logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మార్కాపురం జిల్లాలో ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే మార్కాపురం జిల్లాలో కుష్ఠు వ్యాధి గుర్తింపునకు ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కుష్ఠు వ్యాధి నివారణాధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. ఇప్పటివరకు 380 అనుమానిత మచ్చలు, లక్షణాలున్న వారిని ఆశా కార్యకర్తలు గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారని, వారిని మెడికల్‌ ఆఫీసర్లు పరీక్షించి వ్యాధి నిర్ధారిస్తారని చెప్పారు. దరిమడుగు గ్రామంలో సర్వేను పరిశీలించి, పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సర్వే అనంతరం ఇళ్లకు చాక్‌ పీసుతో మార్కింగ్ చేయాలని కోరారు.

1 day ago
user_Bharath kumar
Bharath kumar
యర్రగొండపాలెం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
1 day ago
204f2f02-26da-46f9-af71-5cdeaa909ae8

మార్కాపురం జిల్లాలో ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే మార్కాపురం జిల్లాలో కుష్ఠు వ్యాధి గుర్తింపునకు ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కుష్ఠు వ్యాధి నివారణాధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. ఇప్పటివరకు 380 అనుమానిత మచ్చలు, లక్షణాలున్న వారిని ఆశా కార్యకర్తలు గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారని, వారిని మెడికల్‌ ఆఫీసర్లు పరీక్షించి వ్యాధి నిర్ధారిస్తారని చెప్పారు. దరిమడుగు గ్రామంలో సర్వేను పరిశీలించి, పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సర్వే అనంతరం ఇళ్లకు చాక్‌ పీసుతో మార్కింగ్ చేయాలని కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.
    1
    మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి 
మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.
    1
    పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి
HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    2 hrs ago
  • ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్స్ యు కృప సమాధానం తోడైయులను గాక
    1
    ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్స్ యు కృప సమాధానం తోడైయులను గాక
    user_T. Raja simha
    T. Raja simha
    కలసపాడు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
    1
    అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం 
అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
    user_Sambasiva
    Sambasiva
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.
    1
    అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన
నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ  మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.
    user_Khajavali
    Khajavali
    General Store ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    11 hrs ago
  • రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు
    1
    రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • మోదీ జన్మదినం సందర్భంగా పాలడుగులో సేవా కార్యక్రమాలు పురాతన శివాలయాన్ని శుభ్రం చేసిన బీజేపీ నాయకులు – ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు మోత్కూర్,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మోత్కూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాలడుగు గ్రామంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పురాతన శివాలయ పరిసరాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, పరిశుభ్రతతో పాటు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించాలనే సందేశాన్ని చాటారు.అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, దేశానికి మరింతకాలం సేవ చేసే శక్తిని అందించాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవ, పరిశుభ్రత, ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తితో గ్రామాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.దేశ సేవను ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు సమాజ సేవకు నిరంతరం కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుదే మధుసూదన్ యాదవ్, బీజేపీ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ బూత్ అధ్యక్షులు ఆళ్ల శివప్రసాద్, ముక్కామల గణేష్, బీజేపీ నాయకులు బరిగల శేఖర్, కందికట్ల అజయ్, ఎడ్ల సునీల్, ముక్కాముల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    4
    మోదీ జన్మదినం సందర్భంగా పాలడుగులో సేవా కార్యక్రమాలు
పురాతన శివాలయాన్ని శుభ్రం చేసిన బీజేపీ నాయకులు – ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు
మోత్కూర్,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మోత్కూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాలడుగు గ్రామంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పురాతన శివాలయ పరిసరాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, పరిశుభ్రతతో పాటు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించాలనే సందేశాన్ని చాటారు.అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, దేశానికి మరింతకాలం సేవ చేసే శక్తిని అందించాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ  జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవ, పరిశుభ్రత, ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తితో గ్రామాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.దేశ సేవను ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు సమాజ సేవకు నిరంతరం కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుదే మధుసూదన్ యాదవ్, బీజేపీ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ బూత్ అధ్యక్షులు ఆళ్ల శివప్రసాద్, ముక్కామల గణేష్, బీజేపీ నాయకులు బరిగల శేఖర్, కందికట్ల అజయ్, ఎడ్ల సునీల్, ముక్కాముల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_రిపోర్టర్ ముషం శ్రీనివాస్
    రిపోర్టర్ ముషం శ్రీనివాస్
    Local News Reporter మోత్కూర్, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • కృష్ణా జలాలతో నిండిపోయిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాలు నిండిపోయాయి. అధికారులు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించిన విషయం తెలిసినదే. దీంతో మునిగిపోయిన తమ గ్రామాలను చూడడానికి నిర్వాసితులు ఆసక్తి కనపరిచారు.
    1
    కృష్ణా జలాలతో నిండిపోయిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు 
పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాలు నిండిపోయాయి. అధికారులు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించిన విషయం తెలిసినదే. దీంతో మునిగిపోయిన తమ గ్రామాలను చూడడానికి నిర్వాసితులు ఆసక్తి కనపరిచారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.