Shuru
Apke Nagar Ki App…
అల్లిపూర్ లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్ నిప్పురవ్వలతో కాలిపోయిన మక్క సేను బిజినెపల్లి: అల్లిపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రైతు డొక్కా శ్రీనివాసులు రెండెకరాల 10 గుంటల పొలంలో వేసిన మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పడిన నిప్పురవ్వల వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి పంటంతా కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కళ్లెదుటే కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.
MALLIKARJUN T
అల్లిపూర్ లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్ నిప్పురవ్వలతో కాలిపోయిన మక్క సేను బిజినెపల్లి: అల్లిపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రైతు డొక్కా శ్రీనివాసులు రెండెకరాల 10 గుంటల పొలంలో వేసిన మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పడిన నిప్పురవ్వల వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి పంటంతా కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కళ్లెదుటే కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.
- MALLIKARJUN Tబిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణప్రభుత్వం ఆ రైతుకు ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం4 hrs ago
- MALLIKARJUN Tబిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణప్రభుత్వం ఆ రైతుకు ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం4 hrs ago
More news from తెలంగాణ and nearby areas
- బిజినెపల్లి: అల్లిపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రైతు డొక్కా శ్రీనివాసులు రెండెకరాల 10 గుంటల పొలంలో వేసిన మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పడిన నిప్పురవ్వల వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి పంటంతా కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కళ్లెదుటే కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.1
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు బిజెపి వ్యతిరేకం కాదు: సంగారెడ్డిలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో నల్లచెరువు కట్ట పరిసరాల్లో జరుగుతున్న చెట్ల నరికివేతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలోని నల్లచెరువు కట్టకు ఇరువైపులా ఉన్న చెట్లను అక్రమంగా నరికి వేస్తున్నారని స్థానికులు గమనించారు. ఈ విషయం గురించి ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ మరియు ఆమె భర్త తాళ్ళ ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు చెట్లు నరుకుతున్నామని కొందరు తెలిపారు అని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే ఈ నిర్ణయం గురించి కనీసం వార్డ్ మెంబర్లకు లేదా ఉప సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా, సర్పంచ్ మరియు ఆమె భర్త ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తప్పు జరిగినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.4
- వికారాబాద్ : వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగాడి టిజిఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నీటి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు పరీక్షల నిర్వహణ తీరును అభ్యర్థులు కల్పించిన కనీస వసతులను ఉచితంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రం వద్ద ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలులో ఉంటుందని గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.1
- నంద్యాల జిల్లా నంద్యాల -గిద్దలూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారని ప్రయాణికులు, ప్రజలు వాపోతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో, ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.6
- చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నిల్లికట్టు సత్యం మాట్లాడుతూ.. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ల్యాబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- నాటు సారా వద్దు - అభివృద్ధి నాటు సారా వద్దు అభివృద్ధి వైపు నడవాలని షికారి పేటకు జిల్లా కలెక్టర్ షికారి పేట అభివృద్ధికి 45 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నందికొట్కూరులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకుఅధికారుల సమగ్ర అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు తాసిల్దార్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి వి. రాముడు శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి ఎస్సై లు చంద్రశేఖర్ జఫరుల్లా మెప్మా అధికారి ప్రమీల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో అన్ని శాఖల అధికారులు పాల్గొని షికారి వాసులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. షికారి పేటలో రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరయ్యాయని ప్రకటించారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా సోమవారం తమ కార్యాలయానికి వస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీలి షికారి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రేషన్ లేదా ఇతర సమస్యలపై అర్జీ ఇస్తే వెంటనే పరిష్కార మార్గం చూస్తామని సభాముఖంగా వెల్లడించారు అదేవిధంగా యువతకు ఉద్యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు షికారి కాలనీ యువత కోసం కానిస్టేబుల్, ఎస్ఐ రాత పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను తామే అందజేస్తామని అని అన్నారు యువతలో ఉత్సాహం నీకెందుకు నూతన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు మహిళలకు మెప్మా ద్వారా రుణ సదుపాయం ప్రతి సోమవారం కాలనీకి వచ్చి మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. తోపుడు బండి, చిన్న వ్యాపారులైన పురుషులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తామని అని అన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. చదువుకున్నవారికి ఉద్యోగ కల్పన, నిరక్షరాస్యులకు మెప్మా ద్వారా సహాయం అందిస్తామన్నారు. యువత కోసం రింగ్ బాల్, వాలీబాల్ వంటి క్రీడా వస్తువులను తమ శాఖ ఉచితంగా పంపిణీ చేస్తుందని అని అన్నారు నాటు సారాను వదిలి అభివృద్ధి బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు3
- హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు కారుతో ఢీకొట్టడమే కాకుండా తనతో గొడవ పడుతున్నాడనే కోపంతో ఉన్మాదంగా మారిన టాక్సీ కారు డ్రైవర్ తన కారుకి అడ్డంగా నిలబడి పోనివ్వకుండా చేస్తున్నాడనే కోపంతో అలాగే అతడిని ఢీకొట్టుకుంటూ వెళ్ళాలని చూశాడు.. అయితే బాధితుడు కారు బోనెట్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. దీంతో అతన్ని అలాగే రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు మిగతా వాహనదారులు ఈ దుర్ఘటనను వీడియో తీయడంతో ఈ దారుణం భయటపడింది మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన.. ఈ ఘటనలో తండ్రీకొడుకులను కారుతో ఢీకొట్టి వారిపై దాడి ఎస్.కె. జిలానీ, అతని కుమారుడు ఫైసల్ ఇద్దరు గాయత్రీ నగర్ నుండి ఎల్.బి. నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, ఒక కారు వారిని వెనుక నుండి ఢీకొట్టింది. ఇద్దరిమధ్య వాగ్వాదం చెలరేగి గొడవకు దారితీసింది.. దీంతో కారులో ఉన్న వ్యక్తి దాడికి పాల్పడ్డాడు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా, జిలానీ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ దాదాపు వాహనాన్ని ఆపకుండా దాదాపు రెండు కిలోమీటర్ల పాటు కారు బోనెట్‌పై ఉన్న అతడిని ఈడ్చుకుపోయాడు. అతడు గాయాలతో నొప్పితో అరుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించాడు ఆ కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వేగంగా వెళ్లి, వెనక్కి తిరిగి, చివరకు మండమల్లమ్మ జంక్షన్ సమీపంలో స్థానికులు అడ్డగించడంతో పట్టుబడినట్లు సమాచారం ఘటనలో బాధితుడు ఫైసల్ రెండు కాళ్లు విరిగిపోయి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు1