logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*డెలావేర్ గవర్నర్ హైదరాబాద్ పర్యటన* _ఈసీఐఎల్‌లో డా. ఏ.ఎస్. రావు విగ్రహానికి నివాళి కాప్రా, అమెరికాలోని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. ఆయనతో పాటు ఆ రాష్ట్ర కార్యదర్శి చారుణి పాటిబండ సాంచెజ్, గవర్నర్ సతీమణి డా. లారీన్ మేయర్ మరియు భారత–అమెరికా దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులతో కూడిన ప్రతినిధి బృందం కూడా నగరానికి చేరుకుంది.శనివారం నగరంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రధాన ద్వారం వద్ద సంస్థ స్థాపకుడు ఏ ఎస్ రావు విగ్రహానికి చారుణి పాటిబండ సాంచెజ్ పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మ్యాట్ మేయర్ మరియు ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. ఏ.ఎస్. రావు దేశానికి శాస్త్ర సాంకేతిక రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రతినిధి బృందం ఈసీఐఎల్ సంస్థ కార్యకలాపాలు, పరిశోధనల గురించి అధికారులు నుంచి వివరాలు తెలుసుకుంది.హైదరాబాద్ నగరం ఐటీ, ఔషధ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, డెలావేర్ రాష్ట్రంతో వ్యాపార, పరిశోధన, పెట్టుబడి అవకాశాలను మరింత విస్తరించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రతినిధి బృందం అభిప్రాయపడింది.ఈ సందర్భంగా డా. ఏ.ఎస్. రావు మనవరాలు చారుణి పాటిబండ సాంచెజ్ మాట్లాడుతూ తాత ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి కృషి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ సీఎండీ అనిష్ కుమార్ శర్మ, డా. ఏ.ఎస్. రావు కుమార్తె సుగుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

on 7 March
user_Suresh Sagar
Suresh Sagar
కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
on 7 March
eceef2d3-b22b-450d-b696-de40885c51aa

*డెలావేర్ గవర్నర్ హైదరాబాద్ పర్యటన* _ఈసీఐఎల్‌లో డా. ఏ.ఎస్. రావు విగ్రహానికి నివాళి కాప్రా, అమెరికాలోని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. ఆయనతో పాటు ఆ రాష్ట్ర కార్యదర్శి చారుణి పాటిబండ సాంచెజ్, గవర్నర్ సతీమణి డా. లారీన్ మేయర్ మరియు భారత–అమెరికా దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులతో కూడిన

ప్రతినిధి బృందం కూడా నగరానికి చేరుకుంది.శనివారం నగరంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రధాన ద్వారం వద్ద సంస్థ స్థాపకుడు ఏ ఎస్ రావు విగ్రహానికి చారుణి పాటిబండ సాంచెజ్ పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మ్యాట్ మేయర్ మరియు ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. ఏ.ఎస్. రావు

దేశానికి శాస్త్ర సాంకేతిక రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రతినిధి బృందం ఈసీఐఎల్ సంస్థ కార్యకలాపాలు, పరిశోధనల గురించి అధికారులు నుంచి వివరాలు తెలుసుకుంది.హైదరాబాద్ నగరం ఐటీ, ఔషధ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, డెలావేర్ రాష్ట్రంతో వ్యాపార, పరిశోధన, పెట్టుబడి అవకాశాలను మరింత విస్తరించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రతినిధి బృందం అభిప్రాయపడింది.ఈ

సందర్భంగా డా. ఏ.ఎస్. రావు మనవరాలు చారుణి పాటిబండ సాంచెజ్ మాట్లాడుతూ తాత ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి కృషి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ సీఎండీ అనిష్ కుమార్ శర్మ, డా. ఏ.ఎస్. రావు కుమార్తె సుగుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    1
    గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు.  ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    1 day ago
  • నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    6 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    1
    నల్లగొండ బ్రేకింగ్:
నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..*
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
మంత్రి మాట్లాడుతూ..
నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష...
లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి...
పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి...
డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన...
అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం...
అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి...
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి...
ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది...
కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    20 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :04.04.2026 కామారెడ్డి జిల్లా శనివారం రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం: గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389 సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369 అని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్, చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :04.04.2026
కామారెడ్డి జిల్లా శనివారం 
రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం
రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం:
గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389
సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369
అని తెలియజేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్,  చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు   కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    49 min ago
  • కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    4
    కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో  మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో  కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    10 hrs ago
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు
    1
    కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ 
గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు 
గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని 
రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో  రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    51 min ago
  • తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాదులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు.మహిళలకు 2500లు, తులం బంగారం, స్కూటీ, 4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4 వేల భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటికాదన్నారు.రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతోందని తెలిపారు. కేరళ ప్రజలతోపాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా... ఒక్కసారి తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బండి సంజయ్ కోరారు.
    1
    తెలంగాణలో 6 గ్యారంటీలను  అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాదులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు.మహిళలకు 2500లు, తులం బంగారం, స్కూటీ, 4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4 వేల భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన  అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటికాదన్నారు.రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతోందని తెలిపారు. కేరళ ప్రజలతోపాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా... ఒక్కసారి తెలంగాణకు వచ్చి 
6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని  బండి సంజయ్ కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.