ప్రజాసేవే లక్ష్యంగా... యువతకు స్ఫూర్తిగా కైరంకొండ వినోద్ కుమార్ ప్రజాసేవలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అతి చిన్న వయసులోనే ఎంపీటీసీగా ప్రజల ముందుకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ నాయకుడు కైరంకొండ వినోద్ కుమార్. పదవి అనేది కేవలం హోదా కాదని, అది ప్రజలకు సేవ చేసే బాధ్యత అని నమ్మే వ్యక్తిత్వం ఆయనది. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుంటూ, వారి కష్టాల్లో భాగస్వామిగా నిలబడుతూ, తనకు సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆయన రాజకీయ ప్రయాణంలో కనిపించే ప్రత్యేకత. చిన్న వయసులోనే ప్రజల నమ్మకాన్ని సంపాదించడం అంత సులభమైన విషయం కాదు. ఎన్నో సవాళ్లు, విమర్శలు, రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగడం ఆయనలోని పట్టుదలకు నిదర్శనం. “ప్రజల మధ్య ఉండాలి... ప్రజల సమస్యలను వినాలి... ప్రజల కోసం పనిచేయాలి” అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వినోద్ కుమార్, యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనే ఆలోచనకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియామకం పొందడం ఆయన ప్రజాసేవా ప్రయాణంలో మరో ముఖ్యమైన బాధ్యత. ఈ అవకాశం ఆయనపై మరింత బాధ్యతను పెంచడమే కాకుండా, సామాజిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికగా మారాలని ఆశిద్దాం. పదవులు మారవచ్చు... రాజకీయ పరిస్థితులు మారవచ్చు... కానీ ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పం మాత్రం మారకూడదు. ప్రజల కోసం నడిచే అడుగులు... సామాజిక న్యాయం కోసం వినిపించే గొంతు... యువతకు స్ఫూర్తినిచ్చే ప్రయాణం... అదే కైరంకొండ వినోద్ కుమార్ గారి ప్రజాసేవా ప్రస్థానం. ముందు రోజుల్లో మరింత ఉన్నతమైన బాధ్యతలు చేపట్టి, ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు.

- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లతో సమావేశం నిర్వహించ1
- మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1