చవాకుల సూర్య నరేష్ బాబుకు, భారతీయ రత్న నేషనల్ అవార్డు శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ, విశాఖ రత్న కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో వైజాగ్ లో భారతీయ రత్న నేషనల్ అవార్డ్స్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి, ట్రస్ట్ అధినేత డా. చవాకుల సూర్య నరేష్ బాబుకు, భారతీయ రత్న నేషనల్ అవార్డును, ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు చేతుల మీదగా అందజేసారు. అనంతరం సూర్య నరేష్ బాబును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చవాకుల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సేవారంగంలో చేతికి ఎముక లేని దాతగా పేరుగాంచిన చవాకుల సూర్య నరేష్ బాబు మాట్లాడుతూ.. సేవ చేయడంలో కలిగే ఆనందం వెలకట్టలేనిదని అన్నారు. ట్రస్ట్ ద్వారా నిరంతరం విద్యా, సామాజిక రంగాల్లో తాను చేస్తున్న సేవలను గుర్తించి, "భారతీయ రత్న" నేషనల్ అవార్డును అందజేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని తాను అనుసరిస్తానని, సేవా కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఇకపై తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తన ఉన్నతికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడర్ దినపత్రిక అధినేత, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి రమణమూర్తి, విశాఖపట్నం మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, శంఖారావం కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు బొమ్మిడి సత్యనారాయణ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి.బాల మోహన్ దాస్, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ఆర్టిస్ట్ డైరెక్టర్ సన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
చవాకుల సూర్య నరేష్ బాబుకు, భారతీయ రత్న నేషనల్ అవార్డు శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ, విశాఖ రత్న కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో వైజాగ్ లో భారతీయ రత్న నేషనల్ అవార్డ్స్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి, ట్రస్ట్ అధినేత డా. చవాకుల సూర్య నరేష్ బాబుకు, భారతీయ రత్న నేషనల్ అవార్డును, ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు చేతుల మీదగా అందజేసారు. అనంతరం సూర్య నరేష్ బాబును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చవాకుల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సేవారంగంలో చేతికి ఎముక లేని దాతగా పేరుగాంచిన చవాకుల సూర్య నరేష్ బాబు మాట్లాడుతూ.. సేవ చేయడంలో కలిగే ఆనందం వెలకట్టలేనిదని అన్నారు. ట్రస్ట్ ద్వారా నిరంతరం విద్యా, సామాజిక రంగాల్లో తాను చేస్తున్న సేవలను గుర్తించి, "భారతీయ రత్న" నేషనల్ అవార్డును అందజేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని తాను అనుసరిస్తానని, సేవా కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఇకపై తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తన ఉన్నతికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడర్ దినపత్రిక అధినేత, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి రమణమూర్తి, విశాఖపట్నం మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, శంఖారావం కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు బొమ్మిడి సత్యనారాయణ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి.బాల మోహన్ దాస్, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ఆర్టిస్ట్ డైరెక్టర్ సన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
- హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు *హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* - జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు* రాజోలు, ఆగస్ట్ 27 : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కలక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. ఈ మేరకు గురువారం జిల్లా కలక్టర్ను, జిల్లా ఎస్పీని కలసిన రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేడ్కర్ పై చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ బయట హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానడు అద్యక్షులు బొంతు మణిరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అద్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, విసికే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు వెంకట రమణ, దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ సంఘ రాజోలు మండల అద్యక్షులు మట్టా సురేష్ కుమార్, మాలల న్యాయపోరాట సమితి జేఏసీ మామిడికుదురు మండల అద్యక్షులు మట్టా సత్తిబాబు, దళిత చైతన్య వేదిక రాజోలు మండల అద్యక్షులు మందపాటి మధు, డిహెచ్పీఎస్ జిల్లా కార్యనిర్వక సభ్యులు పుల్లెళ్ళ ఆనంద్, న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు మార్లపూడి దొరబాబు, బొంతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.1
- *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.3
- రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో ప్రమాద భరితంగా మారిన విద్యుత్ స్తంభం పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం ప్రమాద భరితంగా మారింది. పెడన మెయిన్ రోడ్ లోని సంత మార్కెట్ సమీపం డాక్టర్ అశోక్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు డివైడర్ పై ఉన్న విద్యుత్ లైట్ స్తంభం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. లారీ రివర్స్ చేస్తా ఉండగా స్తంభానికి తాకడం వల్ల స్తంభం పాక్షికంగా దెబ్బతిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ రహదారిలో ప్రతిక్షణం వందలాది వాహనాలు వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ స్తంభం కూలితే ఘోర ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ మరియు పెడన పోలీస్ శాఖ అధికారులుస్పందించి యుద్ధ ప్రాతిపదికన కోలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభంకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.1
- ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే మంచిది . ఏబీఎన్ రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా.కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది.మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది.ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...1
- అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.1
- RIP రామకృష్ణ....😔🙏 కొన్ని కారణాలు వలన ఫైర్ ఆక్సిడెంట్ చేత బాధపడుతున్న రామకృష్ణ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం మాకు తోచిన సహాయాన్ని అందించాము. ఆ వీడియోని చూసి అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన ఇద్దరు సోదరులు. రవి గారు 5000 నరేంద్ర గారు 2000 అందజేశారు. మేము హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం 11 గంటలకు బాడీలో పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వలన తుది శ్వాసను విడిచారు.. మీ ఆత్మకు శాంతి కలగాలని టీం క్యాపో తరపున కోరుకుంటున్నాము..1