Shuru
Apke Nagar Ki App…
హుస్నాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపితె పదివేల జరిమానా..! సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వేణు విలేకరి
హుస్నాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపితె పదివేల జరిమానా..! సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్ పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం సమర్పించారు. గుట్ట చుట్టూ 15 మీటర్ల స్థలం విస్తరణ, ల్యాబ్ నిర్మాణం, గుడి ముందర రాజగోపురం నిర్మాణం, ధర్మగుండం చుట్టూ సీసీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక రహదారి నిర్మించాలని కోరారు.3
- రేవంత్ రెడ్డి కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేసే కుట్ర చేస్తున్నాడు.. సిద్దిపేట్, ఏప్రిల్ 6, ప్రజావాణి 15 కోట్లకు ఒక ఎకరం అంటే 200 ఎకరాలకు 3000 కోట్ల రూపాయల విలువైన భూమిని దళారులకు కట్టబెడుతున్నారు. కేరళ నుండి దళారులు వచ్చి లీలా హోటల్లో చర్చలు జరిపినట్లు సమాచారం కూడా ఉంది.ఈ భూమిని ఇచ్చి, దిల్(డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) భూమిలో మార్కెట్ కట్టుకోండి అంటున్నారు. ఆ దిల్ భూములపై ఏపీ ప్రభుత్వం కేసు వేసింది, ఆ భూములు ఇప్పట్లో వచ్చేది లేదు మార్కెట్ కట్టేది లేదు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు...1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూత్ అధ్యక్షులు బుర్ర సంతోష్, గొల్లపెల్లి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలందర్ మాట్లాడుతూ బీజేపీ ఏకాత్మ మానవవాద సిద్ధాంతంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపెల్లి సంతోష్ మాట్లాడుతూ అంత్యోదయ లక్ష్యంతో కేంద్ర పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీ అంజనా రెడ్డి గారిని ఇన్‌చార్జ్ ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్‌చార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.తరువాత ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ గారు, శేషవస్త్రం మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఈవో గారి చాంబర్‌లో అంజనా రెడ్డి గారు ఇన్‌చార్జ్ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.1
- జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.4
- వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం1
- కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకిలో శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి జరిగిన వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. లక్ష్మి నరసింహస్వామి ఉత్సవాలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అతిథి మర్యాదలతో ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిని ఆలయ అర్చకులు పాలకవర్గం శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పురాతన చరిత్ర గల బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే కొండగట్టు వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా సన్న వడ్లకు సంబంధించి బోనస్ డబ్బులు తమకు అందలేదని పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులకు రూ.2,000 నుంచి రూ.2 లక్షల వరకు బోనస్ డబ్బులు జమ కాలేదని ఆరోపిస్తూ వారు కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట బైఠాయించారు. కాటారం, మల్హర్ రావు మండలాల పరిధిలోని గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ అకౌంట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని, పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన రాలేదని వారు తెలిపారు. వెంటనే బోనస్ విడుదల చేయాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను గ్రీవెన్స్ సెల్ నుండి బయటకు పంపించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి జి. శ్రావణ్ కుమార్ గారు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.1