ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకురాలు కొలనూరు ముత్తవ్వ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమాల అనిల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య, రాజు శ్రీశైలం, చీమలగొట్టు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలనూరు ముత్తవ్వ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, మహిళల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయిన్ రంజిత్, గుంటి వేణు,n అజయ్ మహిళా మోర్చా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకురాలు కొలనూరు ముత్తవ్వ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమాల అనిల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య, రాజు శ్రీశైలం, చీమలగొట్టు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలనూరు ముత్తవ్వ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, మహిళల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయిన్ రంజిత్, గుంటి వేణు,n అజయ్ మహిళా మోర్చా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- ట్రినిటీ కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.! పూల బతుకమ్మలతో పండుగ శోభ.. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థినులు కరీంనగర్ వావిలాలపల్లిలోని ట్రినిటీ జూనియర్ కళాశాల (బాలికలు) ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. కళాశాలలోని ప్రైమ్ గ్రౌండ్ రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి. కళాశాల ఛైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను నేటి యువతరం తెలుసుకోవాలన్నారు. విద్యార్థినులకు విద్యతోపాటు సంప్రదాయ విలువలను అందించాలనే ఉద్దేశంతో ఏటా కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో అలరించారు. విద్యార్థినుల ఉత్సాహంతో ప్రైమ్ గ్రౌండ్ సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి.1
- కరీంనగర్‌లో ఎంఐఎం నూతన టౌన్ కమిటీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధికి నూతన టౌన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పట్టణాధ్యక్షుడు మహమ్మద్ ఆతీఫ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనరల్ సెక్రటరీ మోసిన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. భారీగా సభ్యత్వాలు నమోదు చేసి, వచ్చే నెలలో అసదుద్దీన్ ఒవైసీ నగరంలో సభ నిర్వహించనున్నట్లు వివరించారు.1
- ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకురాలు కొలనూరు ముత్తవ్వ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమాల అనిల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య, రాజు శ్రీశైలం, చీమలగొట్టు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలనూరు ముత్తవ్వ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, మహిళల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయిన్ రంజిత్, గుంటి వేణు,n అజయ్ మహిళా మోర్చా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...పలు పాఠశాలలో ఆడిపాడిన విద్యార్థులతో పాటు టీచర్లు తెలంగాణ పల్లెల్లో పూల పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి ప్రారంభమవుతుండగా శుక్రవారం పలు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ఉండడంతో కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వైభవోపేతంగా విద్యార్థులు టీచర్లు ముందస్తుగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. చిగురు మామిడి మండలం రామంచ ప్రాథమిక పాఠశాలలో కన్నుల పండుగ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు టీచర్లు పలు రకాల పూలతో నిలువెత్తు బతుకమ్మలు పేర్చి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడారు. చప్పట్లు కొడుతూ కోలాటం ఆడుతూ బతకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. ఆశ్వీజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు తెలంగాణ పల్లెల్లో వైభవంగా జరుగుతాయి. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకత ఉంది. పకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే పండుగ బతుకమ్మ వేడుక అని మహిళలు అభిప్రాయపడుతున్నారు. రామంచ స్కూల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో టీచర్ల పద్మ, శోభారాణితో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.3
- పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు. విద్యార్థులతో ఆడి పాడిన ఉపాధ్యాయులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. నాగసముద్రల మోడల్ స్కూల్, ఇతర పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల తో కలిసి బతుకమ్మ ను పేర్చారు. అందరూ కలిసి బతుకమ్మల పెట్టి, ఆడి పాడారు. స్థానిక ఉన్నత పాఠశాలలో టీచర్లు, విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ ఆడారు. అనంతరం ఇష్టమైన సంగీతంతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు స్టెప్పులేశారు.1
- వేములవాడలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక డ్రైవ్ వేములవాడ: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జి. రమ్య, కానిస్టేబుళ్లు వినయ్, శ్రీను దాడిలో పాల్గొన్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నెల 20 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.1
- *పేదలకు మెరుగైన వైద్యం* *చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి* *వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో మోకాళ్ల ఆపరేషన్లకు సీ-ఆర్మ్ మిషన్* *వినికిడి పరీక్షలు, థెరపీ సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్* *వేములవాడ ఏరియా ఆసుపత్రిలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమం* *వినియోగంలోకి బేరా యంత్రం* *సామూహిక సీమంతాలు, అన్న ప్రాసనలు* పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు చిన్నారుల్లో పోషకాహార లోపం, పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సామూహిక సీమంతాలు, అన్న ప్రాసనలు నిర్వహించారు. ఆసుపత్రిలో బేరా యంత్రాన్ని ప్రారంభించారు. డీ ఈ ఐ సీ కేంద్రంలో దాదాపు 18 మంది పిల్లలు ఫిజియోథెరపీ ద్వారా శారీరక ఇబ్బందులు దూరమై ఇప్పుడు నడుస్తున్నారని పలువురు తల్లితండ్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోషణ మాసం సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, బెల్లం, నువ్వులు బాలామృతంతో సిద్ధం చేసిన ఆహార పదార్థాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడంతో పాటు ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను తల్లుల మాదిరిగా అంగన్‌వాడీ టీచర్లు సంరక్షిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్‌వాడీ భవనాలు, మహిళా స్వయం సహాయక సంఘాల స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు సమకూరుస్తున్నారని వెల్లడించారు. *సమస్యలపై ప్రత్యేక దృష్టి* చిన్నారుల్లో వినికిడి లోపం, మాటలు రాకపోవడం, శారీరక ఎదుగుదలలో సమస్యలు వంటి లోపాలను చిన్న వయసులోనే గుర్తించి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో గుర్తించిన కొంతమంది చిన్నారులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్, సరోజినీదేవి, ఈఎన్‌టీ వంటి ఆసుపత్రులకు పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పేదరికం కారణంగా వైద్యం పొందలేని పరిస్థితి చిన్నారులకు ఎదురుకాకూడదని, అవసరమైన వైద్య పరీక్షలు, ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందులో భాగంగా వేములవాడ ఆసుపత్రిలోనే ప్రత్యేక థెరపీ సేవలు అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వినికిడి లోపాన్ని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షల నిర్వహణకు అవసరమైన గదిని ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించినట్లు వివరించారు. *మోకాళ్ల ఆపరేషన్లకు సీ-ఆర్మ్ మిషన్* వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా మోకాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఆపరేషన్ల నిర్వహణలో సీ-ఆర్మ్ మిషన్ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, తాజాగా మిషన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఉచితంగా మోకాళ్ల శస్త్రచికిత్సలు అందిస్తున్నామని, వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఈ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. *అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్* అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. చిన్నారుల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది సంబంధిత వైద్యులకు తెలియజేయాలని కోరారు. అవసరమైన వైద్య సహాయం అందిస్తామని పేర్కొన్నారు. *ప్రతి మంగళవారం 10 నిమిషాలు..* జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. *ప్రతి మంగళవారం 10 నిమిషాలు* కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రాల సేవలు, వసతులు మెరుగు పరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ, వసతుల పెంపు తదితర అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని, దీంతో వారి బంగారు భవితకు బాటలు పడతాయని స్పష్టం చేశారు. ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు నమోదు చేయడంతో వారికి అంగన్వాడి కేంద్రంలో బాలామృతంతో పాటు ఇతర పోషక ప్రాంతాలు అందిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం పంపించడంతో పిల్లలకు పోషకాహారం అందుతుందని, ఆట, పాటలు బొమ్మల ద్వారా విద్య బుద్దులు చెపుతారని వివరించారు. *తల్లులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి* గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. *అంగన్వాడి కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలి* 5 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలు ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడి కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఎదుగుదల లోపాలు గల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ధి మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల గల పిల్లలు, మెదడు సంబంధించిన సమస్యలు సమస్య, సరిగా మాట్లాడాలని పిల్లలు, రక్తహీనత పోషకాహారం లోపం గల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలలోని లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. ఆర్ బీ ఎస్ కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. ఉన్నత వైద్య సేవలు హైదరాబాద్ లో అందిస్తారని వెల్లడించారు. తాను ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు బేరా యంత్రం వినియోగంలో లేదని గుర్తు చేశారు. దానికోసం ప్రత్యేక గది, ఇతర ఏర్పాట్లను చేయించి.. వినియోగంలోకి తీసుకు వచ్చామని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.4
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీల్‌రావుపై కరీంనగర్ నగర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో పదవులు పొంది, ఇప్పుడు మాజీ మంత్రి గంగుల కమలాకర్‌పై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. పదవులిచ్చిన పార్టీకే నమ్మకద్రోహం చేశారని, బీజేపీలోని సీనియర్ నేతలే అతడిని త్వరలోనే తరిమికొడతారని విమర్శించారు. సునీల్ రావుకు మిగిలింది ఎంఐఎం పార్టీ మాత్రమే అని అందులోకి కూడా వెళ్తాడని ఎద్దేవా చేశారు.1