logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అన్నారం గ్రామంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూత్ అధ్యక్షులు బుర్ర సంతోష్, గొల్లపెల్లి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలందర్ మాట్లాడుతూ బీజేపీ ఏకాత్మ మానవవాద సిద్ధాంతంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపెల్లి సంతోష్ మాట్లాడుతూ అంత్యోదయ లక్ష్యంతో కేంద్ర పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు

3 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
3 hrs ago

అన్నారం గ్రామంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూత్ అధ్యక్షులు బుర్ర సంతోష్, గొల్లపెల్లి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలందర్ మాట్లాడుతూ బీజేపీ ఏకాత్మ మానవవాద సిద్ధాంతంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపెల్లి సంతోష్ మాట్లాడుతూ అంత్యోదయ లక్ష్యంతో కేంద్ర పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ పథకాల కింద చెక్కులను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా మొత్తం 135 మంది లబ్ధిదారులకు కలిపి రూ.1,35,15,666 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలపై పడే వివాహ ఖర్చు భారాన్ని తగ్గించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు తమ కుటుంబాలను సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ పథకాల కింద చెక్కులను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా మొత్తం 135 మంది లబ్ధిదారులకు కలిపి రూ.1,35,15,666 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలపై పడే వివాహ ఖర్చు భారాన్ని తగ్గించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు..
ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు తమ కుటుంబాలను సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    32 min ago
  • తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ అంతర్బాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ & ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది, కానీ డ్యామ్ అంతర్బాగంలో నీళ్ళలో నుంచి పూడిక తీస్తు ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్క్ అవుట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్, గత నెలలో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు.‌ చిగురుమామిడి మండలం రామంచ కోహెడ మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు.‌ జెసిబిలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు రేణికుంట బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డ్యామ్ లో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్థులు తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి పొన్నం, సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. రేణికుంట బ్రిడ్జి లోపలి వైపు మానేరులో ఇసుక తీయడం, డీసిల్టేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు.‌ మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు.
    4
    తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ అంతర్బాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ & ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు.
అంతవరకు బాగానే ఉంది, కానీ డ్యామ్ అంతర్బాగంలో నీళ్ళలో నుంచి పూడిక తీస్తు ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్క్ అవుట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్, గత నెలలో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు.‌ చిగురుమామిడి మండలం రామంచ కోహెడ మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు.‌ జెసిబిలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు రేణికుంట బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
డ్యామ్ లో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో  నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్థులు తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి పొన్నం, సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. రేణికుంట బ్రిడ్జి లోపలి వైపు మానేరులో ఇసుక తీయడం, డీసిల్టేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు.‌ మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్ పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం సమర్పించారు. గుట్ట చుట్టూ 15 మీటర్ల స్థలం విస్తరణ, ల్యాబ్ నిర్మాణం, గుడి ముందర రాజగోపురం నిర్మాణం, ధర్మగుండం చుట్టూ సీసీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక రహదారి నిర్మించాలని కోరారు.
    3
    బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్ పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం సమర్పించారు. గుట్ట చుట్టూ 15 మీటర్ల స్థలం విస్తరణ, ల్యాబ్ నిర్మాణం, గుడి ముందర రాజగోపురం నిర్మాణం, ధర్మగుండం చుట్టూ సీసీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక రహదారి నిర్మించాలని కోరారు.
    user_Prakash
    Prakash
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ, బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....
    1
    గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ,
బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....
    user_Mulugu Vijay Kumar
    Mulugu Vijay Kumar
    Actor Siddipet Rural, Telangana•
    5 hrs ago
  • నల్గొండ బ్రేకింగ్: _ప్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్న జనం అనుకునేరు! ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు ఎగబడుతున్న తల్లిదండ్రులు.!_ నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడా *కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల* లో అడ్మిషన్ల కోసం భారీగా క్యూ లైన్లు... తెల్లవారుజామునే పాఠశాల గేట్ల ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల రద్దీ! కార్పొరేట్ స్కూల్స్‌కు గీటుగా,పోటీగా మారిన ప్రభుత్వ పాఠశాలపై ప్రశంసల వెల్లువ... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆధునిక విద్యా మందిరం... స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్‌తో విద్యార్థులకు నూతన అనుభవం... పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం – తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోంది... విశాలమైన క్రీడా మైదానం – చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం... అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు – నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.. నల్గొండ జిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచీ భారీగా దరఖాస్తులు... *ఇది ప్రభుత్వ పాఠశాల కాదు.. కార్పొరేట్ స్థాయి కు దీటైన విశ్వ విద్యాలయం..* అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం... ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచిన మోడల్ స్కూల్‌గా నిలిచిన కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ స్కూల్... ప్రభుత్వ విద్యకు కొత్త దిశ – మంత్రి విజన్‌కు ఇదే నిదర్శనం.. అంటూ ప్రజల ప్రశంసలు... సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ కోసం పోటీ తీవ్రం... ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతూ.. నల్గొండలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న బొట్టుగూడా కోమటిరెడ్డి ప్రతీక్ హై స్కూల్!
    1
    నల్గొండ బ్రేకింగ్:
_ప్యాన్ ఇండియా సినిమా  టికెట్ల కోసం ఎగబడుతున్న జనం అనుకునేరు! ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు ఎగబడుతున్న తల్లిదండ్రులు.!_
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడా *కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల* లో అడ్మిషన్ల కోసం భారీగా క్యూ లైన్లు...
తెల్లవారుజామునే పాఠశాల గేట్ల ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల రద్దీ!
కార్పొరేట్ స్కూల్స్‌కు గీటుగా,పోటీగా మారిన ప్రభుత్వ పాఠశాలపై ప్రశంసల వెల్లువ...
*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆధునిక విద్యా మందిరం...
స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్‌తో విద్యార్థులకు నూతన అనుభవం...
పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం – తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోంది...
విశాలమైన క్రీడా మైదానం – చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం...
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు – నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది..
నల్గొండ జిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచీ భారీగా దరఖాస్తులు...
*ఇది ప్రభుత్వ పాఠశాల కాదు.. కార్పొరేట్ స్థాయి కు  దీటైన  విశ్వ విద్యాలయం..* అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం...
ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచిన మోడల్ స్కూల్‌గా నిలిచిన కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ స్కూల్...
ప్రభుత్వ విద్యకు కొత్త దిశ – మంత్రి విజన్‌కు ఇదే నిదర్శనం.. అంటూ ప్రజల ప్రశంసలు...
సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ కోసం పోటీ తీవ్రం...
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతూ.. నల్గొండలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న బొట్టుగూడా కోమటిరెడ్డి ప్రతీక్ హై స్కూల్!
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది
    2
    మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు  వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ  ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది
    user_KingstarAshok KSR
    KingstarAshok KSR
    జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా సన్న వడ్లకు సంబంధించి బోనస్ డబ్బులు తమకు అందలేదని పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులకు రూ.2,000 నుంచి రూ.2 లక్షల వరకు బోనస్ డబ్బులు జమ కాలేదని ఆరోపిస్తూ వారు కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట బైఠాయించారు. కాటారం, మల్హర్ రావు మండలాల పరిధిలోని గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ అకౌంట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని, పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన రాలేదని వారు తెలిపారు. వెంటనే బోనస్ విడుదల చేయాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను గ్రీవెన్స్ సెల్ నుండి బయటకు పంపించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా సన్న వడ్లకు సంబంధించి బోనస్ డబ్బులు తమకు అందలేదని పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులకు రూ.2,000 నుంచి రూ.2 లక్షల వరకు బోనస్ డబ్బులు జమ కాలేదని ఆరోపిస్తూ వారు కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట బైఠాయించారు.
కాటారం, మల్హర్ రావు మండలాల పరిధిలోని గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ అకౌంట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని, పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన రాలేదని వారు తెలిపారు. వెంటనే బోనస్ విడుదల చేయాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను గ్రీవెన్స్ సెల్ నుండి బయటకు పంపించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా : నర్సింహాలపేట మండలం పకీరా తండా లో బారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు 4కేజిల గంజాయి స్వాదినంచెసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పట్టుకున్న గంజాయి విలువ 2లక్షల 40వేలు గా అంచనావేస్తున్నారు. అరెస్ట్చేసిన నిందితుడిని. రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు
    1
    మహబూబాబాద్ జిల్లా :
నర్సింహాలపేట మండలం పకీరా తండా లో బారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు 
4కేజిల గంజాయి స్వాదినంచెసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పట్టుకున్న గంజాయి విలువ 2లక్షల 40వేలు గా అంచనావేస్తున్నారు.
అరెస్ట్చేసిన నిందితుడిని. రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    35 min ago
  • కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకిలో శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి జరిగిన వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. లక్ష్మి నరసింహస్వామి ఉత్సవాలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అతిథి మర్యాదలతో ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిని ఆలయ అర్చకులు పాలకవర్గం శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పురాతన చరిత్ర గల బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే కొండగట్టు వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
    1
    కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకిలో శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి జరిగిన వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. లక్ష్మి నరసింహస్వామి ఉత్సవాలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అతిథి మర్యాదలతో ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిని ఆలయ అర్చకులు పాలకవర్గం శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పురాతన చరిత్ర గల బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే కొండగట్టు వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.