శాస్త్రోక్తంగా పాలెం వెంకన్న దేవాలయంలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు... సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న 25 మంది దంపతులు.. బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలర్మెల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం శనివారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 25 మంది కుటుంబాలు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.సూక్ష్మంలో మోక్షమార్గము పొందుటకు అతి తక్కువ ఖర్చులో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించవచ్చునని భక్తులకు తెలిపారు.కోరిన భక్తులకు ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. శ్రీబాలాజీ అన్నదాన సత్రంవారి ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ చేసినట్లు డాక్టర్ పి.గోపాల్,శేఖర్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్, ఆలయ సిబ్బంది బాబయ్య,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రంలో లారీల కొరత ఉందని రైతులు తెలపడంతో, పంట రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారుల బెడద లేకుండా, మెరుగైన మద్దతు ధర కోసం రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1
- సంగారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఆందోల్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లాలోని అక్కారం గ్రామంలో 02-05-2026న నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్, ప్రజా గాయకుడు బుడిగే ఎల్లం (యూట్యూబర్ ) మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బుడిగే ఎల్లం మాట్లాడుతూ, గతంలో సొంత పార్టీని విడిచి కాంగ్రెస్‌లో చేరిన తాను, రెండు సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం బీఆర్‌ఎస్ పార్టీని మించిన పార్టీ తెలంగాణలో లేదని భావించి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ప్రతాప్ రెడ్డి మార్గదర్శకత్వంలో, గజ్వేల్ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బెండే మధు నాయకత్వంలో ఈ చేరికలు జరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మాట్లాడిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ అభివృద్ధిలో బీఆర్‌ఎస్ పార్టీ పాత్ర కీలకమని, కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని విమర్శిస్తూ, అభివృద్ధి కోసం మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అక్కారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.4
- వికారాబాద్ : వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగాడి టిజిఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నీటి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు పరీక్షల నిర్వహణ తీరును అభ్యర్థులు కల్పించిన కనీస వసతులను ఉచితంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రం వద్ద ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలులో ఉంటుందని గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.1
- నంద్యాల జిల్లా మే 02 : బండి ఆత్మకూరు మండలం సోమయాజుల పల్లె గ్రామంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రామకృష్ణుడు వరిగడ్డి వామికి మంటలు చెలరేగి దగ్ధమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. దాదాపు రూ. 35,000 లు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.1
- చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నిల్లికట్టు సత్యం మాట్లాడుతూ.. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ల్యాబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- వెలుగోడు పట్టణ శివారులో పిల్ల కాలువ వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.శనివారం సాయంత్రం ఎలుగుబంటి సంచారంతో ప్రజలు, ప్రయాణికులు హడలిపోయారు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల సంచారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.అటుగా వెళ్లే ప్రయాణికులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.1
- సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న 25 మంది దంపతులు.. బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలర్మెల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం శనివారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 25 మంది కుటుంబాలు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.సూక్ష్మంలో మోక్షమార్గము పొందుటకు అతి తక్కువ ఖర్చులో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించవచ్చునని భక్తులకు తెలిపారు.కోరిన భక్తులకు ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. శ్రీబాలాజీ అన్నదాన సత్రంవారి ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ చేసినట్లు డాక్టర్ పి.గోపాల్,శేఖర్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్, ఆలయ సిబ్బంది బాబయ్య,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.1