కామారెడ్డి మండలం : ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతనంగా 6 కోర్సులు మంజూరు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ *సరి'కొత్త' కోర్సుల సందడి* : ఉపాధికి పెద్దపీట - కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఆరునూతన కోర్సులను మంజూరు చేసింది.‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఈ కోర్సుల్లో ఒక్కో విభాగానికి ఆరవై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. బి.ఎస్సీ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అప్లైడ్ న్యూట్రిషన్. బి.ఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కళాశాలలో ఇప్పటికే తోమ్మిది రకాల డిగ్రీ కోర్సులు,పదకొండు పీజీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఏడాది హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేటింగ్ కోర్సును ప్రారంభించారు. గత విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా మంజూరైన ఈ ఆరు కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో సమానంగా అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.దీనివల్ల విద్యార్థులకు చదువుతో పాటే ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా రావడంతో పాటు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు మంజూరు కావడం శుభపరిణామం. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ప్లేస్‌మెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మొదటి విడత ఈ నెల 8వ తారీకు వరకు ఉండగా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు కళాశాలకు నేరుగా గాని ,దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్ సందర్శించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంచుకోవాలని కోరారు.

- శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం పోలీసు అధికారులు ముమ్మరంగా నాఖాబందీ మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు మరియు సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనిఖీల్లో వెల్లడైన వివరాలు: ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల కింద నమోదైన కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి: సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు: 82 నంబర్ ప్లేట్ లేని వాహనాలు: 21 డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం): 35 మైనర్ డ్రైవింగ్ (వయస్సు నిండని వారు వాహనం నడపడం): 02 ఈ-పెట్టీ (e-Petty) కేసులు: 139 ముఖ్య గమనిక: ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (RC), ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.1
- మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి పీ ఎస్ ఆర్ గార్డెన్ లో మహిళా సంఘాల సభ్యులకు 195.18 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను శనివారం పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు వనిత, అంజమ్మ పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్(34) ప్రమాదవశాత్తు ఎల్ఎండి లోని బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మిత్రుడితో కలిసి డ్యామ్ వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు బావిలో జారిపోవడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పొరండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ కు భార్య సబిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులతోపాటు పలువురు అధికారులు పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.1
- Post by Solanke Ravi3
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లాలోని అక్కారం గ్రామంలో 02-05-2026న నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్, ప్రజా గాయకుడు బుడిగే ఎల్లం (యూట్యూబర్ ) మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బుడిగే ఎల్లం మాట్లాడుతూ, గతంలో సొంత పార్టీని విడిచి కాంగ్రెస్‌లో చేరిన తాను, రెండు సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం బీఆర్‌ఎస్ పార్టీని మించిన పార్టీ తెలంగాణలో లేదని భావించి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ప్రతాప్ రెడ్డి మార్గదర్శకత్వంలో, గజ్వేల్ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బెండే మధు నాయకత్వంలో ఈ చేరికలు జరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మాట్లాడిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ అభివృద్ధిలో బీఆర్‌ఎస్ పార్టీ పాత్ర కీలకమని, కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని విమర్శిస్తూ, అభివృద్ధి కోసం మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అక్కారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.4
- సంగారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఆందోల్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్1
- కామారెడ్డి మండలం : కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఇంటర్మీడియట్ పూర్తైన | విద్యార్థినులకు స్కూటీలు అందజేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ పరీక్షల్లో జిల్లాకు చెందిన విద్యార్థినులు ఉత్తమ ర్యాంకులు సాధించారని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు.1
- జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ ఎం లు, వివిధ విభాగాల హెచ్ఓడి , డీఎం లు.. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం.. మంత్రి పొన్నం ప్రభాకర్ RTC అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణీకులకు సంధించి సానుకూలంగా ఉండాలి ప్రతి డివిజన్ స్థాయి అధికారులను కోరుతున్న సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో సానుకూల దృక్పధంతో పనులు చేయించాలి ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీ గా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలి.. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.. మే 17 లోపల మీ మీ డిపోలో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి.. టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలి 2023 డిసెంబర్ 9 నుండి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చాం ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలి టిక్కెట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోండి, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదు.. సoస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయం.. ప్రతి రెండవ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి..డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలి ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలు ,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు మెయింటేన్ చేయాలి.. ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాక పోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం.. సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి.. మంత్రి నుండి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉందో చూడండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలలాలను సమస్యను పరిష్కరించండి ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దాం..2
- ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, గృహజ్యోతి వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.1