నూతనంగా ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ ను ఐటిడిఏ పిఓ తో కలిసి పరిశీలించిన భద్రాచలం ఎమ్మెల్యే మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన రైతులకు, ఎస్ హెచ్ జి గిరిజన గ్రూప్ మహిళలకు ఆర్థికంగా చేకూర్పు ఇవ్వడమే కాక తాతల కాలం నాడు ఎటువంటి కల్తీ లేని ఆహారం తిని వంద సంవత్సరాలు బతికారో అటువంటి నిత్యవసర సరుకులు మరియు వివిధ రకాల ధాన్యాలు వినియోగదారులకు అందించడానికి భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేస్తున్న ఐటీడీఏ పీవో కు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం నాడు భద్రాచలం పట్టణంలో నూతనంగా డిజైన్ చేసి నిర్మాణం పూర్తయి శ్రీరామనవమికి ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ ను ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన మహిళలు నాణ్యమైన, మన్నికంగా ఉండేలా మరియు సుచి శుభ్రత పాటించి తయారు చేస్తున్నా ఇప్పపువ్వు లడ్డూలు, బర్ఫీ, చాక్లెట్లు, కరక్కాయ పౌడర్, నల్లేరు పచ్చళ్ళు కారంపొడి పాకెట్లు, తేనె మిల్లెట్ బిస్కెట్లు, గానుగతో తయారుచేసిన నూనెలు ఇతర గృహ అవసరాలకు అవసరం పడే ఆహార పదార్థాలు బియ్యం పప్పులు బొబ్బర్లు నువ్వులు ఏ నిత్యవసర సరుకులు అయినా భద్రగిరి మార్టులో కొనుగోలుదారులకు సరసమైన ధరలకు అందించడానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. బయట మార్ట్ లలో దొరకని ఆర్గానిక్ పంటలతో పండించిన వివిధ రకాల ధాన్యాలు, కొర్రలు, సజ్జలతో పాటు అన్ని రకాల సరుకులు ప్రకృతి పరంగా సొంతంగా తయారుచేసినవి మాత్రమే భద్రగిరి మార్టులో లభించడంతోపాటు కొందరు గిరిజన యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే భద్రగిరి మార్టులో లభించే ప్రతి నిత్యవసర సరుకుల ధరలు మరియు ఆ వస్తువుల యొక్క గుణగణాలు పూర్తిస్థాయిలో వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా ఐటిడిఎ అధికారులకు సిబ్బందికి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ మరియు యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ ను ఐటిడిఏ పిఓ తో కలిసి పరిశీలించిన భద్రాచలం ఎమ్మెల్యే మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన రైతులకు, ఎస్ హెచ్ జి గిరిజన గ్రూప్ మహిళలకు ఆర్థికంగా చేకూర్పు ఇవ్వడమే కాక తాతల కాలం నాడు ఎటువంటి కల్తీ లేని ఆహారం తిని వంద సంవత్సరాలు బతికారో అటువంటి నిత్యవసర సరుకులు మరియు వివిధ రకాల ధాన్యాలు వినియోగదారులకు అందించడానికి భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేస్తున్న ఐటీడీఏ పీవో
కు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం నాడు భద్రాచలం పట్టణంలో నూతనంగా డిజైన్ చేసి నిర్మాణం పూర్తయి శ్రీరామనవమికి ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ ను ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన మహిళలు నాణ్యమైన, మన్నికంగా ఉండేలా మరియు సుచి శుభ్రత పాటించి తయారు చేస్తున్నా ఇప్పపువ్వు లడ్డూలు, బర్ఫీ, చాక్లెట్లు, కరక్కాయ పౌడర్, నల్లేరు పచ్చళ్ళు కారంపొడి పాకెట్లు,
తేనె మిల్లెట్ బిస్కెట్లు, గానుగతో తయారుచేసిన నూనెలు ఇతర గృహ అవసరాలకు అవసరం పడే ఆహార పదార్థాలు బియ్యం పప్పులు బొబ్బర్లు నువ్వులు ఏ నిత్యవసర సరుకులు అయినా భద్రగిరి మార్టులో కొనుగోలుదారులకు సరసమైన ధరలకు అందించడానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. బయట మార్ట్ లలో దొరకని ఆర్గానిక్ పంటలతో పండించిన వివిధ రకాల ధాన్యాలు, కొర్రలు, సజ్జలతో పాటు అన్ని రకాల సరుకులు ప్రకృతి పరంగా సొంతంగా తయారుచేసినవి మాత్రమే భద్రగిరి మార్టులో
లభించడంతోపాటు కొందరు గిరిజన యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే భద్రగిరి మార్టులో లభించే ప్రతి నిత్యవసర సరుకుల ధరలు మరియు ఆ వస్తువుల యొక్క గుణగణాలు పూర్తిస్థాయిలో వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా ఐటిడిఎ అధికారులకు సిబ్బందికి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ మరియు యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Post by V Ramarao4
- తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*1
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.1
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- Post by Ramprasad islavath1