Shuru
Apke Nagar Ki App…
ఇంద్రవెల్లి అమరవీరులకు ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఇంద్రవెల్లి అమరవీరులకు స్తూపం వద్ద నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు,ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఘన నివాళి అర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసులు భూమి , భక్తి విముక్తి కొరకు పోరాటం చేసి అమరులైన ఆదివాసీల కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.మంత్రి సీతక్క అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరవీరుల కుటుంబాలను కలుస్తూ , వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు.ఐటీడీఏ ద్వారా అమరవీరుల కుటుంబాలకు రుణాలు అందించామన్నారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని , ఆర్ధికంగా వారికి తోడుగా నిలిచామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , ఆదివాసీ నాయకులు , కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Bojanapu Surendar
ఇంద్రవెల్లి అమరవీరులకు ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఇంద్రవెల్లి అమరవీరులకు స్తూపం వద్ద నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు,ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఘన నివాళి అర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసులు భూమి , భక్తి విముక్తి కొరకు పోరాటం చేసి అమరులైన ఆదివాసీల కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.మంత్రి సీతక్క అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరవీరుల కుటుంబాలను కలుస్తూ , వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు.ఐటీడీఏ ద్వారా అమరవీరుల కుటుంబాలకు రుణాలు అందించామన్నారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని , ఆర్ధికంగా వారికి తోడుగా నిలిచామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , ఆదివాసీ నాయకులు , కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼1
- కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడుగా ముమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో సంక్షేమ సంఘానికి ప్రతినిత్యం తనవంతు పోరాటాన్ని సాగిస్తానని ఆటో డ్రైవర్లకి ఏ కష్టమొచ్చినా నేను ముందుండి నడిపిస్తానని తెలిపారు1
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి రావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఎర్రవెల్లి నుంచి హెలికాప్టర్ లో జగిత్యాలకు చేరుకున్న కేసిఆర్ కు ఘనస్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు జీవన్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా కేసిఆర్ ఆలింగనం చేసుకుని జీవన్‌రెడ్డిని అభినందించారు. అనంతరం నేరుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ రాకతో సభా ప్రాంగణం నృత్యాలు, నినాదాలతో హోరెత్తింది. హెలికాప్టర్ నుంచి సభా ప్రాంగణం పై చక్కర్లు కొట్టారు. పార్టీ శ్రేణులు ఈలలు వేస్తు నృత్యాలు చేశారు. డ్రోన్ కెమెరాతో సభా ప్రాంగణం పై గులాబీ పూల వర్షం కురిపించారు.4
- Post by Merugu Rajitha1
- మానవత్వ వాదిగా,హేతు వాదిగా,అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి మలయశ్రీ. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సాహిత్య రంగంలో అనేక స్వీయ అనుభవం,కవితా,రచనలపై ఆయనకున్న పట్టుదల ఎంతో శ్లాఘనీయమైనదని,సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేకుర్తి వాస్తవ్యులు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ ఇటీవల మృతి చెందడంతో సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మలయశ్రీ చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వామపక్ష,అభ్యుదయ వాదిగా,కవితా రచనల పట్ల ఆసక్తితో అందులో అనేక మెళకువలు నేర్చుకొని,మానవాలి ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లును అవగాహన చేసుకొని,వాటిని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేసి పుస్తకాల రూపంలో ప్రజలకు అందించిన రచయిత అని,కులాల,మతాల,మానవత్వానికి సంబంధించిన అంతర్లీన అంశాలపై ఎన్నో ,ఎన్నెన్నో కవితలు,సామెతలు వ్రాసారని,మానవతా వాదిగా దోపిడీ రహిత పరిపాలన కొనసాగాలని,అంతరాలు లేని సమాజం కావాలని కోరుకునే వారని, 30 ఏళ్ల క్రితం తాను చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో మలయశ్రీ రచించిన సామెతలు - హేతువాదం అనే పుస్తకాన్ని నాకు అంకితం చేయడం అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నానని,డాక్టర్ మలయశ్రీ కవిగా,రచయితగా,హేతువాదిగా,వామపక్ష అభ్యుదయ వాదిగా నీతి,నిజాయితీగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడా జీవితాన్ని గడిపారని, సాహిత్య రంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు నావంతుగా కృషి చేస్తానని, ఎల్ ఎం డి లో కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేధో వికలాంగుల పాఠశాలలో మలయశ్రీ రచనలపై ఓ కార్యక్రమం నిర్వహిస్తామని,అలాంటి మహనీయుని జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నేటి తరం వారు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.1
- ఏప్రిల్ 23న చలో హైదరాబాద్ను జయప్రదం చేయండి. కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలి. అన్నమొల్ల కిరణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 23వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ ను కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతించాలని వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ కళాశాలలో డైట్లలో పనిచేస్తున్న స్వీపర్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డుల ఇతర కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదు. టెండర్ల కాలం ముగిసి సంవత్సరం కావస్తున్న నూతన టెండర్లను ప్రకటించలేదు. వేతనాలు పెంచాలని పెరిగిన బెడ్స్ సంఖ్యకు అనుగుణంగా కార్మికులను రిక్రూట్ చేసి పని భారాన్ని తగ్గించాలని కార్మికులు పదేపదే కోరుతున్న ప్రభుత్వం లో చలనం లేదు. కార్మికుల ఉపాధి భద్రత కొరకు గుర్తింపు కొరకు కనీస వేతనం 26 వేల రూపాయలు సాధించడం కొరకు పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు సాధన కోసం ఈనెల 23న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ మరియు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు రేసు సురేందర్ పండుగ పొచ్చన్న రిమ్స్ అధ్యక్షులు పెరిక దేవదాస్ సూపర్ స్పెషాలిటీ కార్యదర్శి మోక దేవేందర్ రెడ్డి నాయకులు సుమన్ తాయి హరీష్ రాణి రాజ్యలక్ష్మి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.2
- Post by Vodnala thirupthi1