పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర భవిష్యత్తు.జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాద్ శ్రీకాకుళం, ఏప్రిల్ 22 ; ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించినప్పుడే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ధరిత్రిని అందించగలమని విజయనగరం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు బుధవారం నగరంలో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ గారు తొలుత విద్యార్థుల అవగాహన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రెడ్‌క్రాస్ పరిపాలనా భవనంలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. మట్టి ప్రాముఖ్యతను గుర్తించి, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమన్నారు. విద్యార్థులు పర్యావరణ హిత చర్యలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అవగాహన ర్యాలీని ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కె. శివశంకర్, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ఎంసీ కమిటీ సభ్యులు డాక్టర్ నిక్కపన్న, పి. శ్రీకాంత్, బి. చిన్మయిరావు, పి. వైకుంఠరావు, ప్రతినిధులు కె. సత్యనారాయణ, జి. రమణ, పి. చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర భవిష్యత్తు.జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాద్ శ్రీకాకుళం, ఏప్రిల్ 22 ; ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించినప్పుడే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ధరిత్రిని అందించగలమని విజయనగరం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రి
దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు బుధవారం నగరంలో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ గారు తొలుత విద్యార్థుల అవగాహన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రెడ్‌క్రాస్ పరిపాలనా
భవనంలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. మట్టి ప్రాముఖ్యతను గుర్తించి, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమన్నారు. విద్యార్థులు పర్యావరణ హిత చర్యలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అవగాహన ర్యాలీని ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కె.
శివశంకర్, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ఎంసీ కమిటీ సభ్యులు డాక్టర్ నిక్కపన్న, పి. శ్రీకాంత్, బి. చిన్మయిరావు, పి. వైకుంఠరావు, ప్రతినిధులు కె. సత్యనారాయణ, జి. రమణ, పి. చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలోని పద్మశాలి చేనేత కళ్యాణ మండపంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నాయకులను పోలీసులు అర్ధరాత్రి బలవంతంగా అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు. గత కొన్ని నెలలుగా తమ సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, నాయకులు గుడిమెట్ల వీర్రాజు, కోమాకుల వీరబాబు సోమవారం ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అయితే, భారీగా మోహరించిన పోలీసులు కళ్యాణ మండపం తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గమని, ఇక్కడ నిరసనలకు తావులేదని పోలీసులు హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా? శాంతియుత దీక్షలను పోలీసులతో అణచివేయడం దుర్మార్గం అని,అధికారం రాకముందు ఒకలా,వచ్చాక మరోలా వ్యవహరిస్తే చేనేతలు, బీసీల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఇకపై తమ ఉద్యమానికి పిఠాపురాన్నే కేంద్రంగా చేసుకుంటామని పోలీసులకు సవాల్ విసిరారు. సహకార సంఘాలకు ఆప్కో మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, గతంలో రద్దు చేసిన త్రిఫ్ట్ స్కీమ్, పావలా వడ్డీ, యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, రుణమాఫీ పథకాలను తక్షణమే అమలు చేయాలని, ఎన్నికల హామీ మేరకు రూ. 25,000 నేతన్న భరోసా మరియు GST రియంబర్స్మెంట్ అమలు చేయాలని, చేనేత రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించాలని, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఆప్కో ఎండి రేఖ రాణిని వెంటనే బదిలీ చెయ్యాలని డిమాండ్ చేశారు. 2018 నుండి పెండింగ్‌లో ఉన్న సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి సమస్యల పరిష్కారానికి సంబంధించి లిఖితపూర్వక హామీ పత్రాన్ని నాయకులకు అందజేయడంతో ప్రస్తుతానికి దీక్ష విరమించినప్పటికీ, ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ అల్లక రాజు, దొంతంశెట్టి సత్య ప్రకాష్, అముజూరి చక్రధరరావు, నక్కిన విజయలక్ష్మి, పలివెల లక్ష్మి తదితర నేతలు పాల్గొన్నారు.3
- 🙏😭1
- వృద్ధులు, బాటసారులకు తక్షణ శాంతి – మే 31 వరకు నిరంతరాయ సేవలు 📍 అనపర్తి నియోజకవర్గం | 22 ఏప్రిల్ 2026 ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికమవుతున్న ఈ సమయంలో ప్రజలకు తక్షణ ఉపశమనం అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, బాటసారులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు మజ్జిగ వంటి శీతల పానీయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. “మజ్జిగ సేవించడం ద్వారా శరీరానికి చల్లదనం లభించడమే కాకుండా, వడదెబ్బ వంటి ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు,” అని ఆయన వివరించారు. ఈ చలివేంద్రం ద్వారా ఏప్రిల్ 22 నుండి మే 31 వరకు సుమారు రూ.1.30 లక్షల వ్యయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన స్థానిక వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి స్వయంగా బాటసారులకు మజ్జిగను పంపిణీ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Meenakshi1
- చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి4
- Post by V Ramarao1
- 🙏😭1
- Post by V Ramarao1
- అన్నారు. సత్తుపల్లిలో ఆర్టీసీ డిపో గేటు వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 42 రోజులు అవుతున్నప్పటికీ అటు సంస్థ గాని ఇటు ప్రభుత్వానికి గాని చీమకుట్టినట్లు అయినా లేదని, కార్మికుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం వారు హక్కులను కాలరాసేలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు, చాంద్ పాషా, మల్లూరు అంకంరాజు, వల్లభనేని పవన్, నరుకుళ్ల శ్రీను, చంటి, పూజల రవి, వెంకటేశ్వరరావు, గాదె సురేష్ తదితరులు ఉన్నారు.1