కనీస వేతనాలు కోసం కదం తొక్కిన స్కీం వర్కర్స్. పోలీస్ అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తత కలెక్టర్ కార్యాలయం ముట్టడి. పలువురు అరెస్ట్. శ్రీకాకుళం:అంగన్వాడీ, ఆశా తదితర స్కీం వర్కర్స్ కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలనిసిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం పథకం తదితర స్కీం వర్కర్స్ కు వేతనాలు పెంచాలని, పెన్షన్, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూల్ శానిటేషన్ కార్మికులు, స్కీం వర్కర్స్ అధిక సంఖ్యలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్& బి బంగ్లా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం తరుపున కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు వర్కర్స్ ప్రయిత్నించిగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పలువురిని అరెస్టు చేసి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ ఆశా అంగన్వాడీ తదితర స్కీం వర్కర్స్ కు గత 7 సంవత్సరాలు నుండి వేతనాలు పెంచలేదని, డిఎ కూడా అమలు చేయడం లేదని అన్నారు. విపరీతంగా పెరిగినా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బడిపిల్లలకు వేడి వేడి భోజనం దూరం చేసే స్మార్ట్ కిచెన్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి సామాజిక పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.టీఏ డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు, ఆశాలకు యాప్ లు భారం తగ్గించాలని అంగన్వాడీలకు అదనపు భారమైన నవచేతన యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు.ఉన్న యాప్ లు వలనే ప్రీస్కూల్ కు నష్టం జరుగుతుంటే కొత్తగా నవచేతన యాప్ వలన మరింత పనిభారం పెరిగి అంగన్వాడీలు మానసిక ఇబ్బందులకు గురౌతూ ఉన్నారని అన్నారు. ఆశాలకు అన్నిరకాల సెలవులు, పనిభారాన్ని తగ్గించాలని, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని, ఖాళీపోస్టులు భర్తీ చేయాలని, పెరుగుతున్న జనాభా కనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలని, ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణపొందిన ఆశాలకు పర్మినెంట్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్స్ డిమాండ్ చేశారు. ఆశాలకు సంబంధం లేని పనులు సైతం బలవంతంగా బెదిరించి చేయిస్తున్నారు. పి.హెచ్.సి, యు.పి.హెచ్ లు, వెల్నెస్ సెంటర్స్ క్లీనింగ్ చేయించడం, బాత్రూములు కడిగించడం, బూజులు దులిపించడం వంటి పనులు కూడా చేయిస్తున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 2018 నుండి కేవలం 3 వేలు రూపాయలు వేతనం మాత్రమే చెల్లిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు, ఉద్యోగుల హక్కులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సిఐటియు నాయుకులు పి.తేజేశ్వరరావు, సి.హెచ్.అమ్మన్నాయుడు, కె నాగమణి,అల్లు మహాలక్ష్మి, అల్లు.సత్యన్నారాయణ, ఎన్.వి.రమణ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి ధనలక్ష్మి,జి అమరావతి, ఎ.పి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధ, చంద్రమౌళి,ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె సుశీల, బి.ఉత్తర, టి ప్రవీణ స్కూల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఎన్.పద్మ, బి.చంద్రకళ, అంగన్వాడీ యూనియన్ నాయుకులు యన్.హైమావతి, ఆర్.చంద్రమౌళి, కె.వి.హేమలత, బి హైమావతి, జల్లు.కాంచన, బి.ఆదిలక్ష్మి, ఆశా యూనియన్ నాయుకులు టి.దమయంతి వై.హేమలత, తదితరులను 21 మందిని అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయుకులు వివిధ సంఘాలు నాయుకులు ఎం. ఆదినారాయణమూర్తి, వి.ఆర్.ఎల సంఘం జిల్లా అధ్యక్షులు టి.త్రినాధరావు ఎస్.ఎఫ్.ఐ నాయుకులు ఖగేష్ మద్దతు తెలిపారు.
కనీస వేతనాలు కోసం కదం తొక్కిన స్కీం వర్కర్స్. పోలీస్ అరెస్టులతో తీవ్ర
ఉద్రిక్తత కలెక్టర్ కార్యాలయం ముట్టడి. పలువురు అరెస్ట్. శ్రీకాకుళం:అంగన్వాడీ, ఆశా తదితర స్కీం వర్కర్స్ కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలనిసిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం పథకం తదితర స్కీం వర్కర్స్ కు వేతనాలు పెంచాలని, పెన్షన్, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూల్ శానిటేషన్ కార్మికులు, స్కీం వర్కర్స్ అధిక సంఖ్యలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్& బి బంగ్లా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం తరుపున కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు వర్కర్స్ ప్రయిత్నించిగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పలువురిని అరెస్టు చేసి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ ఆశా అంగన్వాడీ తదితర స్కీం వర్కర్స్ కు గత 7 సంవత్సరాలు నుండి వేతనాలు పెంచలేదని, డిఎ కూడా అమలు చేయడం లేదని అన్నారు. విపరీతంగా పెరిగినా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బడిపిల్లలకు వేడి వేడి భోజనం దూరం చేసే స్మార్ట్ కిచెన్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి సామాజిక పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.టీఏ డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు, ఆశాలకు యాప్ లు భారం తగ్గించాలని అంగన్వాడీలకు అదనపు భారమైన నవచేతన యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు.ఉన్న యాప్ లు వలనే ప్రీస్కూల్ కు నష్టం జరుగుతుంటే కొత్తగా నవచేతన యాప్ వలన మరింత పనిభారం పెరిగి అంగన్వాడీలు మానసిక ఇబ్బందులకు గురౌతూ ఉన్నారని అన్నారు. ఆశాలకు అన్నిరకాల సెలవులు, పనిభారాన్ని తగ్గించాలని, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని, ఖాళీపోస్టులు భర్తీ చేయాలని, పెరుగుతున్న జనాభా కనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలని, ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణపొందిన ఆశాలకు పర్మినెంట్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్స్ డిమాండ్ చేశారు. ఆశాలకు సంబంధం లేని పనులు సైతం బలవంతంగా బెదిరించి చేయిస్తున్నారు. పి.హెచ్.సి, యు.పి.హెచ్ లు, వెల్నెస్ సెంటర్స్ క్లీనింగ్ చేయించడం, బాత్రూములు కడిగించడం, బూజులు దులిపించడం వంటి పనులు కూడా చేయిస్తున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 2018 నుండి కేవలం 3 వేలు రూపాయలు వేతనం మాత్రమే చెల్లిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు, ఉద్యోగుల హక్కులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సిఐటియు నాయుకులు పి.తేజేశ్వరరావు, సి.హెచ్.అమ్మన్నాయుడు, కె నాగమణి,అల్లు మహాలక్ష్మి, అల్లు.సత్యన్నారాయణ, ఎన్.వి.రమణ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి ధనలక్ష్మి,జి అమరావతి, ఎ.పి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధ, చంద్రమౌళి,ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె సుశీల, బి.ఉత్తర, టి ప్రవీణ స్కూల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఎన్.పద్మ, బి.చంద్రకళ, అంగన్వాడీ యూనియన్ నాయుకులు యన్.హైమావతి, ఆర్.చంద్రమౌళి, కె.వి.హేమలత, బి హైమావతి, జల్లు.కాంచన, బి.ఆదిలక్ష్మి, ఆశా యూనియన్ నాయుకులు టి.దమయంతి వై.హేమలత, తదితరులను 21 మందిని అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయుకులు వివిధ సంఘాలు నాయుకులు ఎం. ఆదినారాయణమూర్తి, వి.ఆర్.ఎల సంఘం జిల్లా అధ్యక్షులు టి.త్రినాధరావు ఎస్.ఎఫ్.ఐ నాయుకులు ఖగేష్ మద్దతు తెలిపారు.
- రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.1
- సిమెంట్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి - భారత కమ్యూనిస్టు పార్టీ గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో అనేకమంది పేదలు డబ్బులు లేక కట్టుకోలేకపోయారు. కొంతమంది పునాదులు వేసి సగంలో ఆపేశారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమును పెంపుదల చేసి లబ్ధిదారులుతో గృహ నిర్మాణం చేపట్టుటకు చర్యలు చేపట్టినప్పటికీ వాస్తవ లబ్ధిదారులకు తెలియకుండా పాలకొండలో ఉన్న హౌసింగ్ ఏఈ గారు 56 మందికి మనిషి ఒక్కటికి 10 సిమెంట్ బస్తాలు ఇచ్చినట్లు రికార్డ్ చేసి పక్కదారి పట్టించడంతో సమస్య అధికారుల మధ్య జరిగిన అంతర్గత చర్చల్లో మీడియా ద్వారా బయటికి వచ్చింది. కొంతమంది లబ్ధిదారులు జరిగిన మోసాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కోరాడ వీధిలో ఉన్న సచివాలయం వద్ద హౌసింగ్ ఈఈ గారి సమక్షంలో జరుగుతున్న విచారణ వద్దకు చేరుకొని మోసపోయిన లబ్ధిదారుల నుండి వివరాలను అప్పలనాయుడు అడిగి సేకరించ్చారు.విచారణ చేస్తున్న సంబంధిత ఈ ఈ గారి వద్ద ప్రస్తావించగా ఇప్పటికీ 15 మంది వరకు విచారణ చేశామని పూర్తి విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.దీనిపైఅప్పలనాయుడు మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి సంభిందిత హౌసింగ్ ఉద్యోగపై చర్యలు చేపట్టాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.1
- నౌపడలో ఛలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ మండల టిడిపి అధ్యక్షులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో సంతబొమ్మాలి (నౌపడ ) : ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ సంతబొమ్మాళి మండలం నౌపడలో తెదేపా మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో చలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ శుక్రవారం రాత్రి నిర్వహించారు. నౌపాడ , సీతానగరం పాలవానిపేట, కూర్మనాథపురం, జగన్నాథపురం, గ్రామాల్లో పలు వీధుల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రీ విష్ణుమూర్తి, తెదేపా సీనియర్ నాయకులు వాడరేవు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.2
- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. 13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.1
- లక్కవరపుకోట కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని విజయనగరం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ, విద్యావ్యవస్థ బలోపేతమైతేనే సుదృఢమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్య అనేది కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకూడదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, వారిలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థినులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచేందుకు యోగా, ధ్యానం లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులలో పరిశీలనా శక్తి, ఏకాగ్రత స్థాయిలను అంచనా వేసేందుకు ఆయన వారితో స్వయంగా కొన్ని మానసిక వికాస వ్యాయామాలు చేయించారు. అంకెలను వెనుక నుండి క్రమబద్ధంగా చెప్పడం వంటి సరళమైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తిని, దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించవచ్చో ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.3
- అరకు: ధింసా నృత్యంతో రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతున్న విద్యార్ధినులు విద్యార్ధినిల ధింసా ప్రాక్టీస్ లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ వేదిక కలకలలాడుతుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆగష్ట్ 1న భోగాపురం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడి కి ధింసా నృత్యంతో స్వాగతం పలకడానికి 14 వేల మంది విద్యార్ధినిలు సిద్దమవుతున్నారు. ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్ధినిల వృత్తాకార కదలికలు, లయబద్ధ అడుగులు, సాంప్రదాయ వాయిద్యా శబ్దాలతో వేదిక ప్రాంతం అలరారుతోంది.1
- ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధికి నాంది అంటూ మర్రిపాడు లో ర్యాలీ సంతబొమ్మాలి : రాష్ట్ర రవి శాఖ మంత్రి, టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు అచ్చన్న నాయుడు ఆదేశానుసారం భోగాపురం అల్లూరు సీతారామరాజు ఎయిర్ పోర్టర్ ఉత్తరాంధ్రకి ఒక వరమని ప్రతి గ్రామ పంచాయతీలో ర్యాలీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీలో భోగాపురం ఎయిర్పోర్ట్-అభివృద్ధికి నాంది అనే నినాదంతో పెద్ద సంఖ్యలో శుక్రవారం సాయంకాలం సంతబొమ్మాలి మండల మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు జగన్నాథం, మర్రిపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడ్డ గణేష్, శెలగపేట నాయకులు బచ్చల బెనర్జీ, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు లోపింటి రాజా రెడ్డి, జనసేన నాయకులు భీమారావు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1