logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, వాహనదారులు....... లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాలూకా పరిధిలోని లక్షెటిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఎండల తీవ్రత మాత్రం 42 డిగ్రీలు గా ఉన్నట్లు అనిపించడంతో పాటు ఉక్క పోత వాతావరణ ఏర్పడింది. ఎండ వేడిని భరించలేక, ప్రజలు వాహనదారులు ఇళ్ళకే పరిమితం కాగా, రోడ్లు బోసిపోయాయి. మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

8 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
8 hrs ago

ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, వాహనదారులు....... లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాలూకా పరిధిలోని లక్షెటిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఎండల తీవ్రత మాత్రం 42 డిగ్రీలు గా ఉన్నట్లు అనిపించడంతో పాటు ఉక్క పోత వాతావరణ ఏర్పడింది. ఎండ వేడిని భరించలేక, ప్రజలు వాహనదారులు ఇళ్ళకే పరిమితం కాగా, రోడ్లు బోసిపోయాయి. మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రేయాష్ రెడ్డికి అక్షరాభ్యాసం నిర్వహించడం విశేషంగా నిలిచింది. సోమవారం సతీమణి గీతా రెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్న సీఎం, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా వేడుకను జరిపించారు. మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై తొలి అక్షరాలు రాయించి విద్యారంభానికి శ్రీకారం చుట్టించారు.
    1
    బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రేయాష్ రెడ్డికి అక్షరాభ్యాసం నిర్వహించడం విశేషంగా నిలిచింది. సోమవారం సతీమణి గీతా రెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్న సీఎం, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా వేడుకను జరిపించారు. మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై తొలి అక్షరాలు రాయించి విద్యారంభానికి శ్రీకారం చుట్టించారు.
    user_Ravula Purushotham
    Ravula Purushotham
    Dilawarpur, Nirmal•
    9 hrs ago
  • జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    1
    జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
    4
    బెజ్జంకి మండలం లోని దాచారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 239 బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, 240 బూత్ అధ్యక్షుడు గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్, కోడిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
    user_Prakash
    Prakash
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పన్ను చెల్లింపుదారులకు ఒక శుభవార్త. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించినట్లయితే, 5 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్లైన్లో సులభంగా పన్ను చెల్లించవచ్చని ఆమె సూచించారు.
    1
    కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పన్ను చెల్లింపుదారులకు ఒక శుభవార్త. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించినట్లయితే, 5 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్లైన్లో సులభంగా పన్ను చెల్లించవచ్చని ఆమె సూచించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • జన్నారం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసేలా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకే ప్రచారం నిర్వహిస్తున్నామని నియోజకవర్గ సాధన కమిటీ నాయకులు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని దేవునిగూడెం తదితర గ్రామాల్లో వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో సమావేశం నిర్వహించారు. అటవీ ఆంక్షలతో జన్నారం మండలం పూర్తిగా వెనుకబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రంగా మారిస్తే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జన్నారంను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    జన్నారం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసేలా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకే ప్రచారం నిర్వహిస్తున్నామని నియోజకవర్గ సాధన కమిటీ నాయకులు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని దేవునిగూడెం తదితర గ్రామాల్లో వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో సమావేశం నిర్వహించారు. అటవీ ఆంక్షలతో జన్నారం మండలం పూర్తిగా వెనుకబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రంగా మారిస్తే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జన్నారంను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ అంతర్బాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ & ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది, కానీ డ్యామ్ అంతర్బాగంలో నీళ్ళలో నుంచి పూడిక తీస్తు ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్క్ అవుట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్, గత నెలలో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు.‌ చిగురుమామిడి మండలం రామంచ కోహెడ మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు.‌ జెసిబిలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు రేణికుంట బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డ్యామ్ లో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్థులు తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి పొన్నం, సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. రేణికుంట బ్రిడ్జి లోపలి వైపు మానేరులో ఇసుక తీయడం, డీసిల్టేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు.‌ మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు.
    4
    తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ అంతర్బాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ & ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు.
అంతవరకు బాగానే ఉంది, కానీ డ్యామ్ అంతర్బాగంలో నీళ్ళలో నుంచి పూడిక తీస్తు ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్క్ అవుట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్, గత నెలలో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు.‌ చిగురుమామిడి మండలం రామంచ కోహెడ మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు.‌ జెసిబిలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవచ్చని అందుకు రేణికుంట బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెబుతుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొంతనలేని సమాధానాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
డ్యామ్ లో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో  నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్థులు తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి పొన్నం, సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. రేణికుంట బ్రిడ్జి లోపలి వైపు మానేరులో ఇసుక తీయడం, డీసిల్టేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు.‌ మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్ పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం సమర్పించారు. గుట్ట చుట్టూ 15 మీటర్ల స్థలం విస్తరణ, ల్యాబ్ నిర్మాణం, గుడి ముందర రాజగోపురం నిర్మాణం, ధర్మగుండం చుట్టూ సీసీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక రహదారి నిర్మించాలని కోరారు.
    3
    బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్ పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం సమర్పించారు. గుట్ట చుట్టూ 15 మీటర్ల స్థలం విస్తరణ, ల్యాబ్ నిర్మాణం, గుడి ముందర రాజగోపురం నిర్మాణం, ధర్మగుండం చుట్టూ సీసీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక రహదారి నిర్మించాలని కోరారు.
    user_Prakash
    Prakash
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.