినియోగించుకోవడం ద్వారా కుటుంబ సభ్యులకు పోషకాహారం అందుతుందని తెలిపారు. పండ్ల మొక్కలు పెంచడం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెరుగుతుందని పేర్కొన్నారు. మొక్కలను నాటిన తర్వాత వాటిని క్రమం తప్పకుండా సంరక్షించడం ఎంతో ముఖ్యమని ప్రతినిధులు సూచించారు. మొక్కలకు అవసరమైన మేరకు నీటిని అందించడం, కలుపు మొక్కలను తొలగించడం, నేలలో తేమను కాపాడటం వంటి చర్యలను రైతులకు వివరించారు. పండ్ల మొక్కలకు వచ్చే తెగుళ్లు, వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేపట్టడం వల్ల భూమి సారాన్ని కాపాడుకోవచ్చని అవగాహన కల్పించారు. రైతులు తమ పొలాల్లో పండ్ల మొక్కలను విస్తృతంగా నాటి వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో సంరక్షించాలని PWO ప్రతినిధులు కోరారు. పండ్ల తోటల సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని, కుటుంబ అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా స్థిరమైన జీవనోపాధికి మార్గం ఏర్పడుతుందని తెలిపారు. గ్రామంలోని రైతులు పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి చూపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- సారపాకలో లారీ ఢీ.. ట్రాక్టర్ డ్రైవర్‌కు త్రివ గాయాలు... సారపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్ గేట్ వద్ద లారీ, ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నూతన బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రిడ్జి ఎంట్రన్స్ వద్ద మట్టి, ఇసుక పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో వాహనాలు స్కిడ్ అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే మట్టి, ఇసుకను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మార్గాన్ని సిద్ధం చేయాలని కోరుతున్నారు.3
- భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి..................... భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 20.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 23 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,45,344 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. వర్షాలు, ఎగువ ప్రవాహాలు కొనసాగితే సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.1
- సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక సాకేతపురి దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా . ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రము , ఆకుపూజ హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని,కోరిని కోర్కెలు తీర్చే ఇష్టదైవమని ఆయనకు తమలపాకు దండ, సింధూరం సమర్పించిన ఎలాంటి కష్టాలు దరిచేరవుఅని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది అని అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ,ఈ ఆలయ కేంద్రం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆలయ ఎప్పుడు నిర్మాణానికి భక్తులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ధన రూపేనా, వస్తురూపేనా సహాయ సహకారాలు అందించి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు .ఈ కార్యక్రమంలో భక్తులు ,మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు4
- ఆప్యాతలు కొలువైనను గడ్డ శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి గడ్డపై ఇలాంటి రోజు వస్తుంది అని ఎవరైనా అనుకున్నారా..... ??? తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష రాముడు నడయాడిన భద్రాద్రి నేలపై న్యాయం కోసం ఆడబిడ్డ ఆవేదన తల్లి దండ్రుల కుటుంబ వివాదంలో తనను దూరం చేశారంటూ కూతురి ఆవేదన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారిన మహిళ నిరసన భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారింది. తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదులుకున్న శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి నేలపై, తన తండ్రి ప్రేమ కోసం ఓ ఆడబిడ్డ న్యాయం కోరుతూ దీక్షకు కూర్చోవడం పలువురిని కలచివేస్తోంది. దీక్షకు కూర్చున్న మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తనను తండ్రి దూరం చేశారని ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో మాట్లాడి విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై తీవ్ర ఆరోపణలు తన తల్లి దాంపత్య జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొందని కూతురు ఆరోపించింది. భర్త తన తల్లిని మానసికంగా వేధించడంతో పాటు, ఆమెను ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో చేర్పించారని తెలిపింది. అయితే తనకు ఎలాంటి మానసిక సమస్య లేదని నిరూపించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొంది. కొన్నేళ్లుగా తన తల్లిని భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం దీక్ష తమ సమస్యను పలువురి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని బాధితురాలు వాపోయింది. ప్రభావశీల వ్యక్తుల అండదండలు ఉండటంతో ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది. తండ్రి ప్రేమ కోసం కూతురు రోడ్డుపై దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కుటుంబం వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇరువర్గాల వాదనలు పూర్తిస్థాయిలో తెలుసుకొని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. రాముడు నడయాడిన నేలపై.. తండ్రి ప్రేమ కోసం కూతురి కన్నీటి పోరాటం.1
- ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ **** ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.1
- రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్టర్ పార్వతి ఇన్‌స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం1
- ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---2
- భద్రాచలం: తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ దీక్ష.. న్యాయం కోసం కూతురి పోరాటం... భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చ నీయాంశంగా మారింది. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తన తండ్రి తనను దూరం చేశారని దీక్షకు దిగిన మహిళ ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిని కూడా భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని ఆరోపించింది. కుటుంబ సమస్యపై పలువురిని ఆశ్రయించినా న్యాయం జరగలేదని, ప్రభావశీలుల అండదండల కారణంగా తమకు న్యాయం దక్కడం లేదని పేర్కొంది. దీంతో న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది. అధికారులు స్పందించి ఇరువర్గాల వాదనలు విని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1