logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గ్రామీణులకు ఉచిత నేత్ర సేవలు – లయన్స్ క్లబ్ ముందడుగు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.

5 hrs ago
user_Boga naga bhushanam
Boga naga bhushanam
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
5 hrs ago
e982029d-238f-466e-9c0e-e430431f9695
47ea9a6b-8231-4e59-b640-526f39d6cb07
ab682618-3382-460c-a76f-dfdd1b567ab0

గ్రామీణులకు ఉచిత నేత్ర సేవలు – లయన్స్ క్లబ్ ముందడుగు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.
    4
    జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాలూకా పరిధిలోని లక్షెటిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఎండల తీవ్రత మాత్రం 42 డిగ్రీలు గా ఉన్నట్లు అనిపించడంతో పాటు ఉక్క పోత వాతావరణ ఏర్పడింది. ఎండ వేడిని భరించలేక, ప్రజలు వాహనదారులు ఇళ్ళకే పరిమితం కాగా, రోడ్లు బోసిపోయాయి. మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    1
    లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాలూకా పరిధిలోని లక్షెటిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఎండల తీవ్రత మాత్రం 42 డిగ్రీలు గా ఉన్నట్లు అనిపించడంతో పాటు ఉక్క పోత వాతావరణ ఏర్పడింది. ఎండ వేడిని భరించలేక, ప్రజలు వాహనదారులు ఇళ్ళకే పరిమితం కాగా, రోడ్లు బోసిపోయాయి. మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    1
    జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
    4
    బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
    user_Prakash
    Prakash
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • కామారెడ్డిలోని డైలీ మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రైతు బజార్ పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. మార్కెట్లో నిత్యం పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మొత్తం బురదమమంగా మారుతుందన్నారు. రోడ్డుపై విక్రయాలు చేయోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు. రైతు బజార్ వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
    1
    కామారెడ్డిలోని డైలీ మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రైతు బజార్ పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. మార్కెట్లో నిత్యం పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మొత్తం బురదమమంగా మారుతుందన్నారు. రోడ్డుపై విక్రయాలు చేయోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు. రైతు బజార్ వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • లక్షెట్టిపేట పట్టణంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద బిజెపి జెండాలను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలోనే బలమైన శక్తిగా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఉన్నారు.
    1
    లక్షెట్టిపేట పట్టణంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద బిజెపి జెండాలను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలోనే బలమైన శక్తిగా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఉన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.