Shuru
Apke Nagar Ki App…
క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు 🕉️శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట🕉️ 🗓️:4-8-2026 మంగళవారం •శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం రోజు క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయ స్వామికి అర్చక బృందం మన్యం సూక్త పారాయణముతో అభిషేకం నిర్వహించారు. సింధూరంతో అలంకరించిన స్వామివారికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దలార్చన నిర్వహించారు. ఇట్టి ఆకు పూజలో భక్తులు మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....
ARUTLA KISHORE KUMAR
క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు 🕉️శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట🕉️ 🗓️:4-8-2026 మంగళవారం •శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం రోజు క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయ స్వామికి అర్చక బృందం మన్యం సూక్త పారాయణముతో అభిషేకం నిర్వహించారు. సింధూరంతో అలంకరించిన స్వామివారికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దలార్చన నిర్వహించారు. ఇట్టి ఆకు పూజలో భక్తులు మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....
More news from Yadadri Bhuvanagiri and nearby areas
- క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు 🕉️శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట🕉️ 🗓️:4-8-2026 మంగళవారం •శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం రోజు క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయ స్వామికి అర్చక బృందం మన్యం సూక్త పారాయణముతో అభిషేకం నిర్వహించారు. సింధూరంతో అలంకరించిన స్వామివారికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దలార్చన నిర్వహించారు. ఇట్టి ఆకు పూజలో భక్తులు మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....1
- పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా బిఆర్ఎస్ నేతల నివాళులు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఇటీవల ఆకస్మిక మృతి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను,పార్టీ కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.ఆయన మృతి పార్టీకి,తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.1
- రాష్ట్రంలో అసలు క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రి:డా. పాల్వాయి హరీష్ బాబు MLA సిర్పూర్ *రాష్ట్రంలో అసలైన క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రే! తన దగ్గర ఉన్న శాఖలను కూడా సరిగ్గా నిర్వహించలేని చేతకానితనంతో ముఖ్యమంత్రి గారు కాలయాపన చేస్తున్నారు.* నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే ఉద్దేశమే లేదు కానీ ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని మభ్యపెడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తే సిగ్గేస్తోంది. రేపు విద్యార్థులు కనుక రోడ్డెక్కి తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. *డా.పాల్వాయి హరీష్ బాబు గారు,* సిర్పూర్ శాసనసభ సభ్యులు1
- కార్మికులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ* రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల కోసం బస్ భవన్‌లో గళమెత్తిన *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* బస్ భవన్,హైదరాబాద్: హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను ముట్టడించిన టి.జి.ఎస్.ఆర్.టి.సి విశ్రాంతి ఉద్యోగుల ఆందోళన మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బస్ భవన్‌కు చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు మల్లన్నతో పాటు ఐదుగురు రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులకు మాత్రమే అధికారులను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. *2013, 2017,2021 వేతన సవరణ మరియు PF బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్* *ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్న డెడ్ లైన్* *వారం రోజుల్లో బెనిఫిట్స్ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక* *అవసరమైతే కార్మికులతో కలిసి అసెంబ్లీ ముట్టడి...* *ఆర్టీసీ ఎన్నికల్లోనూ పోరాటానికి సిద్ధమని మల్లన్న స్పష్టం* *రేవంత్ రెడ్డి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి* *మహేష్ కుమార్ గౌడ్,పొన్నం సమాధానం చెప్పాలి* * అనంతరం ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై వారిని మల్లన్న నిలదీశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన PF, EPS-95, PF కాంట్రిబ్యూషన్, డీఏ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని మండిపడ్డారు. 2013లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎంప్లాయర్ వాటా PF ఇప్పటికీ చెల్లించలేదని, 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు 2021 నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఉద్యోగులు జీవితాంతం సంస్థ కోసం కష్టపడితే, రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సిన కష్టార్జిత సొమ్మును నిలిపివేయడం అమానుషమని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై మల్లన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని,సమ్మె సమయంలో కార్మికులకు అండగా ఉన్నట్లు చెప్పుకున్న ప్రభుత్వం,తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఢిల్లీ మాదిరి ఉద్యమం ఈ తెలంగాణలో పుట్టిస్తానని మల్లన్న స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి ఒక సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నందు వలన ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉండడం దురదృష్టకరమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఆర్టీసీ కార్మికులు రేవంత్ సర్కార్ ను బొందపెడుతుందని హెచ్చరించారు. "17 వేల మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా తీన్మార్ మల్లన్న ఉన్నాడని,వారి హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే బస్ భవన్ ను అర్రాస్ పాట పెట్టి అమ్మైనా సరే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించుకుంటామని ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, లేకుంటే డిల్లీ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేవలం వారం రోజులే రేవంత్ సర్కార్ కు డెడ్ లైన్ అని హెచ్చరించారు. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ "దమ్ముంటే ఎన్నికలకు రండి... నేను ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వస్తా...రేవంత్ తన బొమ్మతో,కాంగ్రెస్ పార్టీ జెండాతో రావాలని... కార్మికులే తీర్పు చెబుతారు" అంటూ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. "కార్మికులను మోసం చేస్తే ప్రభుత్వం, అధికారులు ఇద్దరూ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని,ఆర్టీసీ ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు" అని మల్లన్న హెచ్చరించారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయడంతో పాటు అసెంబ్లీ ముట్టడి సహా భారీ ఉద్యమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని, వారి హక్కుల సాధన కోసం శాసనమండలిలో, ప్రజాక్షేత్రంలోనూ తీన్మార్ మల్లన్నగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ ,రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్,గ్రేటర్ హైదరాబాద్ జోన్ BWU గౌరవ అధ్యక్షుడు TVR,తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క,సహాయ కార్యదర్శి గిరిగాని బిక్షపతి గౌడ్,రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- UPI చెల్లింపులకు నో ఛార్జీ కేంద్రం క్లారిటీ... ₹3వేలు దాటిన UPI చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(MDR) వసూలు చేస్తారనే ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. డిజిటల్ చెల్లింపులు ఫ్రీగానే కొనసాగుతాయని తెలిపింది. BHIM-UPI, UPI క్యూఆర్, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జ్ ఉండదని స్పష్టం చేసింది. అయితే వాలెట్ల ద్వారా UPIతో జరిపే ₹2వేల పైన వ్యాపార లావాదేవీలకు 1.1% ఛార్జ్ ఉంటుంది. రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకూ MDR వర్తిస్తుంది.1
- కాంగ్రెస్ ‘6 గ్యారెంటీలు’ గాలికి.. ‘6 సీ’లతో తెలంగాణ దోపిడీ: ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా పాలనలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి, కొత్తగా ‘6 సీ’ల దోపిడీ పాలనను సాగిస్తోందని ఆరోపించారు. నేరాలు, అవినీతి, కమీషన్లు, కాంట్రాక్టులు, హైకమాండ్‌కు కప్పం, ప్రభుత్వ వ్యవస్థలపై ఆధిపత్యం అనే ‘6 సీ’లతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు పెరుగుతుండగా ప్రభుత్వ ఆస్తులు తగ్గిపోతున్నాయని, మంత్రుల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయని ఆరోపించారు. రెండున్నరేళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను 40 సార్లకు పైగా బదిలీ చేశారని, ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు లేదని విమర్శించారు. అవినీతి కేసుల్లో తెలంగాణ అధికారులు అగ్రస్థానంలో ఉన్నారని, గత మూడు నెలల్లో ఏసీబీ 67 కేసులు నమోదు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా-ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసుల విచారణలను నీరుగార్చిందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రతి మండలంలో బీజేపీ శ్రేణులు నిలదీస్తాయని డాక్టర్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు.1
- వర్షం, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులతో ఘట్‌కేసర్–ఉప్పల్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ నిన్న కురిసిన వర్షం కారణంగా పలువురు ఉద్యోగులు ప్రజా రవాణాకు బదులుగా తమ సొంత వాహనాల్లో విధులకు వెళ్లడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. అదే సమయంలో ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటం కూడా ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణంగా మారింది. ఈ రెండు కారణాలతో ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదిలాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు4
- జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ బచ్చన్నపేట మండలం నుంచి తరలించొద్దు : దేశాయి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ యజమానము దుద్దెడకు తరలిస్తున్న కంపెనీ యజమానాన్ని విరమించుకోవాలని దేశాయి బీడీ కార్మికుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు గత 30 సంవత్సరాల క్రితం ఇందులో ఉపాధి పొందుతున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్న సందర్భంగా రిలే నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తూ అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధమని కార్మికులు తెలిపారు ఇందులో మినిమం 1000 కుటుంబాలు ఉన్నాయి దేశాయి బీడీ కంపెనీ తీసివేయడం వల్ల వేల కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితికి వచ్చింది యజమాన్యం ఇప్పటికైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకోకుంటే మంచిదని లేకుంటే ఆమరణ నిరాహార దీక్షచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు తెలిపారు2