Shuru
Apke Nagar Ki App…
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చు రాజకీయాలకు అతీతంగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తున్నామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి సంబందించిన కొత్త డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అత్యున్నత భద్రత ప్రమాణాలతో రేషన్ కార్డులు జారీ చేయబడుతున్నాయని స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ బియ్యాన్ని తీసుకోవచ్చని సూచించారు.స్మార్ట్ రేషన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గుర్తింపు కార్డులా పని చేస్తుందని పేర్కొన్నారు.
Gautham
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చు రాజకీయాలకు అతీతంగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తున్నామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి సంబందించిన కొత్త డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అత్యున్నత భద్రత ప్రమాణాలతో రేషన్ కార్డులు జారీ చేయబడుతున్నాయని స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ బియ్యాన్ని తీసుకోవచ్చని సూచించారు.స్మార్ట్ రేషన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గుర్తింపు కార్డులా పని చేస్తుందని పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.2
- మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.3
- ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.1
- సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు1
- జమ్మికుంటలో మందుబాబు వీరంగం...ఈడ్చుకెళ్ళి తగిన శాస్త్రి చేసిన పోలీసులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మద్యం మత్తులో వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు చెందిన రాజు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో స్వీట్ హౌస్ నిర్వాహకులతో ధర విషయంలో గొడవ పడ్డారు. స్వీట్ హౌస్ నిర్వాహకుడు డయల్ 111 కాల్ చేయడంతో మత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించి సముదాయించి పంపించేశారు పోలీసులు. మద్యం మత్తులో ఉన్న రాజు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన దిగారు. పోలీసులు తీరు స్వీట్ హౌస్ నిర్వాహకులపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యూసెన్స్ సృష్టించడంతో మందుబాబుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందు బాబుపై చేయ్ వేసుకుని స్టేషన్ గొరగొర కొంతదూరం ఈడ్చుకెళ్ళారు. అనంతరం నలుగురు అతన్ని అమాంతం లేపి స్టేషన్ కు లాక్కెళ్లారు. మందు బాబు వీరంగం, పోలీసుల అసహనం స్థానికంగాళకలకలం సృష్టించింది.2
- గోవిందరావుపేటలో వాన దేవుని కరుణ కోసం కప్పతల్లి ఆట..... MLG:అడపా దడపా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి భరోసా ఇవ్వట్లేదు. లక్నవరం చెరువులో ఉన్న నీరు ఈ సీజను సరిపోయేలా లేదు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో 80%వరి సాగుపై ఆధారపడ్డ గోవిందరావుపేట మండల రైతుల్లో ఆందోళన నెలకొంది. నాట్లు వేసుకున్న అన్నదాతలు పైరుకు తడికోసం తండ్లాడుతున్నారు. ఈ క్రమంలో మండలకేంద్రంలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. వానలు కురిపించాలని దైవాలను వేడుకున్నారు.1
- వర్షాల కోసం కప్పతల్లి ఆటలు.. కప్పలకు పెళ్లి చేసి చెరువులో వదిలిన రైతులు ములుగు: పొలాల్లో నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా లక్నవరం చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాలు కురవాలని వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు రైతులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ‘కప్పతల్లి ఆటలు’ నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు కప్పలను పట్టుకొచ్చి పసుపు, కుంకుమతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. అనంతరం కప్ప వరుడు, వధువులను డప్పు చప్పుళ్లతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. తర్వాత సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి కప్పలను నీటిలో వదిలారు. కప్పలు తడిస్తే మేఘాలు కరిగి వర్షాలు కురుస్తాయని తమ పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకమని గ్రామస్థులు తెలిపారు. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు.1