Shuru
Apke Nagar Ki App…
వరంగల్ పెద్దమ్మ గడ్డ లో యువకుడిపై హత్యాయత్నం ........ వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం
Chetty:Ramesh
వరంగల్ పెద్దమ్మ గడ్డ లో యువకుడిపై హత్యాయత్నం ........ వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం1
- వరంగల్ జిల్లా:వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్ అశోక కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నాయిని నీలిమ రెడ్డితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజలు, భక్తులు ఏకమై ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.2
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ అంతర్బాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ & ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది, కానీ డ్యామ్ అంతర్బాగంలో నీళ్ళలో నుంచి పూడిక తీస్తు ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్క్ అవుట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్, గత నెలలో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు. చిగురుమామిడి మండలం రామంచ కోహెడ మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు. జెసిబిలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు రేణికుంట బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డ్యామ్ లో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్థులు తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి పొన్నం, సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. రేణికుంట బ్రిడ్జి లోపలి వైపు మానేరులో ఇసుక తీయడం, డీసిల్టేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు. మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు.4
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది.పాల్వంచ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆమె కుమారుడు విక్కీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు విక్కీ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయలక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారును మరియు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.4
- బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.4
- గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ, బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూత్ అధ్యక్షులు బుర్ర సంతోష్, గొల్లపెల్లి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలందర్ మాట్లాడుతూ బీజేపీ ఏకాత్మ మానవవాద సిద్ధాంతంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపెల్లి సంతోష్ మాట్లాడుతూ అంత్యోదయ లక్ష్యంతో కేంద్ర పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు1