logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సన్న వడ్ల బోనస్ డబ్బులు అందలేదంటూ కలెక్టర్ కార్యాలయంలో రైతుల నిరసన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా సన్న వడ్లకు సంబంధించి బోనస్ డబ్బులు తమకు అందలేదని పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులకు రూ.2,000 నుంచి రూ.2 లక్షల వరకు బోనస్ డబ్బులు జమ కాలేదని ఆరోపిస్తూ వారు కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట బైఠాయించారు. కాటారం, మల్హర్ రావు మండలాల పరిధిలోని గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ అకౌంట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని, పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన రాలేదని వారు తెలిపారు. వెంటనే బోనస్ విడుదల చేయాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను గ్రీవెన్స్ సెల్ నుండి బయటకు పంపించారు.

5 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
5 hrs ago

సన్న వడ్ల బోనస్ డబ్బులు అందలేదంటూ కలెక్టర్ కార్యాలయంలో రైతుల నిరసన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా సన్న వడ్లకు సంబంధించి బోనస్ డబ్బులు తమకు అందలేదని పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులకు రూ.2,000 నుంచి రూ.2 లక్షల వరకు బోనస్ డబ్బులు జమ కాలేదని ఆరోపిస్తూ వారు కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట బైఠాయించారు. కాటారం, మల్హర్ రావు మండలాల పరిధిలోని గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ అకౌంట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని, పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన రాలేదని వారు తెలిపారు. వెంటనే బోనస్ విడుదల చేయాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను గ్రీవెన్స్ సెల్ నుండి బయటకు పంపించారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా:వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్ అశోక కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నాయిని నీలిమ రెడ్డితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజలు, భక్తులు ఏకమై ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    2
    వరంగల్ జిల్లా:వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్ అశోక కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నాయిని నీలిమ రెడ్డితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.
కాలనీ ప్రజలు, భక్తులు ఏకమై ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం
    1
    వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24)  పై హత్యాయత్నం 
ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు.
తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు  యువకుని పరిస్థితి విషమం
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు), రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్* ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల జిల్లా అధికారులు ప్రతి సోమావారం నిర్వహించే ప్రజావాణి కి తప్పక హాజరు కావాలని లేనిచో శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ సందర్భంగా కురవి మండలం కంచెర్ల గూడెం గ్రామానికి చెందిన బి. కవిత తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఆర్థికంగా ఇబ్బంది ఉందని వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు. కేసముధ్రం మండలం తౌర్య తండా కు చెందిన శ్రీనివాస్ తాను గతంలో గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు గాను MB ప్రకారం డబ్బులను ఇవ్వాలంటే తనకు కమిషన్ ఇవ్వాలని ప్రస్తుత సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని తన సమస్యను పరిష్కరించి తన డబ్బులను ఇప్పించగలరని కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమ గ్రామ క్లస్టర్ లో రైతులు 70 శాతానికి పైగా మొక్కజొన్న పంట పండించారని తాము ఉన్న ప్రాంతానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చాలా దూరంగా ఉందని మా గ్రామం నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కోరారు. ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన గుర్రం శివకృష్ణ తాను నిరుపేద వికలాంగుడినని మా గ్రామంలో పది సంవత్సరాలుగా రేషన్ డీలర్ ఇంచార్జి గా కొనసాగుతున్నారని అందువలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తనకు రేషన్ డీలర్ ఇంచార్జీ ఇప్పించి నా కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ( 195 ) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.
    1
    సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు), రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి  *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్*  ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. 
జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల జిల్లా అధికారులు ప్రతి సోమావారం నిర్వహించే ప్రజావాణి కి తప్పక హాజరు కావాలని లేనిచో శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.
ఈ సందర్భంగా  కురవి మండలం కంచెర్ల గూడెం గ్రామానికి చెందిన బి. కవిత తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఆర్థికంగా ఇబ్బంది ఉందని వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
కేసముధ్రం మండలం తౌర్య తండా కు చెందిన శ్రీనివాస్ తాను గతంలో   గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు గాను MB ప్రకారం డబ్బులను ఇవ్వాలంటే తనకు కమిషన్ ఇవ్వాలని ప్రస్తుత సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని  తన సమస్యను పరిష్కరించి తన డబ్బులను ఇప్పించగలరని కోరారు.
గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమ గ్రామ క్లస్టర్ లో రైతులు 70 శాతానికి పైగా మొక్కజొన్న పంట పండించారని తాము ఉన్న ప్రాంతానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చాలా దూరంగా ఉందని మా గ్రామం నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కోరారు.
ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన  గుర్రం శివకృష్ణ తాను నిరుపేద వికలాంగుడినని మా గ్రామంలో పది సంవత్సరాలుగా రేషన్ డీలర్ ఇంచార్జి గా కొనసాగుతున్నారని అందువలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తనకు రేషన్ డీలర్ ఇంచార్జీ ఇప్పించి నా కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. 
ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ( 195  ) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    1
    జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన కనుకుంట్ల సుశీల గారు మరణానంతరం కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె తన అవయవాలను దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని సంకల్పించడమే కాకుండా, తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల చదువుల కోసం నార్కెట్‌పల్లి కామిని హాస్పిటల్‌కు దానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు సుశీల గారి మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ఆమె చూపిన సామాజిక స్పృహ, మానవత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. సుశీల గారి సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దైద రవీందర్ గారు ఆకాంక్షించారు.
    4
    నకిరేకల్ నియోజకవర్గం:-
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన కనుకుంట్ల సుశీల గారు మరణానంతరం కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె తన అవయవాలను దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని సంకల్పించడమే కాకుండా, తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల చదువుల కోసం నార్కెట్‌పల్లి కామిని హాస్పిటల్‌కు దానం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు సుశీల గారి మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ఆమె చూపిన సామాజిక స్పృహ, మానవత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
సుశీల గారి సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దైద రవీందర్ గారు ఆకాంక్షించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
    4
    బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
    user_Prakash
    Prakash
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూత్ అధ్యక్షులు బుర్ర సంతోష్, గొల్లపెల్లి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలందర్ మాట్లాడుతూ బీజేపీ ఏకాత్మ మానవవాద సిద్ధాంతంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపెల్లి సంతోష్ మాట్లాడుతూ అంత్యోదయ లక్ష్యంతో కేంద్ర పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు
    1
    వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూత్ అధ్యక్షులు బుర్ర సంతోష్, గొల్లపెల్లి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలందర్ మాట్లాడుతూ బీజేపీ ఏకాత్మ మానవవాద సిద్ధాంతంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపెల్లి సంతోష్ మాట్లాడుతూ అంత్యోదయ లక్ష్యంతో కేంద్ర పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.