Shuru
Apke Nagar Ki App…
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింపు.. ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులు నంద్యాల జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి బుధవారం శ్రీశైలం జలాశయానికి 14,260 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 42.8708 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో జలాశయానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Naga kanth
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింపు.. ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులు నంద్యాల జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి బుధవారం శ్రీశైలం జలాశయానికి 14,260 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 42.8708 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో జలాశయానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింపు.. ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులు నంద్యాల జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి బుధవారం శ్రీశైలం జలాశయానికి 14,260 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 42.8708 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో జలాశయానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.1
- టీచింగ్ ఉద్యోగాలు 👌జీతం :2,18,700₹. అర్హత :డిగ్రీ, పీజీ, Phd. #shorts #teachingjobs #facultyjobs 🤝🤝.1
- గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం వైభవం నంద్యాల: గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణం కోసం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి, శ్రీచక్రానికి శాకాలతో సహస్రనామార్చనలు, శాక నివేదనం, శాకహారతులు నిర్వహించారు. హైదరాబాద్ ఎల్‌బి నగర్ మార్కెట్‌కు చెందిన శ్రీకాంత్ రెడ్డి బృందం, కర్నూలు మార్కెట్‌కు చెందిన గిరిధర్ బృందం సుమారు 2 వేల కిలోలకుపైగా కూరగాయలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.3
- మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.1
- ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు1
- శ్రీశైల దేవస్థానం తొమ్మిదవ ధర్మకర్తల మండలి సమావేశంలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. *ధర్మకర్తల మండలి సమావేశం* • 9వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు • వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమశాస్త్రానుసారంగా వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం • దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతిస్సిద్ధవట ఆలయంలో అభివృద్ధి పనులు, • ఆగష్టు 7న కొలనుభారతి క్షేత్రంలో శాకంభరీ ఉత్సవం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడుగారి అధ్యక్షతన ధర్మకర్తల మండలి 9వ సమావేశం నిర్వహించబడింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈనాటి సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంభరీ ఉత్సవ నిర్వహణ, శ్రావణమాసోత్సవాలు, సహస్రఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ రేపు ( 29.07.2026) జరిగే శాకంభరీ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండేందుకు రాష్ట్రం మరియు దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు తలపెట్టిన వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం జరుగుతుందన్నారు. వరుణయాగం, శ్రీస్వామివారికి సహస్రఘటాభిషేకం, స్వామిఅమ్మవార్లకు విశేషార్చనలు, కార్యక్రమ సంబంధి హోమాలు, జపాలు, పారాయణలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాబోవు శ్రావణమాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు.శ్రావణమాసంలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరిగేవిధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు. • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు. టి.టి.డి తరహాలో నిర్దిష్టమైన విధానం అమలు. సిఫారసు లేఖలు కనీసం 48 గంటలు ముందస్తుగా పంపడం తప్పనిసరి. ప్రోటోకాల్ టికెట్ల జారీలో పూర్తి పారదర్శకత. • సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్దిష్ట వేళలలో మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు. ప్రోటోకాల్ దర్శనాలు జారీకి కూడా ఆన్‌లైన్ విధానం అమలు. • లోకకల్యాణం కోసం అయిదు రోజులపాటు అనగా తేది : 07.08.2026 నుండి 11.08.2026 వరకు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం. • శ్రీశైలదేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగష్టు 7 శుక్రవారం రోజున సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. • శ్రీశైలదత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవట ఆలయ జీర్ణోద్ధారణ చేయాలని తీర్మానించడమైనది. దశల వారిగా ఈ ఆలయంలో ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన అంచనాలను త్వరలోనే రూపొందించడం జరుగుతుంది. • ఆలయముందుభాగంలో సాలుమండపాల నిర్మాణం ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. అయితే క్యూకాంప్లెక్సు నిర్మాణం, క్షేత్రపరిధిలో శౌచాలయాల నిర్మాణం, తిరుమల తరహాలో ఫిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణం, సాలుమండపాల నిర్మాణం మొదలైనవన్నీ ప్రాధాన్యతా క్రమములో చేపట్టడం జరుగుతుంది. • సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలో ఎంపిక చేసిన 20 ప్రదేశాలలో శౌచాలయాలను నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్ నందు 11 గదులు ఉండేవిధంగా వీటి నిర్మాణం చేపట్టబడుతుంది. ఒక్కొక్క బ్లాక్ నిర్మాణానికి సుమారు రూ. 25 లక్షల అంచనా వ్యయంతో టైప్ –ఎ మోడల్ నందు నిర్మించడం జరుగుతుంది. ఒక్కొక్క బ్లాక్‌లో అదనంగా స్నానపుగదులు కూడా ఏర్పాటు చేయబడుతాయి. • భక్తుల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి కుమార సదనం వరకు, మరియు యోగివేమారెడ్డి సత్రం వెనుకభాగంలో రూ. 24లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మించాలని తీర్మానించడం జరిగింది. • శ్రావణమాసోత్సవాలలో ప్రధాన గోపురాలకు విద్యుద్దీపాలంకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. • భక్తుల సౌకర్యార్థం నందీశ్వర డార్మెటరీలో డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 39 లక్షలు. • అదేవిధంగా నీలకంఠేశ్వర డార్మెటరీ నందు కూడా డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 23 లక్షలు. • భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్సు నందు అదనపు వాటరు కూలర్సును ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. వీటి అంచనా వ్యయం రూ. 5లక్షలు • ఇ – ప్రొక్యూర్మెంట్ టెండరు విధానంలో పిలువబడిన టెండర్లను అనుసరించి రాబోవు 2027 సంవత్సరపు వివిధ రకాల క్యాలెండర్లను మరియు రెండు రకాల డైరీలను ముద్రించాలని నిర్ణయం. • స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు • అన్నప్రసాద వితరణ భవనములో కూడా రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు.1
- గురుపౌర్ణమి సందర్భంగా కొబ్బరి బొండం పై సాయినాథుని చిత్రం గురుపౌర్ణమి పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన కళారూపం అందరినీ ఆకట్టుకుంటోంది. వెలుగోడుకు చెందిన కళాకారుడు కళ్యాణ్ కొబ్బరి బొండం పై సాయినాథుని దివ్య చిత్రాన్ని వేసి భక్తిని చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి 6 గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈ చిత్రంలో సాయినాథుని దివ్యమైన ముఖారవిందంతో పాటు, ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చిత్రం రూపంలో వివరించినట్లు తెలిపారు.1
- ఆత్మకూరులో తప్పిన పెను ప్రమాదం. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు ఆత్మకూరు పట్టణంలో బుధవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ నుండి ఆత్మకూరుకు కూరగాయల లోడు తో వచ్చిన ఐచర్ వాహనం నంద్యాల టర్నింగ్లో ఓ కుక్కను తప్పించబోయి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు . దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.1