భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సౌకర్యాలపై ఇన్చార్జ్ ఈవో పర్యవేక్షణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సౌకర్యాలపై ఇన్చార్జ్ ఈవో పర్యవేక్షణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.1
- బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.4
- గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ, బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....1
- జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.1
- జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.4
- కామారెడ్డిలోని డైలీ మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రైతు బజార్ పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. మార్కెట్లో నిత్యం పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మొత్తం బురదమమంగా మారుతుందన్నారు. రోడ్డుపై విక్రయాలు చేయోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు. రైతు బజార్ వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీ అంజనా రెడ్డి గారిని ఇన్‌చార్జ్ ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్‌చార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.తరువాత ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ గారు, శేషవస్త్రం మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఈవో గారి చాంబర్‌లో అంజనా రెడ్డి గారు ఇన్‌చార్జ్ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.1