Shuru
Apke Nagar Ki App…
మహబూబాబాద్ జిల్లా పకిరాతండాలో గంజాయి పట్టుకున్న నర్సింహులపేట పోలీసులు మహబూబాబాద్ జిల్లా : నర్సింహాలపేట మండలం పకీరా తండా లో బారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు 4కేజిల గంజాయి స్వాదినంచెసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పట్టుకున్న గంజాయి విలువ 2లక్షల 40వేలు గా అంచనావేస్తున్నారు. అరెస్ట్చేసిన నిందితుడిని. రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు
Mogulagani Mahendar Mogulagani Mahendar
మహబూబాబాద్ జిల్లా పకిరాతండాలో గంజాయి పట్టుకున్న నర్సింహులపేట పోలీసులు మహబూబాబాద్ జిల్లా : నర్సింహాలపేట మండలం పకీరా తండా లో బారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు 4కేజిల గంజాయి స్వాదినంచెసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పట్టుకున్న గంజాయి విలువ 2లక్షల 40వేలు గా అంచనావేస్తున్నారు. అరెస్ట్చేసిన నిందితుడిని. రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు
More news from తెలంగాణ and nearby areas
- సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు), రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్* ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల జిల్లా అధికారులు ప్రతి సోమావారం నిర్వహించే ప్రజావాణి కి తప్పక హాజరు కావాలని లేనిచో శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ సందర్భంగా కురవి మండలం కంచెర్ల గూడెం గ్రామానికి చెందిన బి. కవిత తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఆర్థికంగా ఇబ్బంది ఉందని వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు. కేసముధ్రం మండలం తౌర్య తండా కు చెందిన శ్రీనివాస్ తాను గతంలో గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు గాను MB ప్రకారం డబ్బులను ఇవ్వాలంటే తనకు కమిషన్ ఇవ్వాలని ప్రస్తుత సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని తన సమస్యను పరిష్కరించి తన డబ్బులను ఇప్పించగలరని కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమ గ్రామ క్లస్టర్ లో రైతులు 70 శాతానికి పైగా మొక్కజొన్న పంట పండించారని తాము ఉన్న ప్రాంతానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చాలా దూరంగా ఉందని మా గ్రామం నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కోరారు. ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన గుర్రం శివకృష్ణ తాను నిరుపేద వికలాంగుడినని మా గ్రామంలో పది సంవత్సరాలుగా రేషన్ డీలర్ ఇంచార్జి గా కొనసాగుతున్నారని అందువలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తనకు రేషన్ డీలర్ ఇంచార్జీ ఇప్పించి నా కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ( 195 ) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.1
- వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం1
- వరంగల్ జిల్లా:వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్ అశోక కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నాయిని నీలిమ రెడ్డితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజలు, భక్తులు ఏకమై ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.2
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణను, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎండీ పర్యటన సందర్భంగా పలువురు స్థానిక కార్పొరేటర్లు ఆయనను కలిసి బస్టాండ్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. బస్టాండ్ ఆవరణలో చుట్టూ పోల్స్ పాతి ఇనప కంచె వేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వివరించారు. ఒక బస్సు లోపలికి వచ్చినప్పుడు మరో బస్సు వెళ్లడానికి కూడా వీలులేనంత ఇరుకుగా మారిందని, దీనివల్ల ప్రయాణికులను దించడానికి, ఎక్కించుకోవడానికి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో బస్టాండ్ ఆవరణలో వరదనీరు నిలిచిపోవడం పట్ల తీవ్రఇబ్బంది ఎదురుకుంటున్నామని తెలిపారు. పాల్వంచ బస్టాండ్‌ను ఆధునీకరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని వారు కోరారు. బస్టాండ్ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఎండీ నాగిరెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా శుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాల్వంచ బస్టాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, దీనిని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఐపీఎస్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక కార్పొరేటర్లు ,పలువురు నేతలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.1
- తక్షణ స్పందన: ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే మున్సిపల్ చైర్‌పర్సన్ రిహన కమల్ పాషా మరియు మున్సిపల్ కమిషనర్ నరసింహారావు ఆసుపత్రికి చేరుకున్నారు. పరామర్శ: రాధ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆమెకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. న్యాయం చేస్తామని హామీ: ఈ ప్రమాదానికి కారణమైన వారిని పిలిపించి, బాధితురాలికి తగు న్యాయం చేస్తామని మరియు అండగా ఉంటామని చైర్‌పర్సన్ గారు హామీ ఇచ్చారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన కనుకుంట్ల సుశీల గారు మరణానంతరం కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె తన అవయవాలను దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని సంకల్పించడమే కాకుండా, తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల చదువుల కోసం నార్కెట్‌పల్లి కామిని హాస్పిటల్‌కు దానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు సుశీల గారి మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ఆమె చూపిన సామాజిక స్పృహ, మానవత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. సుశీల గారి సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దైద రవీందర్ గారు ఆకాంక్షించారు.4
- నల్గొండ బ్రేకింగ్: _ప్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్న జనం అనుకునేరు! ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు ఎగబడుతున్న తల్లిదండ్రులు.!_ నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడా *కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల* లో అడ్మిషన్ల కోసం భారీగా క్యూ లైన్లు... తెల్లవారుజామునే పాఠశాల గేట్ల ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల రద్దీ! కార్పొరేట్ స్కూల్స్‌కు గీటుగా,పోటీగా మారిన ప్రభుత్వ పాఠశాలపై ప్రశంసల వెల్లువ... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆధునిక విద్యా మందిరం... స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్‌తో విద్యార్థులకు నూతన అనుభవం... పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం – తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోంది... విశాలమైన క్రీడా మైదానం – చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం... అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు – నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.. నల్గొండ జిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచీ భారీగా దరఖాస్తులు... *ఇది ప్రభుత్వ పాఠశాల కాదు.. కార్పొరేట్ స్థాయి కు దీటైన విశ్వ విద్యాలయం..* అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం... ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచిన మోడల్ స్కూల్‌గా నిలిచిన కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ స్కూల్... ప్రభుత్వ విద్యకు కొత్త దిశ – మంత్రి విజన్‌కు ఇదే నిదర్శనం.. అంటూ ప్రజల ప్రశంసలు... సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ కోసం పోటీ తీవ్రం... ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతూ.. నల్గొండలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న బొట్టుగూడా కోమటిరెడ్డి ప్రతీక్ హై స్కూల్!1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ పథకాల కింద చెక్కులను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా మొత్తం 135 మంది లబ్ధిదారులకు కలిపి రూ.1,35,15,666 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలపై పడే వివాహ ఖర్చు భారాన్ని తగ్గించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు తమ కుటుంబాలను సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.1