logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సంగారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఆందోల్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

8 hrs ago
user_Sangareddy News
Sangareddy News
జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
8 hrs ago

సంగారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఆందోల్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

More news from తెలంగాణ and nearby areas
  • ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, గృహజ్యోతి వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
    1
    ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, గృహజ్యోతి వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ​ముఖ్య అంశాలు: ​కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ​తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. ​వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు. ​అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
    1
    స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ):
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
​ముఖ్య అంశాలు:
​కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
​తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు.
​వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు.
​అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • ధాన్యం కొనుగోలులో.. రైతులకు ఇబ్బందులు ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణ లో ఫసల్ భీమా పథకం ఎక్కఢ వడగండ్ల వానకు మెదక్ జిల్లాలో తీవ్ర నష్టంబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధాన్యం సరిగా కొనుగోలు చేయకపోవడంతో.. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. రామాయంపేటలో.. ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరపకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సెంటర్లకు లారీలు సరిగా రాకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం సైతం తడిసి ముద్దవుతుందన్నారు. రైస్ మిల్లర్లు, ఉద్యోగస్తులు ఏకమై రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే 2017 నుండి ఉద్యోగస్తులకు పిఆర్సి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఆర్టీసీనీ వెంటనే ప్రభుత్వం లో విలీనం చేసి కార్మికులను ఉద్యోగస్తులుగా గుర్తించాలన్నారు. ఈ నెల 10 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ 8 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. వడగండ్ల వానతో మెదక్ జిల్లాలో రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. నేటికి నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వం సేకరించలేదన్నారు. ప్రభుత్వం 15 రోజుల్లో పంట నష్టం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ భీమా పథకం అమలు చెయ్యకపోవడం తో రైతులకు నష్టం కలుగుతుందన్నారు. వెంటనే ఫసల్ భీమా పథకం అమలు చేయాలన్నారు.
    1
    ధాన్యం కొనుగోలులో.. రైతులకు ఇబ్బందులు
ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్  తెలంగాణ లో ఫసల్ భీమా పథకం ఎక్కఢ   వడగండ్ల వానకు మెదక్ జిల్లాలో తీవ్ర నష్టంబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
ధాన్యం సరిగా కొనుగోలు చేయకపోవడంతో.. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. రామాయంపేటలో.. ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరపకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సెంటర్లకు లారీలు సరిగా రాకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం సైతం తడిసి ముద్దవుతుందన్నారు. రైస్ మిల్లర్లు, ఉద్యోగస్తులు ఏకమై రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
అలాగే 2017 నుండి ఉద్యోగస్తులకు పిఆర్సి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఆర్టీసీనీ వెంటనే ప్రభుత్వం లో విలీనం చేసి కార్మికులను ఉద్యోగస్తులుగా గుర్తించాలన్నారు. ఈ నెల 10 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ 8 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 
అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వడగండ్ల  వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. వడగండ్ల వానతో మెదక్ జిల్లాలో రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. నేటికి నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వం సేకరించలేదన్నారు. ప్రభుత్వం 15 రోజుల్లో పంట నష్టం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ భీమా పథకం అమలు చెయ్యకపోవడం తో రైతులకు నష్టం కలుగుతుందన్నారు. వెంటనే ఫసల్ భీమా పథకం అమలు చేయాలన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    11 hrs ago
  • కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రంలో లారీల కొరత ఉందని రైతులు తెలపడంతో, పంట రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారుల బెడద లేకుండా, మెరుగైన మద్దతు ధర కోసం రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    1
    కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రంలో లారీల కొరత ఉందని రైతులు తెలపడంతో, పంట రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారుల బెడద లేకుండా, మెరుగైన మద్దతు ధర కోసం రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    12 hrs ago
  • *సరి'కొత్త' కోర్సుల సందడి* : ఉపాధికి పెద్దపీట - కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఆరునూతన కోర్సులను మంజూరు చేసింది.‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఈ కోర్సుల్లో ఒక్కో విభాగానికి ఆరవై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. బి.ఎస్సీ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అప్లైడ్ న్యూట్రిషన్. బి.ఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కళాశాలలో ఇప్పటికే తోమ్మిది రకాల డిగ్రీ కోర్సులు,పదకొండు పీజీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఏడాది హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేటింగ్ కోర్సును ప్రారంభించారు. గత విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా మంజూరైన ఈ ఆరు కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో సమానంగా అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.దీనివల్ల విద్యార్థులకు చదువుతో పాటే ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా రావడంతో పాటు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు మంజూరు కావడం శుభపరిణామం. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ప్లేస్‌మెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మొదటి విడత ఈ నెల 8వ తారీకు వరకు ఉండగా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు కళాశాలకు నేరుగా గాని ,దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్ సందర్శించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంచుకోవాలని కోరారు.
    1
    *సరి'కొత్త' కోర్సుల సందడి* :
ఉపాధికి పెద్దపీట - కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఆరునూతన కోర్సులను మంజూరు చేసింది.‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు.
వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఈ కోర్సుల్లో ఒక్కో విభాగానికి ఆరవై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.
బి.ఎస్సీ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అప్లైడ్ న్యూట్రిషన్.
బి.ఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి.
కళాశాలలో ఇప్పటికే తోమ్మిది రకాల డిగ్రీ కోర్సులు,పదకొండు పీజీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఏడాది హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేటింగ్ కోర్సును ప్రారంభించారు. 
గత విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా మంజూరైన ఈ ఆరు కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో సమానంగా అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.దీనివల్ల విద్యార్థులకు చదువుతో పాటే ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "కళాశాలకు స్వయంప్రతిపత్తి  హోదా రావడంతో పాటు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు మంజూరు కావడం శుభపరిణామం. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ప్లేస్‌మెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మొదటి విడత ఈ నెల 8వ తారీకు వరకు ఉండగా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు కళాశాలకు నేరుగా గాని ,దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్ సందర్శించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంచుకోవాలని కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు ₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    3
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు ₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న 25 మంది దంపతులు.. బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలర్మెల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం శనివారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 25 మంది కుటుంబాలు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.సూక్ష్మంలో మోక్షమార్గము పొందుటకు అతి తక్కువ ఖర్చులో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించవచ్చునని భక్తులకు తెలిపారు.కోరిన భక్తులకు ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. శ్రీబాలాజీ అన్నదాన సత్రంవారి ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ చేసినట్లు డాక్టర్ పి.గోపాల్,శేఖర్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్, ఆలయ సిబ్బంది బాబయ్య,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
    1
    సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న 25 మంది దంపతులు..
బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలర్మెల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం  శనివారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 25 మంది కుటుంబాలు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.సూక్ష్మంలో మోక్షమార్గము పొందుటకు అతి తక్కువ ఖర్చులో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించవచ్చునని భక్తులకు తెలిపారు.కోరిన భక్తులకు ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. శ్రీబాలాజీ అన్నదాన సత్రంవారి ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ చేసినట్లు డాక్టర్ పి.గోపాల్,శేఖర్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్, ఆలయ సిబ్బంది బాబయ్య,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    13 hrs ago
  • భిక్నూర్ 02-05-2026 కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. లబ్దిదారులకు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ కార్యక్రమంలో భిక్నూర్ గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, భిక్నూర్ మండల అధ్యక్షులు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,గ్రామ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు రాజబాబు గౌడ్, విజయ్ గౌడ్, వెంకటేష్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    1
    భిక్నూర్ 02-05-2026
కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం  చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. లబ్దిదారులకు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు.
ఈ కార్యక్రమంలో భిక్నూర్ గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, భిక్నూర్ మండల అధ్యక్షులు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,గ్రామ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు రాజబాబు గౌడ్, విజయ్ గౌడ్, వెంకటేష్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2k రన్. ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు,యువత, విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన 2K రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యత గలవారిగా వ్యవహరించి,డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు.కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో,క్రీడాకారులతో ప్రతిజ్ఞ. "నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు,యువత, ప్రజలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    3
    డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి.
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2k రన్.
ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు,యువత, విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది.
డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన 2K రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ
డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యత గలవారిగా వ్యవహరించి,డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా  అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు.
ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై  విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు.కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో,క్రీడాకారులతో ప్రతిజ్ఞ.
"నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు,యువత, ప్రజలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.