ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు లక్ష్యాలను ప్రతి శాఖ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ప్రతి శాఖకు నోడల్ అధికారిని నియమించి ఉద్యోగులను సభ్యత్వ నమోదుకు ప్రోత్సహించాలి 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్న శాఖలు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు లక్ష్యాలను ప్రతి శాఖ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు.జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వంపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదుకు అధికారులు పూర్తి సహకారం అందించాలని, ప్రతి శాఖలోని ఉద్యోగులను సభ్యత్వం నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలనిసూచించారు.ప్రతి శాఖకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని, ప్రతి శాఖకు లక్ష్యాలను నిర్ధారించి వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అధికారి స్వయంగా సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు.అత్యవసర సమయాల్లో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కనీసం సుమారు వెయ్యి సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు.ముఖ్యంగా రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఆర్ అండ్ బి తదితర శాఖలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్న శాఖలు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాల నమోదుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు,కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.2
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- ఖమ్మం లో పోగొట్టుకున్న బ్యాగ్ బాధితురాలికి అప్పగించిన ట్రాఫిక్ పోలీసులు, ఆటో డ్రైవర్1