logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు. విద్యార్థులతో ఆడి పాడిన ఉపాధ్యాయులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. నాగసముద్రల మోడల్ స్కూల్, ఇతర పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల తో కలిసి బతుకమ్మ ను పేర్చారు. అందరూ కలిసి బతుకమ్మల పెట్టి, ఆడి పాడారు. స్థానిక ఉన్నత పాఠశాలలో టీచర్లు, విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ ఆడారు. అనంతరం ఇష్టమైన సంగీతంతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు స్టెప్పులేశారు.

8 hrs ago
user_Koheda, Siddipet, Telangana, I
Koheda, Siddipet, Telangana, I
Koheda, Siddipet, Telangana, India కోహెడ, సిద్దిపేట, తెలంగాణ•
8 hrs ago

పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు. విద్యార్థులతో ఆడి పాడిన ఉపాధ్యాయులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. నాగసముద్రల మోడల్ స్కూల్, ఇతర పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల తో కలిసి బతుకమ్మ ను పేర్చారు. అందరూ కలిసి బతుకమ్మల పెట్టి, ఆడి పాడారు. స్థానిక ఉన్నత పాఠశాలలో టీచర్లు, విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ ఆడారు. అనంతరం ఇష్టమైన సంగీతంతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు స్టెప్పులేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు. విద్యార్థులతో ఆడి పాడిన ఉపాధ్యాయులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. నాగసముద్రల మోడల్ స్కూల్, ఇతర పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల తో కలిసి బతుకమ్మ ను పేర్చారు. అందరూ కలిసి బతుకమ్మల పెట్టి, ఆడి పాడారు. స్థానిక ఉన్నత పాఠశాలలో టీచర్లు, విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ ఆడారు. అనంతరం ఇష్టమైన సంగీతంతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు స్టెప్పులేశారు.
    1
    పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు. విద్యార్థులతో ఆడి పాడిన ఉపాధ్యాయులు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో  ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. నాగసముద్రల మోడల్ స్కూల్, ఇతర పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల తో కలిసి బతుకమ్మ ను పేర్చారు. అందరూ కలిసి బతుకమ్మల పెట్టి, ఆడి పాడారు. స్థానిక ఉన్నత పాఠశాలలో టీచర్లు, విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ ఆడారు. అనంతరం ఇష్టమైన సంగీతంతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు స్టెప్పులేశారు.
    user_Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, India కోహెడ, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...పలు పాఠశాలలో ఆడిపాడిన విద్యార్థులతో పాటు టీచర్లు తెలంగాణ పల్లెల్లో పూల పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి ప్రారంభమవుతుండగా శుక్రవారం పలు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ఉండడంతో కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వైభవోపేతంగా విద్యార్థులు టీచర్లు ముందస్తుగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. చిగురు మామిడి మండలం రామంచ ప్రాథమిక పాఠశాలలో కన్నుల పండుగ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు టీచర్లు పలు రకాల పూలతో నిలువెత్తు బతుకమ్మలు పేర్చి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడారు. చప్పట్లు కొడుతూ కోలాటం ఆడుతూ బతకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. ఆశ్వీజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు తెలంగాణ పల్లెల్లో వైభవంగా జరుగుతాయి. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకత ఉంది. పకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే పండుగ బతుకమ్మ వేడుక అని మహిళలు అభిప్రాయపడుతున్నారు. రామంచ స్కూల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో టీచర్ల పద్మ, శోభారాణితో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
    3
    తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...పలు పాఠశాలలో ఆడిపాడిన విద్యార్థులతో పాటు టీచర్లు
తెలంగాణ పల్లెల్లో పూల పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి ప్రారంభమవుతుండగా శుక్రవారం పలు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ఉండడంతో కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వైభవోపేతంగా విద్యార్థులు టీచర్లు ముందస్తుగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. చిగురు మామిడి మండలం రామంచ ప్రాథమిక పాఠశాలలో కన్నుల పండుగ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు టీచర్లు పలు రకాల పూలతో నిలువెత్తు బతుకమ్మలు పేర్చి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడారు. చప్పట్లు కొడుతూ కోలాటం ఆడుతూ బతకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. ఆశ్వీజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు తెలంగాణ పల్లెల్లో వైభవంగా జరుగుతాయి. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకత ఉంది. పకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే పండుగ బతుకమ్మ వేడుక అని మహిళలు అభిప్రాయపడుతున్నారు. రామంచ స్కూల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో టీచర్ల పద్మ, శోభారాణితో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • ట్రినిటీ కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.! పూల బతుకమ్మలతో పండుగ శోభ.. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థినులు కరీంనగర్‌ వావిలాలపల్లిలోని ట్రినిటీ జూనియర్‌ కళాశాల (బాలికలు) ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. కళాశాలలోని ప్రైమ్‌ గ్రౌండ్‌ రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి. కళాశాల ఛైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్‌ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను నేటి యువతరం తెలుసుకోవాలన్నారు. విద్యార్థినులకు విద్యతోపాటు సంప్రదాయ విలువలను అందించాలనే ఉద్దేశంతో ఏటా కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో అలరించారు. విద్యార్థినుల ఉత్సాహంతో ప్రైమ్‌ గ్రౌండ్‌ సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి.
    1
    ట్రినిటీ కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.!

పూల బతుకమ్మలతో పండుగ శోభ.. 

సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థినులు

కరీంనగర్‌ వావిలాలపల్లిలోని ట్రినిటీ జూనియర్‌ కళాశాల (బాలికలు) ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. కళాశాలలోని ప్రైమ్‌ గ్రౌండ్‌ రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి. కళాశాల ఛైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్‌ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను నేటి యువతరం తెలుసుకోవాలన్నారు. విద్యార్థినులకు విద్యతోపాటు సంప్రదాయ విలువలను అందించాలనే ఉద్దేశంతో ఏటా కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో అలరించారు. విద్యార్థినుల ఉత్సాహంతో ప్రైమ్‌ గ్రౌండ్‌ సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    7 hrs ago
  • కరీంనగర్‌లో ఎంఐఎం నూతన టౌన్ కమిటీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధికి నూతన టౌన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పట్టణాధ్యక్షుడు మహమ్మద్ ఆతీఫ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనరల్ సెక్రటరీ మోసిన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. భారీగా సభ్యత్వాలు నమోదు చేసి, వచ్చే నెలలో అసదుద్దీన్ ఒవైసీ నగరంలో సభ నిర్వహించనున్నట్లు వివరించారు.
    1
    కరీంనగర్‌లో ఎంఐఎం నూతన టౌన్ కమిటీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధికి నూతన టౌన్ కమిటీని ఏర్పాటు
చేసినట్లు పట్టణాధ్యక్షుడు మహమ్మద్ ఆతీఫ్ తెలిపారు. 
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనరల్ సెక్రటరీ మోసిన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. భారీగా సభ్యత్వాలు నమోదు చేసి, వచ్చే నెలలో అసదుద్దీన్ ఒవైసీ నగరంలో సభ నిర్వహించనున్నట్లు వివరించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • సరిపడా కరెంటు ఇవ్వాలని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ధర్నా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కరెంటు కోసం రైతులు కన్నెర్ర చేశారు. కోతలు లేకుండా వ్యవసాయనికి సరిపడా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మరుమాముల, సలాకపూర్, లద్దునూర్, ధర్మారం గ్రామాలకు చెందిన సుమారు 200 మందిక పైగా రైతులు మరుమాముల విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు గంటల విద్యుత్తు మాత్రమే అందడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయానికి సరిపడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదన్నారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని విమర్శించారు. వర్షాకాలంలో పంటలు ఎండిపోయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ప్రస్తుతం కరెంటు వల్లనే పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రైతులకు రుణాలు కరెంటు అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రాదని రైతులు ప్రశ్నించారు. నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అందించే వరకు రైతులమంతా ఉద్యమించనున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని చేర్యాల ఏడిఈ వెంకట్ గౌడ్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసర్ల రేణుక కనకరాజు, జక్కుల కనకమ్మ లింగయ్య, గడిపే మౌనిక అనిల్ కుమార్, మాజీ సర్పంచులు సుందరగిరి స్రవంతి పరశురాములగౌడ్, వంగ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఉత్కం మల్లేశం ,నాయకులు పశుపతి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    2
    సరిపడా కరెంటు ఇవ్వాలని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కరెంటు కోసం రైతులు కన్నెర్ర చేశారు. కోతలు లేకుండా వ్యవసాయనికి సరిపడా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మరుమాముల, సలాకపూర్, లద్దునూర్, ధర్మారం గ్రామాలకు చెందిన సుమారు 200 మందిక పైగా రైతులు మరుమాముల విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు గంటల విద్యుత్తు మాత్రమే అందడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయానికి సరిపడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదన్నారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని విమర్శించారు. వర్షాకాలంలో పంటలు ఎండిపోయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ప్రస్తుతం కరెంటు వల్లనే పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రైతులకు రుణాలు కరెంటు అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రాదని రైతులు ప్రశ్నించారు. నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అందించే వరకు రైతులమంతా ఉద్యమించనున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని చేర్యాల ఏడిఈ వెంకట్ గౌడ్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. 
ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసర్ల రేణుక కనకరాజు, జక్కుల కనకమ్మ లింగయ్య, గడిపే మౌనిక అనిల్ కుమార్, మాజీ సర్పంచులు సుందరగిరి స్రవంతి పరశురాములగౌడ్, వంగ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఉత్కం మల్లేశం ,నాయకులు పశుపతి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Mallanna
    Mallanna
    Insurance Agent మద్దూర్, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకురాలు కొలనూరు ముత్తవ్వ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమాల అనిల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య, రాజు శ్రీశైలం, చీమలగొట్టు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలనూరు ముత్తవ్వ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, మహిళల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయిన్ రంజిత్, గుంటి వేణు,n అజయ్ మహిళా మోర్చా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకురాలు కొలనూరు ముత్తవ్వ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమాల అనిల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య, రాజు శ్రీశైలం, చీమలగొట్టు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొలనూరు ముత్తవ్వ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, మహిళల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయిన్ రంజిత్, గుంటి వేణు,n అజయ్ మహిళా మోర్చా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    12 hrs ago
  • వేములవాడలో బతుకమ్మ, దసరా శోభ రంగురంగుల దీపకాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వరాలయం ​ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ​ప్రత్యేక ఆకర్షణగా భీమేశ్వర సదన్: మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, దాండియా, కోలాటాలు ఆడేందుకు భీమేశ్వర సదన్‌లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ​నిమజ్జన ఏర్పాట్లు గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చే మహిళా భక్తుల సౌకర్యార్థం బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.​పండుగ వేళ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పరిసరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెల్లివిరుస్తున్నాయి.
    1
    వేములవాడలో బతుకమ్మ, దసరా శోభ రంగురంగుల దీపకాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వరాలయం
​
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు.
​ప్రత్యేక ఆకర్షణగా భీమేశ్వర సదన్: మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, దాండియా, కోలాటాలు ఆడేందుకు భీమేశ్వర సదన్‌లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు.
​నిమజ్జన ఏర్పాట్లు
గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చే మహిళా భక్తుల సౌకర్యార్థం బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.​పండుగ వేళ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పరిసరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెల్లివిరుస్తున్నాయి.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ జిల్లా నగునూర్ లో గంజాయి విక్రయించే వ్యక్తి అరెస్టు...1100 గ్రాముల గంజాయి స్వాధీనం- సిఐ నిరంజన్ రెడ్డి కరీంనగర్ రూరల్ మండలం నగునూరు నుంచి జూబ్లీనగర్‌కు వెళ్లే రహదారిలో మాలగుట్టల వద్ద గంజాయి విక్రయించేందుకు యత్నించిన ఇద్దరలో ఒకరు పోలీసులకు చిక్కారు. మరొకరు పారిపోయాడు. పట్టుబడ్డ వ్యక్తి మంచిర్యాల జిల్లా భీమారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన యువకుడు పైల్లా శ్రీమాన్ నుంచి 1100 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మరో వ్యక్తి బైక్‌పై పరారయ్యాడని అతని కోసం పోలీసులు గాలిస్తున్నామని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి ప్లాస్టిక్ కవర్‌ లలో చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై తోపాటు పోలీసులు అక్కడికి వెళ్ళగా ఒక్కడు పారిపోగా మరొకడు పట్టుబడ్డాడని తెలిపారు. ఇద్దరు గంజాయిని చంద్రాపూర్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లు 100 రూపాయలకు ఒకటి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. 15 రోజుల క్రితం మరో వ్యక్తితో కలిసి దాదాపు రెండు కిలోల గంజాయిని తీసుకువచ్చి, అందులో కొంత భాగాన్ని ప్యాకెట్లుగా చేసి నగునూరు, జూబ్లీనగర్, చర్లబూత్కూర్, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విక్రయించినట్లు నిందితుడు తెలిపినట్లు సిఐ తెలిపారు. మండలంలో ఏ గ్రామంలోనైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    కరీంనగర్ జిల్లా నగునూర్ లో గంజాయి విక్రయించే వ్యక్తి అరెస్టు...1100 గ్రాముల గంజాయి స్వాధీనం- సిఐ నిరంజన్ రెడ్డి 
కరీంనగర్ రూరల్ మండలం నగునూరు నుంచి జూబ్లీనగర్‌కు వెళ్లే రహదారిలో మాలగుట్టల వద్ద గంజాయి విక్రయించేందుకు  యత్నించిన ఇద్దరలో ఒకరు పోలీసులకు చిక్కారు. మరొకరు పారిపోయాడు. పట్టుబడ్డ వ్యక్తి మంచిర్యాల జిల్లా భీమారం మండలం  రాంపూర్ గ్రామానికి చెందిన యువకుడు పైల్లా శ్రీమాన్ నుంచి 1100 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మరో వ్యక్తి బైక్‌పై పరారయ్యాడని అతని కోసం పోలీసులు గాలిస్తున్నామని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి  ప్లాస్టిక్ కవర్‌ లలో చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై తోపాటు పోలీసులు అక్కడికి వెళ్ళగా ఒక్కడు పారిపోగా మరొకడు పట్టుబడ్డాడని తెలిపారు. ఇద్దరు గంజాయిని చంద్రాపూర్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లు 100 రూపాయలకు ఒకటి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. 15 రోజుల క్రితం మరో వ్యక్తితో కలిసి దాదాపు రెండు కిలోల గంజాయిని తీసుకువచ్చి, అందులో కొంత భాగాన్ని ప్యాకెట్లుగా చేసి నగునూరు, జూబ్లీనగర్, చర్లబూత్కూర్, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విక్రయించినట్లు నిందితుడు తెలిపినట్లు సిఐ తెలిపారు. మండలంలో ఏ గ్రామంలోనైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.