logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. యు టి ఎఫ్ డిమాండ్ ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యు టి ఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు దావీదు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారి నాగరాజు,జిల్లా కార్యదర్శులు గుమ్మల బాబు,కౌలన్న మంగళవారం డిమాండ్ చేశారు.టెట్ రద్దు కోరుతూ వారు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2010 కు ముందు నియామకమైన ఉపాధ్యాయులు భవిష్యత్తులో ఉద్యోగంలో కొనసాగాలన్న, లేదా ప్రమోషన్ పొందాలన్నా టెట్ పరీక్ష పాస్ కావలసి వస్తున్నది.25-30 సంవత్సరాల క్రితం పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సర్వీస్ చేస్తున్న ఉపాధ్యాయులను ఇప్పుడు పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.సర్వీస్ లో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటే,విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)సవరణ చేయవలసి ఉంది.రాష్ట్రంలోనూ,కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉన్నది.కావున వెంటనే చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు.అందరికీ 60 మార్కులను పాస్ మార్కులుగా నిర్ణయించాలి,ఏ సబ్జెక్టు వారికి ఆ సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పూర్వ అధ్యక్షులు యల్లప్ప,చంద్రపాల్,ప్రశాంత్ భూపాల్,గురుస్వామి,భాస్కర్,సుధాకర్,రాఘవేంద్ర,లక్ష్మన్న,శంకరయ్య,శాంతరాజు,శాంతన్న,శంకర్ నాయక్,కె.నాగరాజు,భాగ్యరాజు,రామ్ మోహన్,మంజునాథ్,వీరేశ్,శ్రీధర్ రావ్,సుధాకర్,రాజన్న,నగేష్,విజయ్,బాలరాజు,లోకనాథ్,సంజీవప్ప ఉపాధ్యా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

12 hrs ago
user_మంచోది రాజు
మంచోది రాజు
Local News Reporter మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago
40255751-0a76-4940-bf01-c11da229001f

ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. యు టి ఎఫ్ డిమాండ్ ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యు టి ఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు దావీదు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారి నాగరాజు,జిల్లా కార్యదర్శులు గుమ్మల బాబు,కౌలన్న మంగళవారం డిమాండ్ చేశారు.టెట్ రద్దు కోరుతూ వారు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2010 కు ముందు నియామకమైన ఉపాధ్యాయులు భవిష్యత్తులో ఉద్యోగంలో కొనసాగాలన్న, లేదా ప్రమోషన్ పొందాలన్నా టెట్ పరీక్ష పాస్ కావలసి వస్తున్నది.25-30 సంవత్సరాల క్రితం పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సర్వీస్ చేస్తున్న ఉపాధ్యాయులను ఇప్పుడు పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.సర్వీస్ లో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటే,విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)సవరణ చేయవలసి ఉంది.రాష్ట్రంలోనూ,కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉన్నది.కావున వెంటనే చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు.అందరికీ 60 మార్కులను పాస్ మార్కులుగా నిర్ణయించాలి,ఏ సబ్జెక్టు వారికి ఆ సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పూర్వ అధ్యక్షులు యల్లప్ప,చంద్రపాల్,ప్రశాంత్ భూపాల్,గురుస్వామి,భాస్కర్,సుధాకర్,రాఘవేంద్ర,లక్ష్మన్న,శంకరయ్య,శాంతరాజు,శాంతన్న,శంకర్ నాయక్,కె.నాగరాజు,భాగ్యరాజు,రామ్ మోహన్,మంజునాథ్,వీరేశ్,శ్రీధర్ రావ్,సుధాకర్,రాజన్న,నగేష్,విజయ్,బాలరాజు,లోకనాథ్,సంజీవప్ప ఉపాధ్యా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న జిల్లా మంత్రులు - _*కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పర్యటనలో సహచర మంత్రి గొట్టిపాటి రవి,కర్నూలు ఎంపీ బస్తి పాటి నాగరాజు,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి,గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి,కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ,మంత్రాలయం ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి లక్ష్మన్న,మరియు కూటమి పార్టీల నాయకులతో గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది.*_ #NimmalaRamaNaidu #kurnoolcity #BvJayaNageshwaraReddy #APGovernment #NDA #leader #temples
    1
    మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న జిల్లా మంత్రులు
- _*కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పర్యటనలో సహచర మంత్రి గొట్టిపాటి రవి,కర్నూలు ఎంపీ బస్తి పాటి నాగరాజు,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి,గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి,కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ,మంత్రాలయం ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి లక్ష్మన్న,మరియు కూటమి పార్టీల నాయకులతో గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది.*_
#NimmalaRamaNaidu #kurnoolcity
#BvJayaNageshwaraReddy
#APGovernment #NDA #leader
#temples
    user_మంచోది రాజు
    మంచోది రాజు
    Local News Reporter మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • కౌతాళం: ఉరుకుంద దేవస్థానం హుండీ ఆదాయం రూ.92.46 లక్షలు..! కౌతాలం మండలం ఉరుకుంద శ్రీలక్ష్మీ నరసింహ, ఎర్రన్నస్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల హుండీ లెక్కింపు చేపట్టగా రూ.92,46,685 ఆదాయం సమకూరింది. హుండీలో 21.5 గ్రాముల బంగారం, 15.2 కిలోల వెండి లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఓ కె.వాణి ఆధ్వర్యంలో, పాలకమండలి చైర్మన్ టి.జి. పాండురంగ శెట్టి, సభ్యుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, ఉరుకుంద యూనియన్ బ్యాంక్ సిబ్బంది
    1
    కౌతాళం: ఉరుకుంద దేవస్థానం హుండీ ఆదాయం రూ.92.46 లక్షలు..!
కౌతాలం మండలం ఉరుకుంద శ్రీలక్ష్మీ నరసింహ, ఎర్రన్నస్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల హుండీ లెక్కింపు చేపట్టగా రూ.92,46,685 ఆదాయం సమకూరింది. హుండీలో 21.5 గ్రాముల బంగారం, 15.2 కిలోల వెండి లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
డిప్యూటీ కమిషనర్, ఈఓ కె.వాణి ఆధ్వర్యంలో, పాలకమండలి చైర్మన్ టి.జి. పాండురంగ శెట్టి, సభ్యుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, ఉరుకుంద యూనియన్ బ్యాంక్ సిబ్బంది
    user_Ulidra Raju
    Ulidra Raju
    పెద కడుబూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం 11 మంది లబ్ధిదారులకు రూ.10.70 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి 
ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం 11 మంది లబ్ధిదారులకు రూ.10.70 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_ABHI LOHITH
    ABHI LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • స్వచ్ఛందంగా త్రాగునీటి కొరకు రోడ్డు పైకీ ఎక్కి ఆగ్రహించిన మహిళలు. ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అంటున్న పోలీసులు. ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కొండపేట చెందిన మహిళలు స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్డుపైకి ఎక్కి అగ్రహంతో ధర్నాకు దిగారు. మహిళలు మాట్లాడుతూ ఏ ఒక్క నాయకుడు వచ్చినా తూతూ మంత్రంగానే మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప కోడుమూరు పట్టణానికి శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఇంకిత జ్ఞానం నాయకులకు లేదు. మాకు 20 రోజులైనా కుళాయిల నుంచి నీరు అందటం లేదు మేము ఎందుకు రోడ్డుపైకి వస్తాం మాకు ఏమైనా పొగరా..? మాకు నీళ్లు వస్తే ఎందుకు ఎక్కుతం రోడ్డు. అదే మీ ఇండ్లలో నీళ్లు లేకుంటే మీ ఆడవాళ్లు ఎలా ఉంటారు మీకు అర్థమవుతుంది మాలాగైతేనే మీకు తెలుస్తుంది ఉద్యోగాలు చేసుకుని జీతాలు తినేది కాదు.. నీటి సమస్యను తీరేంతవరకు ఈ ధర్నా నుంచి విరమించుకునేదే లేదు కలెక్టర్ రావాలి అంటూ పట్టు పట్టారు. పోలీసులు వచ్చి మహిళలు మాట్లాడిన మాటలు విని పోలీసులు మాట్లాడుతూ మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు. పరిమిషన్ ఉంటేనే ధర్నాకు దిగాలి మీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కితే సరిపోదు మీ మీద కేసులు పెడతాం జాగ్రత్త అంటూ ఆగ్రహించారు. అంబులెన్స్ లో నాలుగు వెళ్లాయి గర్భవతులు అందులో ఉన్నారు అందులో గర్భవతులు చనిపోతే మీ మీద కేసులు పెడతాం . ఇదంతా సిపిఎం పార్టీ వాళ్లే చేసినట్టు ఉన్నారు.అంటూ గాంభీరంగా పోలీసులు మాట్లాడారు .దురుసు ఎక్కువ అయిపోతున్నది అంటూ మహిళలు పోలీసులపై మండిపడ్డారు. మాకు ఏ నాయకులతో సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్ ఎక్కాం.మా ఇండ్లలో మాదిరిగా మీకు మా పరిస్థితి వస్తే సరిపోతుంది. ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాట్లాడేది కాదు మాకు ఏ నాయకుడు చెప్పలేదు రోడ్డు ఎక్కమని.మేమే స్వచ్ఛందంగా వచ్చాం త్రాగునీటి కొరకు మా ఇండ్లలో నీళ్లు ఉన్నాయో లేదో పోలీసులైన పంచాయతీ అధికారులు అయిన మీరు వచ్చి చూడండి మీకు అర్థం అవుతుంది. అంటూ మహిళల ఆగ్రహించి మాట్లాడారు. ఒక్కసారిగా పోలీసులు ఏమీ ఆలోచించకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగా ధర్నాకు దిగిన మహిళలను పోలీసు స్టేషన్ కు తరలించారు. మరి కోడుమూరు త్రాగునీటి సమస్య ఎంతవరకు అవుతుందో సమస్యను తీరుస్తారో లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ వీడియో చూస్తే అధికారులకు తెలుస్తుంది. వేచి చూడాలి.
    1
    స్వచ్ఛందంగా త్రాగునీటి కొరకు రోడ్డు పైకీ ఎక్కి ఆగ్రహించిన మహిళలు. ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అంటున్న పోలీసులు. 
( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కొండపేట చెందిన మహిళలు స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్డుపైకి ఎక్కి అగ్రహంతో ధర్నాకు దిగారు. మహిళలు మాట్లాడుతూ ఏ ఒక్క నాయకుడు వచ్చినా తూతూ మంత్రంగానే మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప కోడుమూరు పట్టణానికి శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఇంకిత జ్ఞానం నాయకులకు లేదు. మాకు 20 రోజులైనా కుళాయిల నుంచి నీరు అందటం లేదు మేము ఎందుకు రోడ్డుపైకి వస్తాం మాకు ఏమైనా పొగరా..? మాకు నీళ్లు వస్తే ఎందుకు ఎక్కుతం రోడ్డు. అదే మీ ఇండ్లలో నీళ్లు లేకుంటే మీ ఆడవాళ్లు ఎలా ఉంటారు మీకు అర్థమవుతుంది మాలాగైతేనే మీకు తెలుస్తుంది ఉద్యోగాలు చేసుకుని జీతాలు తినేది కాదు.. నీటి సమస్యను తీరేంతవరకు ఈ ధర్నా నుంచి విరమించుకునేదే లేదు కలెక్టర్ రావాలి అంటూ పట్టు పట్టారు. పోలీసులు వచ్చి మహిళలు మాట్లాడిన మాటలు విని పోలీసులు మాట్లాడుతూ మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు. పరిమిషన్ ఉంటేనే ధర్నాకు దిగాలి మీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కితే సరిపోదు మీ మీద కేసులు పెడతాం జాగ్రత్త అంటూ ఆగ్రహించారు. అంబులెన్స్ లో నాలుగు వెళ్లాయి గర్భవతులు అందులో ఉన్నారు అందులో గర్భవతులు చనిపోతే మీ మీద కేసులు పెడతాం . ఇదంతా సిపిఎం పార్టీ వాళ్లే చేసినట్టు ఉన్నారు.అంటూ గాంభీరంగా పోలీసులు మాట్లాడారు .దురుసు ఎక్కువ అయిపోతున్నది అంటూ మహిళలు పోలీసులపై మండిపడ్డారు. మాకు ఏ నాయకులతో సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్ ఎక్కాం.మా ఇండ్లలో మాదిరిగా  మీకు మా పరిస్థితి వస్తే సరిపోతుంది. ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాట్లాడేది కాదు మాకు ఏ నాయకుడు చెప్పలేదు రోడ్డు  ఎక్కమని.మేమే స్వచ్ఛందంగా వచ్చాం త్రాగునీటి కొరకు మా ఇండ్లలో నీళ్లు ఉన్నాయో లేదో పోలీసులైన పంచాయతీ అధికారులు అయిన మీరు వచ్చి చూడండి మీకు అర్థం అవుతుంది. అంటూ మహిళల ఆగ్రహించి మాట్లాడారు. ఒక్కసారిగా పోలీసులు ఏమీ ఆలోచించకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగా ధర్నాకు దిగిన మహిళలను పోలీసు స్టేషన్ కు తరలించారు. మరి కోడుమూరు త్రాగునీటి సమస్య ఎంతవరకు అవుతుందో సమస్యను తీరుస్తారో లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ వీడియో చూస్తే అధికారులకు తెలుస్తుంది. వేచి చూడాలి.
    user_BANDA Nagaraju News repor
    BANDA Nagaraju News repor
    కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు *ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం *గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.* *ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.* *ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.
    1
    గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు
*ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం 
*గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.*
*ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.*
*ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆటో డ్రైవర్‌కు హెచ్చరిక ఆలూరు, ఆగస్టు 25: విద్యార్థుల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి సూచించారు. ఆదోని నుంచి ఆలూరు వైపు వెళ్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులను పరిమితికి మించి ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు. విద్యార్థులు ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితిని చూసిన వైకుంఠం జ్యోతి వెంటనే ఆటోను ఆపించి డ్రైవర్‌తో మాట్లాడారు. చిన్నారులను ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణింపజేయడం సరికాదని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆమె డ్రైవర్‌కు వివరించారు. ఇకపై ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటో డ్రైవర్‌ను ఆమె హెచ్చరించారు. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే వాహనాల విషయంలో డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులను తరలించే వాహనాల్లో అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించకుండా, వాహన సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యార్థుల రవాణా విషయంలో సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని, అందువల్ల విద్యార్థుల రవాణాలో భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలని వైకుంఠం జ్యోతి సూచించారు. “విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఇలాంటి పరిస్థితులు మరోసారి కనిపించకుండా డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆమె స్పష్టం చేశారు.
    2
    విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి
విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి
విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆటో డ్రైవర్‌కు హెచ్చరిక
ఆలూరు, ఆగస్టు 25:
విద్యార్థుల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి సూచించారు. ఆదోని నుంచి ఆలూరు వైపు వెళ్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులను పరిమితికి మించి ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు.
విద్యార్థులు ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితిని చూసిన వైకుంఠం జ్యోతి వెంటనే ఆటోను ఆపించి డ్రైవర్‌తో మాట్లాడారు. చిన్నారులను ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణింపజేయడం సరికాదని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆమె డ్రైవర్‌కు వివరించారు.
ఇకపై ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటో డ్రైవర్‌ను ఆమె హెచ్చరించారు. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే వాహనాల విషయంలో డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
విద్యార్థులను తరలించే వాహనాల్లో అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించకుండా, వాహన సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యార్థుల రవాణా విషయంలో సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని, అందువల్ల విద్యార్థుల రవాణాలో భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలని వైకుంఠం జ్యోతి సూచించారు.
“విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఇలాంటి పరిస్థితులు మరోసారి కనిపించకుండా డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆమె స్పష్టం చేశారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • అలంపూర్: మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్!! మొక్కలను నాటుదాం దానిని చెట్లగా మారుద్దాం.. మున్సిపల్ కమిషనర్ రాజేష్ పిలుపు అలంపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రాజేష్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందేటట్లు చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు , మున్సిపల్ చైర్మన్ పీజయరాముడు, వైస్ చైర్మన్ విక్రం,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    1
    అలంపూర్: మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్!! మొక్కలను నాటుదాం దానిని చెట్లగా మారుద్దాం.. మున్సిపల్ కమిషనర్ రాజేష్ పిలుపు
అలంపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రాజేష్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందేటట్లు చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు , మున్సిపల్ చైర్మన్ పీజయరాముడు, వైస్ చైర్మన్ విక్రం,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    19 hrs ago
  • NGKL:​హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.
    3
    NGKL:​హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక
ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.