PVTG కోలాం ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలి పూసం సచిన్ TAGS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలాం PVTG ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం ఉట్నూర్ ITDA కార్యాలయం ఎదుట ఆదివాసీలతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సాత్నాల ఆదిలాబాద్ బేల మండలాల 9 గ్రామాల (సదల్ పూర్, దుబ్బగూడ, జున్నపని,జంగు గూడా, చిన్నూగూడ, సుందరగిరి, మామిడి కోరి, దత్తగూడ ఆదివాసీలు కోలాం ఆదివాసులు అత్యంత వెనుకబడి ఉన్నారు. మీరు అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలపై అనేకసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న లాభం లేకుండా ఉన్నది కనీస మౌలిక సమస్యలు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎన్ని నిధులైన కానీ సమస్యల వీరికి లేకుండా చూస్తామని పాలకులు చెబుతున్నారు మేము ఆదివాసీ గిరిజన సంఘంగా చేసిన గ్రామాల సర్వేలో అనేక సమస్యలు గుర్తించాము ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం 1)పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి అలాగే గతంలో పుణ్యభూమి కంటే తక్కువ భూమికి పట్టాలిచ్చారు వాటిని సరిచేసి ఇవ్వాలి విరాసత్ పట్టాల సమస్య తీవ్రంగా ఉంది పరిష్కరించాలి 2) ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి 3) కోలాం ఆదివాసీ లకు అంతో దయ రేషన్ కార్డులు ఇవ్వాలి ఆదివాసీలందరికీ అంతోదయ కార్డులు ఇవ్వాలి 4) ఆదివాసి గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తక్షణమే యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి వేల మండలం సదల్పూర్ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది పరిష్కరించాలి 5) జంగుగూడ గ్రామం వరద ముంపు నుండి కోలామాదివాసులకు కాపాడేందుకు ఒకవైపు గోడ బ్రిడ్జి కట్టాలి 6) సోలార్ మోటార్స్ బోర్వెల్స్ ద్వారా ఆదివాసీల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలి 7) ఆదివాసి యువకులకు ఉపాధి కల్పించి వలసలను ఆపాలి ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం ఐటీడీఏ నుంచి ఆర్థిక రుణాలు ఇవ్వడం స్కిల్స్ పెంచే శిక్షణ ఇవ్వడం కోలాం వారికి తడకలు గుల్లలు బొంగు సరఫరా మార్కెట్ సౌకర్యం కల్పించాలి 8) వతందారుల(భూస్వాముల )భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు పట్టాలి ఇవ్వాలి 9) వ్యవసాయ రుణాలను బ్యాంకులకు నుండి ఇప్పించాలి 10) దళారుల వడ్డీ వ్యాపారం నుండి ఆదివాసులను కాపాడాలి 11) పింఛన్లు రేషన్ కార్డులు అందించాలి 12) కరెంటు సీసీ రోడ్లు నాలి సౌకర్యం కల్పించాలి 13) వ్యవసాయ భూములను చదును చేయించాలి 14) ఆదివాసులకు ఎడ్లబండ్ల సౌకర్యం కల్పించాలి 15) మెరుగైన విద్య వైద్యం అందించాలి రక్తహీనత నుండి రక్షించాలి 16) ఉపాధి కూలీలైన ఆదివాసీ మహిళలకు 2500 రుపాయలు కూలీలకు 12000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలి 17) ఫారెస్ట్ అధికారుల వేధింపులను అభివృద్ధి పనులను అడ్డుకునేదాన్ని ఆపాలి అనంతరం AO రఘు గారికి వినతి పత్రం అందించారు. సమస్యలు అన్ని ఉన్నత అధికారులకు తక్షణమే నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు లంకా రాఘవులు జిల్లా నాయకులు కొట్నాక్ సక్కు, స్వామి, రామన్న,ఆత్రం రాము, టెకం లక్ష్మణ్, మడవి భీంరావు, పెందూర్ గోవింద్, ఆత్రం అయ్యు బాయి తదితరులు పాల్గొన్నారు TAGS జిల్లా కమిటీ
PVTG కోలాం ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలి పూసం సచిన్ TAGS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలాం PVTG ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం ఉట్నూర్ ITDA కార్యాలయం ఎదుట ఆదివాసీలతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సాత్నాల ఆదిలాబాద్ బేల మండలాల 9 గ్రామాల (సదల్ పూర్, దుబ్బగూడ, జున్నపని,జంగు గూడా, చిన్నూగూడ, సుందరగిరి, మామిడి కోరి, దత్తగూడ ఆదివాసీలు కోలాం ఆదివాసులు అత్యంత వెనుకబడి ఉన్నారు. మీరు అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలపై అనేకసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న లాభం లేకుండా ఉన్నది కనీస మౌలిక సమస్యలు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎన్ని నిధులైన కానీ సమస్యల వీరికి లేకుండా చూస్తామని పాలకులు చెబుతున్నారు మేము ఆదివాసీ గిరిజన సంఘంగా చేసిన గ్రామాల సర్వేలో అనేక సమస్యలు గుర్తించాము ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం 1)పోడు
భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి అలాగే గతంలో పుణ్యభూమి కంటే తక్కువ భూమికి పట్టాలిచ్చారు వాటిని సరిచేసి ఇవ్వాలి విరాసత్ పట్టాల సమస్య తీవ్రంగా ఉంది పరిష్కరించాలి 2) ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి 3) కోలాం ఆదివాసీ లకు అంతో దయ రేషన్ కార్డులు ఇవ్వాలి ఆదివాసీలందరికీ అంతోదయ కార్డులు ఇవ్వాలి 4) ఆదివాసి గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తక్షణమే యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి వేల మండలం సదల్పూర్ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది పరిష్కరించాలి 5) జంగుగూడ గ్రామం వరద ముంపు నుండి కోలామాదివాసులకు కాపాడేందుకు ఒకవైపు గోడ బ్రిడ్జి కట్టాలి 6) సోలార్ మోటార్స్ బోర్వెల్స్ ద్వారా ఆదివాసీల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలి 7) ఆదివాసి యువకులకు ఉపాధి కల్పించి వలసలను ఆపాలి ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం ఐటీడీఏ నుంచి ఆర్థిక రుణాలు ఇవ్వడం స్కిల్స్ పెంచే శిక్షణ ఇవ్వడం కోలాం వారికి తడకలు గుల్లలు బొంగు సరఫరా మార్కెట్ సౌకర్యం కల్పించాలి 8)
వతందారుల(భూస్వాముల )భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు పట్టాలి ఇవ్వాలి 9) వ్యవసాయ రుణాలను బ్యాంకులకు నుండి ఇప్పించాలి 10) దళారుల వడ్డీ వ్యాపారం నుండి ఆదివాసులను కాపాడాలి 11) పింఛన్లు రేషన్ కార్డులు అందించాలి 12) కరెంటు సీసీ రోడ్లు నాలి సౌకర్యం కల్పించాలి 13) వ్యవసాయ భూములను చదును చేయించాలి 14) ఆదివాసులకు ఎడ్లబండ్ల సౌకర్యం కల్పించాలి 15) మెరుగైన విద్య వైద్యం అందించాలి రక్తహీనత నుండి రక్షించాలి 16) ఉపాధి కూలీలైన ఆదివాసీ మహిళలకు 2500 రుపాయలు కూలీలకు 12000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలి 17) ఫారెస్ట్ అధికారుల వేధింపులను అభివృద్ధి పనులను అడ్డుకునేదాన్ని ఆపాలి అనంతరం AO రఘు గారికి వినతి పత్రం అందించారు. సమస్యలు అన్ని ఉన్నత అధికారులకు తక్షణమే నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు లంకా రాఘవులు జిల్లా నాయకులు కొట్నాక్ సక్కు, స్వామి, రామన్న,ఆత్రం రాము, టెకం లక్ష్మణ్, మడవి భీంరావు, పెందూర్ గోవింద్, ఆత్రం అయ్యు బాయి తదితరులు పాల్గొన్నారు TAGS జిల్లా కమిటీ
- పత్రిక ప్రకటన ఏప్రిల్ 14, 2026_ఆదిలాబాదు: చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి, జెండాను ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి, వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, బహుమతులను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ లు అందజేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్-అలైవ్ రోడ్డు భద్రత పోస్టర్ లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రాణాదత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్టాంపులతో రూపొందిస్తున్న అంబేద్కర్ చిత్రపటంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు జైభీమ్ స్టాంప్ ను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్ర్యం, సమానత్వం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ శాంతియుతంగా కలిసి ఉండడానికి రాజ్యాంగమే దిక్సూచి అని సూచించారు. ముఖ్యంగా విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, "బోధించు, సమీకరించు, పోరాడు" అనే అంబేద్కర్ పిలుపును గుర్తుచేశారు. జిల్లాలో విద్యా ఫలితాలను పరిశీలిస్తే బాలికలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని, బాలురు సైతం చదువుపై మరింత దృష్టి సారించి సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువతకు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తులే కాకుండా డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందులో భాగంగా 10 పాఠశాలల్లో 'లెర్న్ స్మార్ట్ విత్ AI' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సంక్షేమ రంగంలో భాగంగా ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఆరో వాటర్ ప్లాంట్లు, గీజర్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేశామని వివరించారు. అలాగే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం మూడు 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, సమన్యాయం సాధించడమే మన లక్ష్యం కావాలని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ విచ్ఛిన్నం అవుతుందని భావించినా, అంబేద్కర్ అందించిన అద్భుతమైన రాజ్యాంగమే నేడు మనల్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టిందని కొనియాడారు. రాజ్యాంగంలోని సామాజిక సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ సూచనల మేరకు శాంతిభద్రతలను కాపాడటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుస్తున్నామని వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించడమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ,అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తి వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. కేవలం హక్కులకే పరిమితం కాకుండా పౌరుల బాధ్యతలను కూడా గుర్తెరగాలని సూచించారు. దళిత వర్గాలు కేవలం రిజర్వేషన్లపైనే ఆధారపడకుండా, జనరల్ కోటాలో కూడా అవకాశాలు సాధించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యే అసలైన ఆయుధమని, అంబేద్కర్ కష్టపడి చదివి సాధించిన ప్రగతి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు సాధారణ బ్యాంకింగ్ పథకాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని, దళిత జాతి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి ఫలాలు లభిస్తున్నాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన జైనథ్ మండలం ఆడ గ్రామానికి చెందిన అవినాష్ ను శాలువాతో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీలు సన్మానించి, వనిత డైరెక్టర్ గా అంబేద్కర్ జీవిత చరిత్ర పై రూపొందించిన వీడియో సిడిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, బిసి సంక్షేమ అధికారి సోనియా, ఆర్డీఓ స్రవంతి, ఈడి మనోహర్, రవాణా శాఖ అధికారులు రవీందర్, శ్రీనివాస్, హరింద్ర, వార్డుల కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.4
- *డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తో ఎమ్మెల్యే అయ్యాను* అంబెడ్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు.ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ గారు సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు.భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- 18 సంవత్సరాల లోపు మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని మంచిర్యాల జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కోరారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నలిమెల రాజు, ఆర్టిఏ అధికారులు ఉన్నారు.1
- గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.1
- మెట్‌పల్లి, ఏప్రిల్ 13: మెట్‌పల్లి డిపోలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ రోడ్డు భద్రత–2026 కార్యక్రమాన్ని డిపో ఎస్‌టీఐ టి. ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం డిపో నుంచి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఏ. రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ రాములు మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ వాహనం సరుకులు తీసుకెళ్తే అవి పాడవుతాయని, కానీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లో ఉంటుందని తెలిపారు. అందువల్ల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో వాహనం నడపాలని సూచించారు.అనంతరం డిపో నుండి పాత బస్టాండ్ వరకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ, భద్రతా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ ఏ. చంద్రయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ పవన్, ఎం.డి. ముజిబ్ ఖాన్ (ఆర్‌హెచ్‌సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మరియు భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.3
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.2
- . మాజీ మంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరికి సమాన ఫలాలను అందుకోగలుగుతున్నమ్మన్నారు.ప్రపంచ దేశాలలో సైతం అంబేద్కర్ కు ఘన నివాళులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క 125 అడుగుల అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని నివాళులు అర్పించకుండా సంకెళ్లతో బంధించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆశా సాధనలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత అభ్యున్నతికి పాటుపడిందన్నారు ఉన్నతమైన విద్యా విధానంతో పాటు దళిత కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోయేలా దళిత బస్తీ దళిత బంధు కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగిందన్నారు.2