logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా డాక్టర్ బలుసుపాట్టి వెంకటేశ్వరరావు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఎన్నిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనగా గురువారం నాడు (16 - 04 - 2026) నాడు నిర్వహించి జీవో ని రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికసంఖ్యలో ప్రయత్నాలు చేసినప్పటికి నలుగురికే చోటు దక్కింది దీనిలో భాగంగా బీసీ కోటాలో *ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన డాక్టర్ బలుసుపాటి వెంకటేశ్వరావు( రజక )కు* ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా అవకాశం దక్కింది ఈ సందర్భంగా డాక్టర్ బలుసుపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌన్సిల్ మెంబర్ రావటానికి సహకరించిన *సత్తుపల్లి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారికి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు*. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూస్తూ చదువుకొని ఎదిగిన నాకు ఇది ఒక గొప్ప గౌరవం అని ఆయన తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన డాక్టర్ బలుసుపాటి వెంకటేశ్వరరావు కు పలువురు అభినందనలు తెలిపారు

3 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
3 hrs ago
5f428005-128b-49a1-9746-18b8bb8c1a4e

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా డాక్టర్ బలుసుపాట్టి వెంకటేశ్వరరావు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఎన్నిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనగా గురువారం నాడు (16 - 04 - 2026) నాడు నిర్వహించి జీవో ని రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికసంఖ్యలో ప్రయత్నాలు చేసినప్పటికి నలుగురికే చోటు దక్కింది దీనిలో భాగంగా బీసీ కోటాలో *ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన డాక్టర్ బలుసుపాటి వెంకటేశ్వరావు( రజక )కు* ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా అవకాశం దక్కింది ఈ సందర్భంగా డాక్టర్ బలుసుపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌన్సిల్ మెంబర్ రావటానికి సహకరించిన *సత్తుపల్లి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారికి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు*. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూస్తూ చదువుకొని ఎదిగిన నాకు ఇది ఒక గొప్ప గౌరవం అని ఆయన తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన డాక్టర్ బలుసుపాటి వెంకటేశ్వరరావు కు పలువురు అభినందనలు తెలిపారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. ఒక పౌరుడికి ఒకటే ఓటు కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    1
    దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. 
కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 
అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. 
ఒక పౌరుడికి ఒకటే ఓటు  కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది 
ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    user_P. Ashok
    P. Ashok
    Media company అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    1
    ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    1
    గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • పార్లమెంట్ లో బిజెపికి చెందిన ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిరసన ఆందోళనలతో ఎంపీ పదవి నుంచి తొలగించి, దేశద్రోహం కేసు పెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యంపి.తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి నుండి సస్పెండ్ చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమని అంజన్ కుమార్ తో పాటు పలువురు నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల పౌరులను పాకిస్థాన్ వాదులతో పోల్చడం తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నామని తెలిపారు. తేజస్వి సూర్య వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
    2
    పార్లమెంట్ లో బిజెపికి చెందిన ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిరసన ఆందోళనలతో ఎంపీ పదవి నుంచి తొలగించి, దేశద్రోహం కేసు పెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యంపి.తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి నుండి సస్పెండ్ చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమని అంజన్ కుమార్ తో పాటు పలువురు నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల పౌరులను పాకిస్థాన్ వాదులతో పోల్చడం తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నామని తెలిపారు. తేజస్వి సూర్య వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని  హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    19 min ago
  • పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా  కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.  అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు.  ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    49 min ago
  • Post by Solanke Ravi
    4
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Photographer నంగ్నూర్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    1
    ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    32 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.