logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోథ్ మండల కేంద్రంలోని సాయి ఫంగ్షన్ హాల్‌లో నిర్వహించిన బోథ్ నియోజకవర్గ స్థాయి ప్రజా పాలనా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తూ, ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం,బోథ్ నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 439 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు,బోథ్ మండలానికి చెందిన 235 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.అదే విధంగా, మారాక ద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజలు ఎవరూ మత్తుకు బానిసలుగా మారకూడదని,మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లలపై నిగ ఉంచి,చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాలని కోరారు. బోథ్ పట్టణ కేంద్రంలోనే త్వరలో నూతన ఫైర్ స్టేషన్ నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు,నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

14 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Adilabad Urban, Telangana•
14 hrs ago

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోథ్ మండల కేంద్రంలోని సాయి ఫంగ్షన్ హాల్‌లో నిర్వహించిన బోథ్ నియోజకవర్గ స్థాయి ప్రజా పాలనా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తూ, ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం,బోథ్ నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 439 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు,బోథ్ మండలానికి చెందిన 235 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.అదే విధంగా, మారాక ద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజలు ఎవరూ మత్తుకు బానిసలుగా మారకూడదని,మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లలపై నిగ ఉంచి,చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాలని కోరారు. బోథ్ పట్టణ కేంద్రంలోనే త్వరలో నూతన ఫైర్ స్టేషన్ నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు,నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో @NameisNani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.
    1
    పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. 
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో @NameisNani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 
ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట  జరిగినది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    15 hrs ago
  • Post by Solanke Ravi
    5
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • *మత్తు పదార్థాలకు యువత బానిస అవుతుంది* *గ్రామాల్లో పట్టణంలో గంజాయి అమ్ముతున్నారు* *పిల్లలు, యువత చెడు బాట పడుతున్నారు* *పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించండి* *లేకపోతే ఇది సమాజానికే ప్రమాదం* *గంజాయి నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి* *ప్రజా పాలన లో అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*
    1
    *మత్తు పదార్థాలకు యువత బానిస అవుతుంది*
*గ్రామాల్లో పట్టణంలో గంజాయి అమ్ముతున్నారు*
*పిల్లలు, యువత చెడు బాట పడుతున్నారు*
*పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించండి*
*లేకపోతే ఇది సమాజానికే ప్రమాదం*
*గంజాయి నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి*
*ప్రజా పాలన లో అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2k రన్. ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు,యువత, విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన 2K రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యత గలవారిగా వ్యవహరించి,డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు.కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో,క్రీడాకారులతో ప్రతిజ్ఞ. "నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు,యువత, ప్రజలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    3
    డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి.
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2k రన్.
ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు,యువత, విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది.
డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన 2K రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ
డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యత గలవారిగా వ్యవహరించి,డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా  అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు.
ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై  విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు.కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో,క్రీడాకారులతో ప్రతిజ్ఞ.
"నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు,యువత, ప్రజలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం పోలీసు అధికారులు ముమ్మరంగా నాఖాబందీ మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు మరియు సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ​తనిఖీల్లో వెల్లడైన వివరాలు: ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల కింద నమోదైన కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి: ​సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు: 82 ​నంబర్ ప్లేట్ లేని వాహనాలు: 21 ​డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం): 35 ​మైనర్ డ్రైవింగ్ (వయస్సు నిండని వారు వాహనం నడపడం): 02 ​ఈ-పెట్టీ (e-Petty) కేసులు: 139 ​ముఖ్య గమనిక: ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (RC), ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ​శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
    1
    శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం పోలీసు అధికారులు ముమ్మరంగా నాఖాబందీ మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు మరియు సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
​తనిఖీల్లో వెల్లడైన వివరాలు:
ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల కింద నమోదైన కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
​సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు: 82
​నంబర్ ప్లేట్ లేని వాహనాలు: 21
​డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం): 35
​మైనర్ డ్రైవింగ్ (వయస్సు నిండని వారు వాహనం నడపడం): 02
​ఈ-పెట్టీ (e-Petty) కేసులు: 139
​ముఖ్య గమనిక:
ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (RC), ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
​శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • *సరి'కొత్త' కోర్సుల సందడి* : ఉపాధికి పెద్దపీట - కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఆరునూతన కోర్సులను మంజూరు చేసింది.‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఈ కోర్సుల్లో ఒక్కో విభాగానికి ఆరవై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. బి.ఎస్సీ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అప్లైడ్ న్యూట్రిషన్. బి.ఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కళాశాలలో ఇప్పటికే తోమ్మిది రకాల డిగ్రీ కోర్సులు,పదకొండు పీజీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఏడాది హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేటింగ్ కోర్సును ప్రారంభించారు. గత విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా మంజూరైన ఈ ఆరు కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో సమానంగా అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.దీనివల్ల విద్యార్థులకు చదువుతో పాటే ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా రావడంతో పాటు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు మంజూరు కావడం శుభపరిణామం. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ప్లేస్‌మెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మొదటి విడత ఈ నెల 8వ తారీకు వరకు ఉండగా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు కళాశాలకు నేరుగా గాని ,దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్ సందర్శించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంచుకోవాలని కోరారు.
    1
    *సరి'కొత్త' కోర్సుల సందడి* :
ఉపాధికి పెద్దపీట - కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఆరునూతన కోర్సులను మంజూరు చేసింది.‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు.
వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఈ కోర్సుల్లో ఒక్కో విభాగానికి ఆరవై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.
బి.ఎస్సీ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అప్లైడ్ న్యూట్రిషన్.
బి.ఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి.
కళాశాలలో ఇప్పటికే తోమ్మిది రకాల డిగ్రీ కోర్సులు,పదకొండు పీజీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఏడాది హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేటింగ్ కోర్సును ప్రారంభించారు. 
గత విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా మంజూరైన ఈ ఆరు కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో సమానంగా అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.దీనివల్ల విద్యార్థులకు చదువుతో పాటే ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "కళాశాలకు స్వయంప్రతిపత్తి  హోదా రావడంతో పాటు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు మంజూరు కావడం శుభపరిణామం. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ప్లేస్‌మెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మొదటి విడత ఈ నెల 8వ తారీకు వరకు ఉండగా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు కళాశాలకు నేరుగా గాని ,దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్ సందర్శించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంచుకోవాలని కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • భిక్నూర్ 02-05-2026 కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. లబ్దిదారులకు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ కార్యక్రమంలో భిక్నూర్ గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, భిక్నూర్ మండల అధ్యక్షులు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,గ్రామ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు రాజబాబు గౌడ్, విజయ్ గౌడ్, వెంకటేష్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    1
    భిక్నూర్ 02-05-2026
కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం  చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. లబ్దిదారులకు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు.
ఈ కార్యక్రమంలో భిక్నూర్ గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, భిక్నూర్ మండల అధ్యక్షులు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,గ్రామ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు రాజబాబు గౌడ్, విజయ్ గౌడ్, వెంకటేష్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ ఎం లు, వివిధ విభాగాల హెచ్ఓడి , డీఎం లు.. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం.. మంత్రి పొన్నం ప్రభాకర్ RTC అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణీకులకు సంధించి సానుకూలంగా ఉండాలి ప్రతి డివిజన్ స్థాయి అధికారులను కోరుతున్న సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో సానుకూల దృక్పధంతో పనులు చేయించాలి ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీ గా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలి.. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.. మే 17 లోపల మీ మీ డిపోలో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి.. టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలి 2023 డిసెంబర్ 9 నుండి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చాం ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలి టిక్కెట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోండి, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదు.. సoస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయం.. ప్రతి రెండవ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి..డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలి ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలు ,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు మెయింటేన్ చేయాలి.. ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాక పోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం.. సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి.. మంత్రి నుండి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉందో చూడండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలలాలను సమస్యను పరిష్కరించండి ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దాం..
    2
    జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ ఎం లు,  వివిధ విభాగాల హెచ్ఓడి , డీఎం లు..
నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం..
మంత్రి పొన్నం ప్రభాకర్
RTC అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణీకులకు సంధించి  సానుకూలంగా ఉండాలి
ప్రతి డివిజన్ స్థాయి అధికారులను కోరుతున్న సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో సానుకూల దృక్పధంతో  పనులు చేయించాలి
ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీ గా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలి..
డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి..
మే 17 లోపల మీ మీ డిపోలో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి..
టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలి
2023 డిసెంబర్ 9 నుండి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చాం
ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలి
టిక్కెట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోండి, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదు..
సoస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయం..
ప్రతి రెండవ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి..డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలి
ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలు ,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు మెయింటేన్ చేయాలి..
ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాక పోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం..
సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి..
మంత్రి నుండి  సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం
పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉందో చూడండి
ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలలాలను సమస్యను పరిష్కరించండి
ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దాం..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.