ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు), రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్* ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల జిల్లా అధికారులు ప్రతి సోమావారం నిర్వహించే ప్రజావాణి కి తప్పక హాజరు కావాలని లేనిచో శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ సందర్భంగా కురవి మండలం కంచెర్ల గూడెం గ్రామానికి చెందిన బి. కవిత తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఆర్థికంగా ఇబ్బంది ఉందని వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు. కేసముధ్రం మండలం తౌర్య తండా కు చెందిన శ్రీనివాస్ తాను గతంలో గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు గాను MB ప్రకారం డబ్బులను ఇవ్వాలంటే తనకు కమిషన్ ఇవ్వాలని ప్రస్తుత సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని తన సమస్యను పరిష్కరించి తన డబ్బులను ఇప్పించగలరని కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమ గ్రామ క్లస్టర్ లో రైతులు 70 శాతానికి పైగా మొక్కజొన్న పంట పండించారని తాము ఉన్న ప్రాంతానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చాలా దూరంగా ఉందని మా గ్రామం నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కోరారు. ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన గుర్రం శివకృష్ణ తాను నిరుపేద వికలాంగుడినని మా గ్రామంలో పది సంవత్సరాలుగా రేషన్ డీలర్ ఇంచార్జి గా కొనసాగుతున్నారని అందువలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తనకు రేషన్ డీలర్ ఇంచార్జీ ఇప్పించి నా కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ( 195 ) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.

- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూత్ అధ్యక్షులు బుర్ర సంతోష్, గొల్లపెల్లి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలందర్ మాట్లాడుతూ బీజేపీ ఏకాత్మ మానవవాద సిద్ధాంతంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపెల్లి సంతోష్ మాట్లాడుతూ అంత్యోదయ లక్ష్యంతో కేంద్ర పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది.పాల్వంచ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆమె కుమారుడు విక్కీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు విక్కీ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయలక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారును మరియు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.4
- తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటోజర్నలిస్టుల అవార్డు ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్, నాంపల్లి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఏం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నల్గొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ అవార్డు అందుకున్నరు1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.1
- మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది2
- మహబూబాబాద్ జిల్లా : నర్సింహాలపేట మండలం పకీరా తండా లో బారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు 4కేజిల గంజాయి స్వాదినంచెసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పట్టుకున్న గంజాయి విలువ 2లక్షల 40వేలు గా అంచనావేస్తున్నారు. అరెస్ట్చేసిన నిందితుడిని. రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా సన్న వడ్లకు సంబంధించి బోనస్ డబ్బులు తమకు అందలేదని పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులకు రూ.2,000 నుంచి రూ.2 లక్షల వరకు బోనస్ డబ్బులు జమ కాలేదని ఆరోపిస్తూ వారు కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట బైఠాయించారు. కాటారం, మల్హర్ రావు మండలాల పరిధిలోని గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ అకౌంట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని, పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన రాలేదని వారు తెలిపారు. వెంటనే బోనస్ విడుదల చేయాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను గ్రీవెన్స్ సెల్ నుండి బయటకు పంపించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బంగారు జాల కు చెందిన మహిళపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనతో మాట్లాడుకుందామని చెప్పి కోపంతో ఆమెపై బీరు సీసా, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బంగారు జలకకు చెందిన తాటి నికిత (24) ఒక కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మండల పరిధిలోని కరకవాగు ప్రాంతానికి చెందిన వజ్జా పవన్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం నటరాజ్ సెంటర్ వద్ద ఆమెను అడ్డగించి వేధించడమే కాకుండా, అందరి ముందూ భయభ్రాంతులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. ఫిర్యాదు రాసిమ్మని సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుండి బయటకు వస్తున్న క్రమం లో, పవన్ మరో వ్యక్తి (ఆటో డ్రైవర్) కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడని యువతి తెలిపింది.. పవన్, అక్కడ యువతిపై అత్యాచారం చేసి,బీరు సీసా, కర్రతో కొట్టడంతో ఆమె తల, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలిని ఆటోలోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి నిందితుడు పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది... ప్రస్తుతం బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.4