logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లాలో ఇసుక దోపిడి...ఎల్ఎండీలో పైలెట్ ప్రాజెక్టు పేరుతో మోయతుమ్మెదవాగులో అక్రమ ఇసుక దందా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ అంతర్బాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ & ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది, కానీ డ్యామ్ అంతర్బాగంలో నీళ్ళలో నుంచి పూడిక తీస్తు ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్క్ అవుట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్, గత నెలలో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు.‌ చిగురుమామిడి మండలం రామంచ కోహెడ మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు.‌ జెసిబిలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు రేణికుంట బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డ్యామ్ లో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్థులు తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి పొన్నం, సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. రేణికుంట బ్రిడ్జి లోపలి వైపు మానేరులో ఇసుక తీయడం, డీసిల్టేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు.‌ మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కరీంనగర్ జిల్లాలో ఇసుక దోపిడి...ఎల్ఎండీలో పైలెట్ ప్రాజెక్టు పేరుతో మోయతుమ్మెదవాగులో అక్రమ ఇసుక దందా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ అంతర్బాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ & ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్

ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది, కానీ డ్యామ్ అంతర్బాగంలో నీళ్ళలో నుంచి పూడిక తీస్తు ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్క్ అవుట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్, గత నెలలో మోయతుమ్మెద వాగు నుంచి

ఇసుకను తీసేందుకు యత్నించారు.‌ చిగురుమామిడి మండలం రామంచ కోహెడ మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు.‌ జెసిబిలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు రేణికుంట బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలతో అక్కడి నుంచి

వెళ్ళిపోయారు. డ్యామ్ లో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్థులు తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి పొన్నం, సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. రేణికుంట బ్రిడ్జి లోపలి వైపు మానేరులో ఇసుక తీయడం, డీసిల్టేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు.‌ మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    1
    జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    52 min ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
    4
    బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
    user_Prakash
    Prakash
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ, బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....
    1
    గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ,
బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....
    user_Mulugu Vijay Kumar
    Mulugu Vijay Kumar
    Actor Siddipet Rural, Telangana•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • వరంగల్ జిల్లా:వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్ అశోక కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నాయిని నీలిమ రెడ్డితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజలు, భక్తులు ఏకమై ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    2
    వరంగల్ జిల్లా:వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్ అశోక కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నాయిని నీలిమ రెడ్డితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.
కాలనీ ప్రజలు, భక్తులు ఏకమై ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.
    4
    జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ అంతర్బాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ & ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది, కానీ డ్యామ్ అంతర్బాగంలో నీళ్ళలో నుంచి పూడిక తీస్తు ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్క్ అవుట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్, గత నెలలో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు.‌ చిగురుమామిడి మండలం రామంచ కోహెడ మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు.‌ జెసిబిలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు రేణికుంట బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డ్యామ్ లో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్థులు తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి పొన్నం, సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. రేణికుంట బ్రిడ్జి లోపలి వైపు మానేరులో ఇసుక తీయడం, డీసిల్టేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు.‌ మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు.
    4
    తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ అంతర్బాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ & ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు.
అంతవరకు బాగానే ఉంది, కానీ డ్యామ్ అంతర్బాగంలో నీళ్ళలో నుంచి పూడిక తీస్తు ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్క్ అవుట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్, గత నెలలో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు.‌ చిగురుమామిడి మండలం రామంచ కోహెడ మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు.‌ జెసిబిలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు రేణికుంట బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
డ్యామ్ లో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో  నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్థులు తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి పొన్నం, సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. రేణికుంట బ్రిడ్జి లోపలి వైపు మానేరులో ఇసుక తీయడం, డీసిల్టేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు.‌ మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.