Shuru
Apke Nagar Ki App…
అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు: నిర్మల రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, గృహజ్యోతి వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
Praveen
అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు: నిర్మల రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, గృహజ్యోతి వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి పీ ఎస్ ఆర్ గార్డెన్ లో మహిళా సంఘాల సభ్యులకు 195.18 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను శనివారం పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు వనిత, అంజమ్మ పాల్గొన్నారు.1
- వికారాబాద్ : వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగాడి టిజిఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నీటి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు పరీక్షల నిర్వహణ తీరును అభ్యర్థులు కల్పించిన కనీస వసతులను ఉచితంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రం వద్ద ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలులో ఉంటుందని గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లాలోని అక్కారం గ్రామంలో 02-05-2026న నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్, ప్రజా గాయకుడు బుడిగే ఎల్లం (యూట్యూబర్ ) మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బుడిగే ఎల్లం మాట్లాడుతూ, గతంలో సొంత పార్టీని విడిచి కాంగ్రెస్‌లో చేరిన తాను, రెండు సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం బీఆర్‌ఎస్ పార్టీని మించిన పార్టీ తెలంగాణలో లేదని భావించి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ప్రతాప్ రెడ్డి మార్గదర్శకత్వంలో, గజ్వేల్ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బెండే మధు నాయకత్వంలో ఈ చేరికలు జరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మాట్లాడిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ అభివృద్ధిలో బీఆర్‌ఎస్ పార్టీ పాత్ర కీలకమని, కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని విమర్శిస్తూ, అభివృద్ధి కోసం మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అక్కారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.4
- సంగారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఆందోల్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్1
- ధాన్యం కొనుగోలులో.. రైతులకు ఇబ్బందులు ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణ లో ఫసల్ భీమా పథకం ఎక్కఢ వడగండ్ల వానకు మెదక్ జిల్లాలో తీవ్ర నష్టంబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధాన్యం సరిగా కొనుగోలు చేయకపోవడంతో.. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. రామాయంపేటలో.. ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరపకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సెంటర్లకు లారీలు సరిగా రాకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం సైతం తడిసి ముద్దవుతుందన్నారు. రైస్ మిల్లర్లు, ఉద్యోగస్తులు ఏకమై రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే 2017 నుండి ఉద్యోగస్తులకు పిఆర్సి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఆర్టీసీనీ వెంటనే ప్రభుత్వం లో విలీనం చేసి కార్మికులను ఉద్యోగస్తులుగా గుర్తించాలన్నారు. ఈ నెల 10 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ 8 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. వడగండ్ల వానతో మెదక్ జిల్లాలో రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. నేటికి నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వం సేకరించలేదన్నారు. ప్రభుత్వం 15 రోజుల్లో పంట నష్టం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ భీమా పథకం అమలు చెయ్యకపోవడం తో రైతులకు నష్టం కలుగుతుందన్నారు. వెంటనే ఫసల్ భీమా పథకం అమలు చేయాలన్నారు.1
- *సరి'కొత్త' కోర్సుల సందడి* : ఉపాధికి పెద్దపీట - కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఆరునూతన కోర్సులను మంజూరు చేసింది.‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఈ కోర్సుల్లో ఒక్కో విభాగానికి ఆరవై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. బి.ఎస్సీ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అప్లైడ్ న్యూట్రిషన్. బి.ఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కళాశాలలో ఇప్పటికే తోమ్మిది రకాల డిగ్రీ కోర్సులు,పదకొండు పీజీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఏడాది హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేటింగ్ కోర్సును ప్రారంభించారు. గత విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా మంజూరైన ఈ ఆరు కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో సమానంగా అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.దీనివల్ల విద్యార్థులకు చదువుతో పాటే ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా రావడంతో పాటు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు మంజూరు కావడం శుభపరిణామం. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ప్లేస్‌మెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మొదటి విడత ఈ నెల 8వ తారీకు వరకు ఉండగా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు కళాశాలకు నేరుగా గాని ,దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్ సందర్శించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంచుకోవాలని కోరారు.1
- స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్య అంశాలు: కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.1
- ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, గృహజ్యోతి వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.1