Shuru
Apke Nagar Ki App…
ములుగు జిల్లా కేంద్రంలో గణపతి మండపం వద్ద కుంకుమార్చన పూజలు ములుగు జిల్లా కేంద్రంలో సుభాష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రోజున ఉదయం పూజలో భాగంగా మహిళలు భారీ స్థాయిలో హాజరై కుంకుమ అర్చన పూజలు నిర్వహించారు సరస్వతి దేవిని కొలుస్తూ మొదటి ముక్కుల గణపతిని వేడుకున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు రావాలని యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకాలని గణపతిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళా మణులు గాదం మాధవి పావని, నిఖిత, యాసం సునీత, మద్దెబోయిన రమాదేవి మానస, చిదురాల సరిత వర్షిత తదితర మహిళలు పాల్గొన్నారు
GADAM DEVENDAR
ములుగు జిల్లా కేంద్రంలో గణపతి మండపం వద్ద కుంకుమార్చన పూజలు ములుగు జిల్లా కేంద్రంలో సుభాష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రోజున ఉదయం పూజలో భాగంగా మహిళలు భారీ స్థాయిలో హాజరై కుంకుమ అర్చన పూజలు నిర్వహించారు సరస్వతి దేవిని కొలుస్తూ మొదటి ముక్కుల గణపతిని వేడుకున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు రావాలని యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకాలని గణపతిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళా మణులు గాదం మాధవి పావని, నిఖిత, యాసం సునీత, మద్దెబోయిన రమాదేవి మానస, చిదురాల సరిత వర్షిత తదితర మహిళలు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- ములుగు ప్రజావాణిలో ప్రజల వినతులను పరిశీలించిన కలెక్టర్. ములుగు జిల్లా కేంద్రంలోని నూతనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల ఎంపీడీవో కార్యాలయాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన వెలుతులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. జిల్లా నుండి వివిధ సమస్యలపై ప్రజలు తీసుకొచ్చిన వినతులను కలెక్టర్ స్వీకరించారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ హేమంత్ సహదేవరావు అన్నారు. సుధీర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల సమస్యలు పరిశీలించి స్థానిక మండల అధికారుల ద్వారా త్వరితగదన సమస్యలు పరిష్కరించాలని అధికారులను సూచించారు2
- ములుగు జిల్లా కేంద్రంలోనిరెడ్డి వైన్ షాప్ లో చోరీ. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన షాపు యజమాని సెంటర్ : ములుగు, బ్రేకింగ్ న్యూస్ : ములుగు జిల్లా కేంద్రంలోని రెడ్డి వైన్స్ షాప్ లో దొంగల్ హల్ చల్ క్యాంటీన్ తాళం పగలగొట్టి కిటికీలో నుండి చొరబడి 10 వేయిల నగదు తో పాటు మద్యం బాటిళ్లు అపహరణ 10వేయిల నగదు మద్యం బాటిల్లతో సహా సిసి ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను మాయంచేసిన దొంగలు దొంగతనంపై రెడ్డి వైన్స్ షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ములుగు పోలీసులు ఇదే షాపులో మూడోసారి దొంగలు పడ్డారంటూ తెలిపిని షాప్ యజమాని విజువల్స్.... రెడ్డి వైన్స్ (ములుగు జిల్లా కేంద్రం )1
- డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.1
- మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.2
- 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. 🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏 ఇట్లు జై గణేష్ కమిటీ కొల్లాపురం గ్రామం2
- కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.4
- హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- ఏజెన్సీ రైతులకు వరి సీడ్ డబ్బులు చెల్లించలేదని ఆందోళన. USRH-26 M & F,వరి సీడ్ డబ్బులు చెల్లించలేదని రైతుల ఆందోళన. క్వింటాకు 12000/- చొప్పున ఇస్తామని నమ్మ పలికి మోసం చేసిన సీడ్ కంపెనీ . ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం రైతులు ఆందోళనకు దిగారు. తమ నుంచి మగ, ఆడ విత్తనాలు (మెయిల్, ఫిమేల్ ) సీడ్స్ తీసుకుని, సుమారు రూ.40 లక్షల వరకు డబ్బులు చెల్లించకుండా సీడ్ మధ్యవర్తులు, ఆర్గనైజర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు. సీడ్ తీసుకుని నాలుగు నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన డబ్బులు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. డబ్బుల కోసం నాలుగు నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఆర్గనైజర్ల చుట్టూ తిరుగుతున్నామని 26 మంది రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని శివాపురం, చిన్నబోయినపల్లి, షాపెళ్లి, దొడ్ల, కొత్తూరు గ్రామాలకు చెందిన రైతులు కోరుతున్నారు.1